IND Vs ENG 1st T20I Highlights: ఈ విజయం బౌలర్లదే - ఇంగ్లండ్‌పై మొదటి టీ20లో భారత్ విక్టరీ!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టీ20లో టీమిండియా 50 పరుగులతో విజయం సాధించింది.

FOLLOW US: 

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై టీమిండియా 50 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది.

చివర్లో తడబడ్డ టీమిండియా
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రోహిత్ శర్మను (24: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొయిన్ అలీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా (33: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (39: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా రాణించారు.

అయితే వీరు ముగ్గురూ అవుటయ్యాక స్కోరు వేగం పూర్తిగా మందగించింది. దినేష్ కార్తీక్ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో పాటు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసుకోగా... రీస్ టాప్లే, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్‌లకు చెరో వికెట్ దక్కింది.

అదరగొట్టిన బౌలర్లు
199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భీకరమైన ఫాంలో ఉన్న కెప్టెన్, ఓపెనర్ జోస్ బట్లర్ (0: 1 బంతి) తాను ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. భువీ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బట్లర్‌ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ భరతం పట్టే పని పాండ్యా తీసుకున్నాడు. ఇన్నింగ్స్  ఐదో ఓవర్లో డేవిడ్ మలన్ (21: 14 బంతుల్లో, నాలుగు ఫోర్లు), లియాం లివింగ్ స్టోన్ (0: 3 బంతుల్లో), ఏడో ఓవర్లో జేసన్ రాయ్‌లను (4: 16 బంతుల్లో) పాండ్యా అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 33 పరుగులకే ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది.

హ్యారీ బ్రూక్ (28: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), మొయిన్ అలీ (36: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఇక్కడ చాహల్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన వారిలో క్రిస్ జోర్డాన్ (26: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా అది మ్యాచ్ గెలవడానికి ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా... అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. భువీ, హర్షల్ పటేల్‌లు చెరో వికెట్ పడగొట్టారు.

Published at : 08 Jul 2022 03:05 AM (IST) Tags: Rohit Sharma IND vs ENG Rishabh Pant IND Vs ENG 1st T20I 1st T20I IND Vs ENG 1st T20I Highlights IND Vs ENG 1st T20I Match Highlights

సంబంధిత కథనాలు

IND vs WI 5th T20I: టాస్ గెలిచిన టీమిండియా - బ్యాటింగ్‌కే ఫిక్స్!

IND vs WI 5th T20I: టాస్ గెలిచిన టీమిండియా - బ్యాటింగ్‌కే ఫిక్స్!

IND vs WI 5th T20 Live Streaming: నిన్న ఆలస్యం! నేడైనా 8కి మొదలవుద్దా? ఐదో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు!

IND vs WI 5th T20 Live Streaming: నిన్న ఆలస్యం! నేడైనా 8కి మొదలవుద్దా? ఐదో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు!

IND vs WI 4th T20 Live Streaming: అమెరికాకు మారిన వేదిక! నాలుగో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్టింగ్‌, వేదిక ఏంటి?

IND vs WI 4th T20 Live Streaming: అమెరికాకు మారిన వేదిక! నాలుగో టీ20 లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్టింగ్‌, వేదిక ఏంటి?

T20 World cup: ప్రపంచకప్‌లో ఆ ముగ్గురు బౌలర్లు ఉండాల్సిందే! లేదంటే..

T20 World cup: ప్రపంచకప్‌లో ఆ ముగ్గురు బౌలర్లు ఉండాల్సిందే! లేదంటే..

Paytm Home Series: హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌! సెప్టెంబర్‌ 25న భారత్‌, ఆసీస్‌ టీ20 పోరు!

Paytm Home Series: హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌! సెప్టెంబర్‌ 25న భారత్‌, ఆసీస్‌ టీ20 పోరు!

టాప్ స్టోరీస్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?

Rabindranath Tagore: ఐన్‌స్టీన్‌, రవీంద్రనాథ్ ఠాగూర్ మంచి స్నేహితులని మీకు తెలుసా?