ROHIT SHARMA: రోహిత్‌కు తీవ్ర గాయం - భారత్‌కు తిరిగిరానున్న కెప్టెన్!
రోహిత్‌తో పాటు దీపక్ చాహర్, కుల్దీప్ సేన్‌లకు కూడా గాయం అయింది. ఈ విషయాన్ని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. రోహిత్ ఎడమ చేతి బొటన వేలికి గాయం కావడంతో స్కానింగ్ కోసం తరలించారు. రోహిత్ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతను టెస్ట్ సిరీస్‌లో ఆడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ విషయాన్ని తెలిపాడు.
రెండో మ్యాచ్ ముగిసిన తర్వాత నిపుణుల సలహా కోసం రోహిత్ తిరిగి ముంబైకి వెళ్తాడని, వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు దూరం కానున్నాడని ద్రవిడ్ తెలిపాడు. ఇది కాకుండా రోహిత్ టెస్ట్ సిరీస్‌కు తిరిగి రాగలడా లేదా అనే దానిపై కూడా ద్రవిడ్ ఖచ్చితంగా తెలపలేదు. రోహిత్ బొటనవేలులో ఎటువంటి ఫ్రాక్చర్ లేనప్పటికీ, అతని గాయం తీవ్రంగా ఉండవచ్చు.
రోహిత్ కాకుండా భారత జట్టులోని మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ముంబైకి తిరిగి రానున్నారు. దీపక్ చాహర్, కుల్దీప్ సేన్‌లను కూడా వెనక్కి పంపనున్నారు. రెండో వన్డే ఆడుతున్న దీపక్ గాయంతో ఇబ్బంది పడుతుండగా, అన్ క్యాప్డ్ ఆటగాడు కుల్దీప్ సేన్ వెన్నులో గాయంతో ఉన్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు తిరిగి వెళ్లి ఎన్‌సీఏకి నివేదించవచ్చు.
గాయంతో ఉన్నప్పటికీ బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్
ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ గాయపడ్డాడు. ఆ తర్వాత అతన్ని స్కాన్ కోసం తీసుకెళ్లారు. మళ్లీ ఫీల్డింగ్‌కు రాకపోవడంతో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నందున రోహిత్ తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రోహిత్ 28 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేసి భారత్‌ను విజయానికి చేరువ చేసినా, టార్గెట్‌ను దాటించలేకపోయాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 41 పరుగులు చేయాల్సి ఉండగా, ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
View this post on Instagram
View this post on Instagram