KL Rahul: ఇలా ఆడితే కేఎల్ రాహుల్‌కు కష్టమే - మాజీ క్రికెటర్ అభిప్రాయం ఇదే!
త్వరలో కేఎల్ రాహుల్ తుదిజట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందని మాజీ భారత ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు.
KL Rahul India vs Australia: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించలేకపోయాడు. పిచ్‌పై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను నిరంతరం కష్టపడ్డాడు. తన పేలవ ప్రదర్శనతో రాహుల్ విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా అతనిపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు రాహుల్ దూరమయ్యే అవకాశం ఉందని జాఫర్ చెప్పాడు.
బంగ్లాదేశ్‌లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు మ్యాచ్‌ల హోమ్ టెస్ట్ సిరీస్‌కు రాహుల్ తుదిజట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ 22, 23, 10 మరియు 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ముఖ్యంగా ఈ భారత ఓపెనర్ 2022లో నాలుగు టెస్టుల్లో 17.13 సగటుతో 137 పరుగులు మాత్రమే చేశాడు.
వసీం జాఫర్ అభిప్రాయం ప్రకారం కేఎల్ రాహుల్ మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ వస్తే కేఎల్ తప్పుకోవాల్సి ఉంటుంది. 145 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి కష్టపడటంపై కూడా జాఫర్ స్పందించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించేందుకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అనుమతించారన్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్‌ల డిఫెండింగ్ వ్యూహాన్ని కూడా ప్రశ్నించాడు.
బంగ్లాదేశ్ భారత్‌పై తొలి టెస్టు విజయం సాధించేలా కనిపించింది. అయితే శ్రేయాస్ అయ్యర్ (46 బంతుల్లో 29 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (62 బంతుల్లో 42 నాటౌట్) 105 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి మ్యాచ్ గెలిపించారు.
Also Read: World Test Championship: ప్రపంచ ఛాంపియన్ ఫైనల్స్ వైపు టీమిండియా అడుగు - పోటీలో మరో మూడు జట్లు!
View this post on Instagram
View this post on Instagram