World Test Championship: ప్రపంచ ఛాంపియన్ ఫైనల్స్ వైపు టీమిండియా అడుగు - పోటీలో మరో మూడు జట్లు!
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్ వైపు అడుగులు వేసింది.
WTC Points Table: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా 2-0తో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇది కాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు స్థానం చాలా పటిష్టంగా మారింది. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది.
సిరీస్‌కు ముందు మూడో స్థానంలో...
బంగ్లాదేశ్‌తో సిరీస్ గెలవడానికి ముందు భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఓటమి, బంగ్లాదేశ్‌పై భారత జట్టు విజయం తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు 58.93 శాతం మార్కులతో రెండో స్థానంలో ఉంది.
దక్షిణాఫ్రికా జట్టు మూడో స్థానంలో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికాకు 54.55 శాతం మార్కులు ఉన్నాయి. ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
ప్రస్తుత సమీకరణం ఎలా ఉంది?
వాస్తవానికి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్-2 జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. భారత జట్టు ఆస్ట్రేలియాను 4-0తో ఓడించినట్లయితే, అప్పుడు స్కోరు 68.1 శాతం అవుతుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఆడడం దాదాపు ఖరారైనట్టే. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా నంబర్‌వన్‌గా ఉంది. కాగా రెండో స్థానం కోసం టీమిండియాతో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటి జట్ల మధ్య పోరు నెలకొంది.
View this post on Instagram
View this post on Instagram