సూర్యకుమార్‌పై నమ్మకం లేదా? జడేజా నిలబెట్టుకోలేకపోయాడా?
World Cup 2023 Final: రవీంద్ర జడేజా చివరిసారిగా 2013 జనవరి 15న భారత గడ్డపై 50 పరుగుల మార్కు దాటాడు. ఆ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి.
India vs Australia World Cup 2023 : గత పదేళ్లుగా భారత గడ్డపై వన్డేల్లో 50 పరుగులు చేయని జడేజాపై ఎందుకు టీమిండియా నమ్మకం పెట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఆయన్ని ముందు పంపించడంపై చాలా మంది క్రీడా విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమార్‌పై నమ్మకం లేకనే జడేజాను ముందు పంపించారా అనే అనుమానం చాలా మందిలో కనిపిస్తోంది.
80 పరుగుల వద్దే మూడు కీలక వికెట్లు కోల్పియిన టీమిండియాను కోహ్లీ, కెఎల్ రాహుల్ ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే హాప్ సెంచరీ అయిన తర్వాత 148 పరుగుల వద్ద అవుటయ్యాడు. 54 పరుగులు చేసిన కోహ్లీ కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత సూర్యకుమార్ వస్తాడని అంతా అనుకున్నారు. కానీ మేనేజ్‌మెంట్ రవీంద్ర జడేజాను ఆరో స్థానంలో పంపించారు. సూర్యకుమార్‌ను ఏడో స్థానానికి పంపించారు.
వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. సూర్యకుమార్ స్థానంలో రవీంద్ర జడేజాను పంపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే గత పదేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో భారత గడ్డపై 50 పరుగుల మార్కును టచ్ చేయని రవీంద్ర జడేజాను ఆరో స్థానంలో పంపించడంపై అంతా షాక్ తిన్నారు. సూర్యకుమార్ యాదవ్ కంటే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారనే ప్రశ్న గట్టిగా వినిపించింది. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టు మేనేజ్మెంట్‌కు నమ్మకం లేదా? అనే క్వశ్చన్ చేశారు.
రవీంద్ర జడేజా చివరిసారిగా 2013 జనవరి 15న భారత గడ్డపై 50 పరుగుల మార్కు దాటాడు. ఆ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. రవీంద్ర జడేజా 37 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అది జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడిచాయి. అప్పటి నుంచి రవీంద్ర జడేజా భారత గడ్డపై వన్డే ఫార్మాట్లో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు.
అలాంటి ఆటగాడిని లెఫ్ట్ హాండ్ రైట్ హ్యాంగ్ కాంబినేషన్ కోసం ఆరో స్థానంలో పంపించారు. కానీ ఈ అవకాశాన్ని జడేజా వినియోగించుకోలేకపోయాడు. ఎలాంటి ప్రభావం చూపకుండానే పెవెలియన్‌కు చేరాడు. రవీంద్ర జడేజా జోష్ హజిల్‌వుడ్ బౌలింగ్ జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 22 బంతులు ఎదుర్కొన్న జడేజా 9 పరుగులే చేశాడు.