IND Vs AUS 5th T20: నేడే నామమాత్రపు మ్యాచ్, మార్పులతో బరిలోకి భారత్
India Vs Australia 5th T20 Live Updates: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌లు టీ ట్వంటీ సిరీస్‌లో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా నామమాత్రపు చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది.
ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌లు టీ ట్వంటీ సిరీస్(T20 Series) లో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా (Team India) నామమాత్రపు చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే మూడు టీ 20 మ్యాచుల్లో విజయం సాధించిన యువ భారత్... నేటి మ్యాచ్‌లోనూ గెలిచి సాధికారంగా సిరీస్ ముగించాలని చూస్తోంది. శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌లో రాణించి దక్షిణాఫ్రికాతో జరిగే టీ 20 సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని చూస్తున్నారు. ప్రపంచ కప్‌లో అయ్యర్ మంచి టచ్‌లో ఉన్నా ఆసిస్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. 7 బంతుల్లో కేవలం ఎనిమిది పరుగులు చేసి ఆ మ్యాచ్‌లో అయ్యర్ అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌పై అయ్యర్ కన్నేశాడు. భారత జట్టు ఇప్పటికే 3-1 ఆధిక్యంలో ఉన్నందున సిరీస్ ఫలితం గురించి ఆందోళన పడకుండా భారీ స్కోర్లపై దృష్టి పెట్టాలని భారత బ్యాటర్లు భావిస్తున్నారు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. జితేష్ శర్మ, సూర్యకుమార్, రుతురాజ్ గైక్వాడ్, రింకు సింగ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఈ సిరీస్‌లో పర్వాలేదనిపిస్తున్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఏడు వికెట్లు పడగొట్టి ఈ సిరీస్‌లో బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఊపందుకుంటున్నది. గత రెండు నెలలుగా భారత్‌లోనే ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో గెలిచి స్వదేశానికి పయనమవ్వాలని చూస్తోంది.
భారత్(Bharat) వేదికగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న 5 మ్యాచ్ ల T20 సీరీస్లో యువ భారత్ సత్తా చాటింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం చేసుకొని T20 ప్రపంచ కప్ (T20 World Cup) కి ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయాగా, ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగు చేసింది. దీంతో యువ భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే ఉత్సాహంలో ఆఖరి మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ఈ గెలుపు ఉత్సాహంతో సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాలనుకుంటోంది. మరోవైపు ఆసీస్ మాత్రం పరువు కోసం పాకులాడుతోంది. చివరి మ్యాచ్ గెలిచి భారత పర్యటనను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది. బెంగళూరు మైదానం చిన్నది కావడంతో మరోసారి పరుగుల వరద అభిమానులను ముంచెత్తనుంది.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, కేన్ రిచర్డ్‌సన్.