IND Vs AUS, Innings Highlights: ఆసీస్ లక్ష్యం 160, ఆడతారా? ఓడతారా ?
IND Vs AUS, Innings Highlights: టీం ఇండియా నోర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది
భారత్(Bharat) వేదికగా ఆస్ట్రేలియా(Austrelia)తో జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్(T20 Match) లో భారత బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసారు. అయిదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను ఇప్పటికే3-1తో దక్కించుకున్న టీమిండియా... చివరిదైన అయిదో టీ 20లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో మరోసారి టాస్ గెలిచిన కంగారులు.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. నాలుగు ఓవర్లలో 33 పరుగులు జోడించారు. కానీ 15 బంతుల్లో 1 ఫోరు, రెండు సిక్సర్లతో 21 పరుగులు చేసి యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. అదే 33 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి రుతురాజ్ గైక్వాడ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత అయిదు పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్, ఆరు పరుగులు చేసి ఫినిషర్ రింకూసింగ్ వెనుదిరగడంతో 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. కానీ శ్రేయస్స్ అయ్యర్ టీమిండియాను ఆదుకున్నాడు. సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. శ్రేయస్ అయ్యర్ 37 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 53 పరుగుల చేసి రాణించాడు. భారత బ్యాటర్లు ఇచ్చిన స్కోర్ తో ఆస్ట్రేలియా గెలుపు అవకాశాలు మెరుగు గానే ఉన్నాయి. అయితే పిచ్ పెద్దగా అనుకూలంగా లేని కారణంగా మ్యాచ్ భవిష్యత్తును నిర్ణయించలేము. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌లు టీ ట్వంటీ సిరీస్‌లో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా కు ఇది నామమాత్రపు చివరి మ్యాచ్. అయితే ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సాధికారంగా సిరీస్ ముగించాలని యువ భారత్ భావిస్తోంది.
భారత్(Bharat) వేదికగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న 5 మ్యాచ్ ల T20 సీరీస్లో యువ భారత్ సత్తా చాటింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం చేసుకొని T20 ప్రపంచ కప్ (T20 World Cup) కి ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయాగా, ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగు చేసింది. దీంతో యువ భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే ఉత్సాహంలో ఆఖరి మ్యాచ్ కూడా గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ఈ గెలుపు ఉత్సాహంతో సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరాలనుకుంటోంది. మరోవైపు ఆసీస్ మాత్రం పరువు కోసం పాకులాడుతోంది. చివరి మ్యాచ్ గెలిచి భారత పర్యటనను విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది.
ఈ సిరీస్ లో టీమిండియా మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. పాకిస్థాన్ పేరిట ఉన్నఒక ప్రపంచరికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. టీ20 క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకూ 213 మ్యాచ్‌లు ఆడిన భారతజట్టు.. 136 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇప్పటి వరకూ ఈ రికార్డు పాకిస్థాన్ జట్టు పేరు మీద ఉండేది. టీ20 ఫార్మాట్లో 226 మ్యాచ్‌లు ఆడిన పాక్.. 135 మ్యాచ్‌లలో గెలుపొందింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో గెలుపొందిన భారత్.. పాకిస్థాన్‌ను అధిగమించి ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది.