అన్వేషించండి

IND vs AUS 3rd test: ఇండోర్ లో సిరీస్ డిసైడర్ మ్యాచ్- రేపు భారత్- ఆస్ట్రేలియా మూడో టెస్ట్

IND vs AUS 3rd test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రేపట్నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇండోర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

IND vs AUS 3rd test:  బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రేపట్నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇండోర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి 2 టెస్టులు గెలిచిన భారత్ సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా సిద్ధమవుతోంది. మరోవైపు మిగతా 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ అనుకుంటోంది. మరి ఈ మ్యాచ్ లోనూ గెలిచి టీమిండియా సిరీస్ సాధిస్తుందా లేక ఆసీస్ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుందా.. చూడాలి. 

హై పిచ్ లో భారత్

బలమైన ఆస్ట్రేలియా జట్టును 2 టెస్టుల్లో చిత్తుగా ఓడించడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేసింది. కేఎల్ రాహుల్ తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ చెప్పుకోదగ్గ ఫాంలోనే ఉన్నారు. కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతను అదే జోరును కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. కోహ్లీ, పుజారా, భరత్ లు సమయానుకూలంగా ఆడుతున్నారు. లోయరార్డర్ లో అశ్విన్, జడేజా, అక్షర్ లు జట్టుకు ఉపయోగపడే పరుగులు చేస్తున్నారు. ఈ స్పిన్ త్రయం బౌలింగ్ లోనూ అదరగొడుతోంది. ముఖ్యంగా ఈ సిరీస్ తో పునరాగమనం చేసిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అత్యుత్తమంగా ఆడుతున్నాడు. కాబట్టి భారత్ కు పెద్దగా సమస్యలేవీ లేవనే చెప్పాలి. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఒక స్పిన్నర్ బదులు ఇంకో పేసర్ ను అదనంగా తీసుకునే అవకాశముంది. అదే జరిగితే ఉమేష్ యాదవ్ కానీ, జైదేవ్ ఉనద్కత్ కానీ జట్టులోకి వస్తారు. 

ఈ ఇద్దరిలో ఎవరు!

కేఎల్ రాహుల్ తొలి 2 టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. అసలు గత కొన్నాళ్లుగా రాహుల్ ఫాంలో లేడు. పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. జట్టులో అతని ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుసగా విఫలమవుతున్నా ఎందుకు అవకాశాలిస్తున్నారంటూ మాజీలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ స్థానంలో సూపర్ ఫాంలో ఉన్నశుభ్ మన్ గిల్ ను ఆడించాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే కోచ్, కెప్టెన్ మాత్రం రాహుల్ కు ఇప్పటికీ మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మూడో టెస్టులో రోహిత్ కు తోడుగా ఈ ఇద్దరిలో ఎవరు ఓపెనింగో చేస్తారో చూడాలి. 

ఆసీస్ నిలబడుతుందా!

సొంత గడ్డపై భారత్ ను ఓడించడం ఎంత కష్టమో ఆస్ట్రేలియాకు ఇప్పటికే అర్థమైపోయింది. స్పిన్ కు అనుకూలించిన పిచ్ లపై ఆసీస్ బ్యాటర్లను టీమిండియా స్పిన్నర్లు హడలెత్తించారు. ప్రాక్టీసులో ఎంతగా స్పిన్ ను సాధన చేసినా అసలు మ్యాచుల్లో మన స్పిన్ త్రయం ముందు కంగారూలు తలవంచక తప్పలేదు. దీంతో 2 టెస్టులు 6 రోజుల్లోనే ముగిశాయి. అయితే మూడో టెస్ట్ జరిగే ఇండోర్ పిచ్ పై బౌన్స్ ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు క్రీజులో నిలబడితే బ్యాటర్లు భారీస్కోరు సాధించవచ్చని అంటున్నారు. ఆసీస్ అంటే భీకరమైన పేస్ బౌలర్లకు ప్రసిద్ధి. ఒకవేళ పిచ్ అందరూ అనుకుంటున్నట్లే పేస్ కు సహకరిస్తే ఆ జట్టుకు గెలిచే అవకాశముంటుంది. బ్యాటింగ్ లో ఖవాజా, లబూషేన్, స్మిత్ లపై ఆ జట్టు ఎక్కువ ఆధారపడుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆడని కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ లు జట్టుతో చేరడం వారికి బలాన్నిచ్చేదే.  తొలి 2 టెస్టుల ఫలితం పునరావృతమవుతుందా లేక మారుతుందా అనేది చూద్దాం.

పాట్ కమిన్స్ దూరం

మూడో టెస్టుకు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం అయ్యాడు. అతను వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కమిన్స్ స్థానంలో స్టీవెన్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

డబ్ల్యూటీసీ ఫైనల్

ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ టెస్ట్ గెలిస్తే మిగతా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అధికారికంగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. డ్రా చేసుకున్నా భారత్ కు ఢోకా ఉండదు. అయితే ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలపై అది ప్రభావం చూపిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా కనీసం డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆఖరి పోరుకు అర్హత సాధిస్తుంది. 

భారత తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (లేదా) శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్. భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ (లేదా) జైదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా)

ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాట్ రెన్ షా, పీటర్ హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్.

టాప్ హెడ్ లైన్స్

Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Abhishek ODI Place: వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget