ICC ODI World Cup 2023: ఆ రెండు జట్లు కన్ఫర్మ్ - వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అప్డేటెడ్ షెడ్యూల్ ఇదే
జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే వరల్డ్ కప్ కు అర్హత సాధించిన జట్లేవో తేలిపోయింది.
![ICC ODI World Cup 2023: ఆ రెండు జట్లు కన్ఫర్మ్ - వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అప్డేటెడ్ షెడ్యూల్ ఇదే ICC ODI World Cup 2023 Team India Full Schedule Revealed As Netherlands and Sri Lanka Qualify CWC ICC ODI World Cup 2023: ఆ రెండు జట్లు కన్ఫర్మ్ - వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా అప్డేటెడ్ షెడ్యూల్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/038abe47ce3ee1e2eb74e41ad2050b001688711518105582_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC ODI World Cup 2023: పదేండ్ల తర్వాత భారత్ వేదికగా జరుగబోతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇదివరకే నేరుగా అర్హత సాధించిన 8 జట్లతో పాటుగా వాటికి జతకలిసే రెండు జట్లేవో తేలిపోయింది. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో స్కాట్లాండ్ ను ఓడించిన నెదర్లాండ్స్.. అక్టోబర్ లో జరుగబోయే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది. ఇంతకుముందే శ్రీలంక కూడా క్వాలిఫై అయిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం విడుదలైన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ లో భారత్, ఇతర జట్లకూ క్వాలిఫయర్స్ ప్రత్యర్థులు ఖాయమయ్యారు. అక్టోబర్ ఐదు నుంచి మొదలుకాబోయే ఈ టోర్నీలో అదే నెల 8న భారత్.. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. క్వాలిఫైయర్ జట్లు తేలిపోవడంతో భారత పూర్తి షెడ్యూల్ కింది విధంగా ఉంది.
టీమిండియా అప్డేటెడ్ షెడ్యూల్ :
- అక్టోబర్ 08 : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా - చెన్నై
- అక్టోబర్ 11 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ - ఢిల్లీ
- అక్టోబర్ 15 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ - అహ్మదాబాద్
- అక్టోబర్ 19 : ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ - పూణె
- అక్టోబర్ 22 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ - ధర్మశాల
- అక్టోబర్ 29 : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ - లక్నో
- నవంబర్ 02 : ఇండియా వర్సెస్ శ్రీలంక - ముంబై
- నవంబర్ 05 : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా - కోల్కతా
- నవంబర్ 11 : ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ - బెంగళూరు
- భారత్ ఆడబోయే మ్యాచ్ లు అన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచే జరుగుతాయి.
Indian team schedule for World Cup 2023:
— Johns. (@CricCrazyJohns) July 6, 2023
IND vs AUS, Oct 8, Chennai
IND vs AFG, Oct 11, Delhi
IND vs PAK, Oct 15, Ahmedabad
IND vs BAN, Oct 19, Pune
IND vs NZ, Oct 22, Dharamsala
IND vs ENG, Oct 29, Lucknow
IND vs SL, Nov 2, Mumbai
IND vs SA, Nov 5, Kolkata
IND vs NED, Nov 11,… pic.twitter.com/vFqUhru5oH
2011లో భారత్ ప్రపంచకప్ గెలిచిన చోటే (వాంఖెడే - ముంబై) టీమిండియా శ్రీలంకతో తలపడనుండటం విశేషం. ఇక భారత చివరి లీగ్ మ్యాచ్ నవంబర్ 11న నెదర్లాండ్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా జరుగనుంది.
హైదరాబాద్ లో..
శ్రీలంక, నెదర్లాండ్స్ వరల్డ్ కప్ లో తమ బెర్తులను ఖాయం చేసుకోవడంతో హైదరాబాద్ లో ఈ జట్లు ఆడబోయే మ్యాచ్ ల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. హైదరాబాద్ ఈ వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లకే ఆతిథ్యమిస్తుండగా అందులో రెండు క్వాలిఫయర్ టీమ్స్ తో ఉన్నవే..
1. అక్టోబర్ 06 : పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక
2. అక్టోబర్ 09 : న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక
3. అక్టోబర్ 12 : పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్
GET YOUR CALENDARS READY! 🗓️🏆
— ICC Cricket World Cup (@cricketworldcup) June 27, 2023
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/dakTklwcYe
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)