అన్వేషించండి

ODI World Cup 2023: ఒకే రోజు గణేశ్‌ నిమజ్జనం - మిలాద్‌ ఉన్ నబీ! పాక్‌ vs కివీస్‌ పోరుకు భద్రత కష్టమే!

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో హైదరాబాద్‌కు మ్యాచులే కేటాయించలేదు! అభిమానులను సంతృప్తి కోసం వార్మప్ మ్యాచులు నిర్వహిస్తున్నారు. అందులోనూ ఒక మ్యాచుపై ఇప్పుడు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి.

ODI World Cup  2023: 

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో హైదరాబాద్‌కు అసలు మ్యాచులే కేటాయించలేదు! ఏదో అభిమానులను సంతృప్తి పరిచేందుకు వార్మప్ మ్యాచులు నిర్వహిస్తున్నారు. అందులోనూ ఒక మ్యాచుపై ఇప్పుడు నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ ప్రాక్టీస్‌ మ్యాచుకు రక్షణ కల్పించలేమని పోలీసులు అంటున్నారని సమాచారం.

ఉప్పల్‌ స్టేడియంలో సెప్టెంబర్‌ 29న పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ సన్నాహక మ్యాచ్‌ ఆడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు పోరు మొదలవుతుంది. అరగంట ముందే టాస్‌ వేస్తారు. పెద్ద జట్లే కావడంతో ఆటగాళ్లు, మ్యాచును వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా. అయితే ఈ మ్యాచుకు భద్రత కల్పించలేమని రాచకొండ పోలీసులు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి సమాచారం ఇచ్చారని తెలిసింది.

సెప్టెంబర్‌ 28న గణేశ్ నిమజ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ ఉన్నాయి. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ రెండు వేడుకలు ఓకే రోజు వస్తున్నాయి. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం వేల మంది పోలీసులను ప్రభుత్వం నియోగించనుంది. ఇక మ్యాచ్ జరిగే రోజూ నిమజ్జనం కొనసాగుతుంది. అలాంటప్పుడు ముందు రోజే 24 గంటలు డ్యూటీ చేసిన పోలీసులు అలసిపోయే ప్రమాదం ఉంది. దాంతో మ్యాచుకు బందోబస్తు కష్టమని పోలీసు ఉన్నతాధికారులు హెచ్‌సీఏకు తెలిపారు. ఈ మేరకు మ్యాచ్‌ తేదీని మార్చాలని బీసీసీఐకి హైదరాబాద్ క్రికెట్‌ సంఘం విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.

రెండు రోజుల క్రితమే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో తలపడే జట్టును న్యూజిలాండ్‌ ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ - చెన్నై  మ్యాచ్‌లో గాయమై శస్త్రచికిత్స చేయించుకొని ఇన్నాళ్లూ ఆటకు దూరమైన  కేన్ మామ  తిరిగి జాతీయ జట్టుతో చేరాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కివీస్  నలుగురు  పేసర్లు,  ఇద్దరు పేస్ ఆల్ రౌండర్లు,   ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. మిగిలినవారిలో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉన్నారు. కాగా  గతేడాది  కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వ్యక్తిగత కారణాల రీత్యా   న్యూజిలాండ్ బోర్డు కాంట్రాక్టు వదులకున్నా అతడిని ప్రపంచకప్ నేపథ్యంలో జట్టులో చేర్చారు. బౌల్ట్‌తో పాటు జేమ్స్ నీషమ్ కూడా  కాంట్రాక్టు లేకున్నా  వరల్డ్ కప్ జట్టులో చేరాడు.  ఇక  ఇంగ్లాండ్‌తో వన్డేలకు దూరమైన కైల్ జెమీసన్, ఆడమ్ మిల్నేలకు నిరాశతప్పలేదు.

వన్డే ప్రపంచకప్‌కు న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్  (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్‌, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాథ్యూ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్),  డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి,  టిమ్ సౌథీ, విల్ యంగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగామెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం
Game Changer Pre Release Event: కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
కాకినాడలో 'గేమ్‌ ఛేంజర్‌' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ - ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రామ్‌ చరణ్‌
AR Rahman Saira Divorce: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
Overstay in Lavatory: టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Embed widget