Hardik Natasa Divorce: హార్థిక్ - నటాషా విడాకులు, ‘ఇది చాలా కష్టమైన నిర్ణయం’ అంటూ పోస్ట్
Hardik Pandya Natasa Stankovic Mutual Divorce: హార్థిక్, నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడింది.
![Hardik Natasa Divorce: హార్థిక్ - నటాషా విడాకులు, ‘ఇది చాలా కష్టమైన నిర్ణయం’ అంటూ పోస్ట్ Hardik Pandya and Natasa Stankovic Announce Divorce officially Hardik Natasa Divorce: హార్థిక్ - నటాషా విడాకులు, ‘ఇది చాలా కష్టమైన నిర్ణయం’ అంటూ పోస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/18/f6f666001b520c8969ec001a9b5f6d711721319614712234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hardik Pandya Natasa Stankovic Divorce: భారత క్రికెటర్ హార్థిక్ పాండ్యా, స్పెయిన్ మోడల్ నటాషా స్టాంకోవిక్ విడాకులు తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తాము విడాకులు తీసుకుంటున్నట్లుగా నటాషా స్టాంకోవిక్ గురువారం (జూలై 18) సాయంత్రం ప్రకటించారు. ఈ విడాకులు ఇద్దరికీ చాలా కష్టమైన నిర్ణయమే అని ఆమె తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇక తమ మూడేళ్ల బాబు అగస్త్యకు తాము కో- పేరెంట్స్‌గా ఉంటామని స్పష్టం చేశారు.
‘‘నాలుగేళ్ల మా ప్రయాణం తర్వాత హార్థిక్, నేను విడాకులు తీసుకోవాలని ఇద్దరం పరస్ఫర నిర్ణయం తీసుకున్నాం. మాకు వీలైనంత వరకూ కలిసి ఉండేందుకు ప్రయత్నించాం. కానీ, విడిపోవడమే మా ఇద్దరికీ మంచి ప్రయోజనం చేకూరుస్తుందని మేం నమ్ముతున్నాం. మేం కలిసి ఆనందంగా గడిపాం, పరస్పరం గౌరవం అందించుకున్నాం. ఇప్పుడు మేం తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైనదిగా ఉంది.
మాకు అగస్త్య అనే ఒక బాబు ఉన్నాడు. అతను మా ఇద్దరి జీవితాల్లోనూ ఉంటాడు. మేం కో పేరెంట్స్ గా ఉంటాం. అతని ఆనందం కోసం మేం ఏమైనా చేస్తాం. ఇలాంటి సున్నితమైన సమయంలో మీరంతా మా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’’ అని నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)