WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ , గుజరాత్ జెయింట్స్‌కు భారీ షాక్
Lauren Cheatle: గుజరాత్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. గుజరాత్ జెయింట్స్ సీమర్ ఆస్ట్రేలియాకు చెందిన లారెన్ చీటల్ రెండో సీజన్ మొత్తానికి దూరమైంది.
Cheatle To Miss Rest Of Season WPL After Skin Cancer Procedure: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్ మ్యాచ్‌లకు సమయం సమీపిస్తున్న వేళ స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)కు షాక్ తగిలింది. గుజరాత్ జెయింట్స్ సీమర్ ఆస్ట్రేలియా(Australia)కు చెందిన లారెన్ చీటల్(Lauren Cheatle) రెండో సీజన్ మొత్తానికి దూరమైంది. మెడ భాగంలో చర్మ క్యాన్సర్‌ను శస్త్రచికిత్స చేసి తొలగించగా... ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్ సీజన్‌కు అందుబాటులో ఉండట్లేదు. 2021లోనూ లారెన్ కాలుకు చర్మ క్యాన్సర్‌కు సంబంధించిన ఆపరేషన్ చేశారు. లారెన్‌ను వేలంలో రూ.30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
మ్యాచ్‌లు ఎప్పటినుంచంటే..?
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) రెండో సీజన్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి రెండో సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, యూపీ వారియర్స్ జట్ల మధ్య ఫిబ్రవరి 24న రెండో మ్యాచ్ జరుగునుంది. ఈ సీజన్‌లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. ఎలిమినేటర్, ఫైనల్ కలిపి మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మార్చి 17న ఢిల్లీలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. తొలి సీజన్‌లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్‌లో రెండు నగరాల్లో జరుగనుంది.
WPL 2024 షెడ్యూల్....
ఫిబ్రవరి 23- ముంబయి ఇండియన్స్ v ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబయి ఇండియన్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 28- ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (బెంగుళూరు)
ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగుళూరు)
మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబయి ఇండియన్స్ (బెంగుళూరు)
మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగుళూరు)
మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగుళూరు)
మార్చి 5- ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబయి ఇండియన్స్ (ఢిల్లీ)
మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబయి ఇండియన్స్ (ఢిల్లీ)
మార్చి 8- ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
మార్చి 9- ముంబయి ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
మార్చి 10- ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
మార్చి 13- ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
మార్చి 15- ఎలిమినేటర్ (ఢిల్లీ)
మార్చి 17- ఫైనల్ (ఢిల్లీ)