Maxwell Double Century Records: మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీతో ఎన్ని రికార్డులు బద్దలుకొట్టాడో తెలుసా? తెలిస్తే షాక్!
Glenn Maxwell ODI Records: కండరాలు పట్టేసి కాలు ఇబ్బంది పెడుతున్నా ఆసీస్ ఆల్ రౌండర్ మ్యాక్స్‌వెల్ బాధను పంటి బిగువన భరిస్తూ ఒంటరి పోరాటం చేసి డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులు తిరగరాశాడు.
Glenn Maxwell World Cup Records: అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (201 నాటౌట్; 128 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సర్లు) డబుల్ సెంచరీ చేశాడు. ఓడిపోతుందనుకున్న ఆస్ట్రేలియాను మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) గెలిపించడంతో పాటు ప్రపంచ కప్ లో సెమీస్ చేర్చాడు. కండరాలు పట్టేసి కాలు ఇబ్బంది పెడుతున్న బాధను పంటి బిగువన భరిస్తూ ఒంటరి పోరాటం చేసి డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులు తిరగరాశాడు. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలుండగానే ఆసీస్ ఛేదించింది. కమిన్స్ (12 నాటౌట్) సహకారంతో మ్యాక్సీ అద్భుతం చేశాడు. 8 మ్యాచ్ ల్లో 6 విజయాలతో సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు కంగారూలు. కొన్ని కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు మ్యాక్సీ.
మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ తో నమోదైన రికార్డులివే..
- ప్రపంచ కప్ లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడు మ్యాక్స్ వెల్. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఆండ్రూ స్ట్రాస్ పేరిట ఉండేది. 2011 వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో భారత్ పై స్ట్రాస్ (158) రికార్డు బద్దలైంది.
- వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ అయ్యాడు. 47వ ఓవర్లో 195 వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే మ్యాక్స్ వెల్ ఈ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ పేరిట ఉండేది. 2021లో దక్షిణాఫ్రికాపై పాక్ బ్యాటర్ చేసిన 193 పరుగులే ఛేజింగ్ లో అత్యధిక స్కోరు. తాజాగా మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర లిఖించాడు.
- వన్డేల్లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆసీస్ బ్యాటర్ మ్యాక్స్ వెల్. అంతకుముందు షేన్ వాట్సన్ (185 పరుగుల) పేరిట ఉన్న రికార్డు బద్దలైంది.
- వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ మ్యాక్స్ వెల్.
- వన్డే ప్రపంచ కప్ లో డబుల్ సెంచరీ చేసిన మూడో బ్యాటర్ గా మ్యాక్సీ. అంతకుముందు 2015 వరల్డ్ కప్ లో జింబాబ్వేపై క్రిస్ గేల్ 215 రన్స్, న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ వెస్టిండీస్ పై 237 పరుగులు చేశాడు.
- వన్డేల్లో అత్యంత వేగంగా (128 బంతుల్లో) డబుల్ సెంచరీ బాదిన రెండో ఆటగాడు మ్యాక్స్ వెల్. 2022లో ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ పై 126 బంతుల్లోనే ద్విశతకం సాధించాడు.
- వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో సైతం ఛేదనలో నమోదైన ఏకైక డబుల్ సెంచరీ మ్యాక్సీదే కావడం విశేషం.
- 6 లేదా అంతకన్నా తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు మ్యాక్స్ వెల్. గతంలో 1983 వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ జింబాబ్వేపై చేసిన 175 రన్స్ ఇప్పటివరకూ అత్యధికం.
- వన్డే క్రికెట్ చరిత్రలో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ మ్యాక్స్ వెల్. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ పేరిట ఉండేది. 2021లో దక్షిణాఫ్రికాపై ఫకర్ జమాన్ 193 రన్స్ చేశాడు.
- వన్డేల్లో 11 డబుల్ సెంచరీలు నమోదు కాగా, ఛేజింగ్ లో నమోదైన ఏకైక డబుల్ సెంచరీ మ్యాక్సీదే.
- వన్డే చరిత్రలో 8వ వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు. అఫ్గాన్ పై మ్యాక్స్ వెల్, కమిన్స్ 202 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 2006లో భారత్ పై ఆండ్రూల్ హాల్, జస్టిన్ కెంప్ నెలకొల్పిన 138 రన్స్ రికార్డు బద్దలు.
- వన్డే ఫార్మాట్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసీస్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్.
- ఆసీస్ తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్ గా మ్యాక్సీ నిలిచాడు. వాట్సన్ 185 రన్స్ ను అధిగమించాడు. వరల్డ్ కప్ పరంగా చూస్తే డేవిడ్ వార్నర్ 178 రన్స్ ను దాటేశాడు.
- వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాన్ ఓపెనర్ బ్యాటర్ మ్యాక్స్ వెల్ మాత్రమే. సిక్సర్ తో డబుల్ సెంచరీ మార్క్ చేరుకున్న అతికొద్ది మంది బ్యాటర్లలో ఒకడిగా మ్యాక్స్ వెల్ నిలిచాడు.
- ఈ వరల్డ్ కప్ లో మ్యాక్స్ వెల్ చేసిన రెండో శతకం ఇది. కాగా తొలి సెంచరీ అయితే ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ, తాజా డబుల్ సెంచరీ అయితే ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఛేజింగ్ లో సాధించింది. మ్యాక్సీ ఈ రెండు ఇన్నింగ్స్ లు ప్రపంచ రికార్డులుగా మారాయి.
Glenn Maxwell produced one of the most outrageous knocks in ODI history 💪#CWC23 | #AUSvAFG pic.twitter.com/rIN8QxDTlm
— ICC Cricket World Cup (@cricketworldcup) November 7, 2023