అన్వేషించండి

Under-19 World Cup: బ్రెట్ విలియమ్స్ నుంచి సూర్యవంశీ వరకు.... అండర్ 19 వరల్డ్ కప్‌లో సెంచరీల రికార్డులు ఇవే!

Under-19 World Cup: అండర్-19 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ 55 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇది ఫైనల్‌లో నమోదైన అత్యంత వేగవంతమైన సెంచరీ.

Under-19 World Cup: క్రికెట్ ప్రపంచంలో నేడు స్టార్స్‌గా గుర్తింపు పొందిన ఎందరో అండర్‌ -19 ప్రపంచకప్‌లో అదరగొట్టినవాళ్లే. వైభవ్ సూర్యవంశీ మాదిరిగానే ప్రత్యర్థులకు చుక్కలు చూపించి వార్తల్లోకి ఎక్కిన వాళ్లే. అప్పటి వరకు ప్రపంచానికి తెలియని వారి సత్తాను రికార్డులతో రుచి చూపించిన వాళ్లే. ఐపీఎల్ లాంటి టోర్నీ రావడంతో నేడు ఎక్కడెక్కడో ఉన్న వారంతా వెలుగులోకి వస్తున్నారు కానీ గతంలో అండర్ -19 అనేది యువ క్రికెటర్ల టాలెంట్ చూపించుకునే వేదికగా ఉండేది. అలాంటి వేదికపై ఎందరో సెంచరీలతో కదం తొక్కారు. 

అండర్ 19 వరల్డ్ కప్‌లో  సెంచరీ చేయడమంటే ఆటగాడి లైఫ్‌ను మార్చుకోవడమే. అందుకే అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకూడా ఉండేందుకు కుర్రాళ్లు పరుగులు వేట సాగిస్తుంటారు. అలాంటి పరుగులు వేటలో వైభవ్ సూర్యవంశీ  ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. 2026 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 55 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే. 

వైభవ్ సూర్యవంశీ రికార్డులు  

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అండర్-19 ప్రపంచ కప్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ప్రపంచ కప్ ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన విల్ మలాజుక్ పేరున ఉంది. సూర్యవంశీ ఇప్పుడు ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు నెలకొల్పాడు. 

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాట్స్‌మన్ సూర్యవంశీ. 2012లో ఉన్ముక్త్ చంద్ 2018లో మంజోత్ కల్రా ఫైనల్‌లో సెంచరీ చేశారు. సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో ఇంకా చాలా రికార్డులు బ్రేక్ చేశాడు. 15 సిక్సర్లు కొట్టిన సూర్యవంశీ అండర్-19 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 12 సిక్సర్లే హయ్యెస్ట్‌గా ఉండేవి. ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ హిల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 218.75 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతను 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. బౌండరీల ద్వారానే 150 పరుగులు చేశాడు. 

తొలి సెంచరీ అతనిదే!

1988లో ఆస్ట్రేలియాలో మొదటి ఎడిషన్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు 161 సెంచరీలు నమోదు అయ్యాయి. మొదటి సెంచరీని మొదటి ప్రపంచకప్‌లోనే విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బ్రెట్ విలియమ్స్ చేశాడు. అతను 122 బంతుల్లో 112 పరుగులు చేసి తొలి సెంచరీ చేసిన రికార్డు క్రియేట్ చేశాడు. ఆ టోర్నీలోనే అతను పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 108 పరుగులు చేసి ఆసీస్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

విశ్వరూపం చూపిన యూనివర్సల్ బాస్‌, స్టార్ ఆల్‌రౌండర్లు

1998-2000 ఎడిషన్లు ఇప్పటి వరకు జరిగిన టోర్నీల్లో ప్రత్యేకమని చెప్పవచ్చు. 1998లో విండీస్‌కు చెందిన క్రిస్ గేల్ బంగ్లాదేశ్‌పై 141 పరుగులు చేసి తన పవర్‌హిట్టింగ్ ప్రపంచానికి పరిచయం చేశాడు. తర్వాత క్రమంలో యూనివర్సల్ బాస్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండేళ్లలో డొమినిక్‌ థార్నెలీ, మార్కస్ నార్త్, జేమ్స్ హోప్స్‌ షేన్ వాట్సన్, జాక్యూస్ రుడాల్ఫ్‌ లాంటి వారంతా తమ దూకుడు బ్యాటింగ్‌తో సత్తా చాటుకున్నారు. 

గబ్బర్ విధ్వంసం, పుజారా క్లాసిక్‌, కొహ్లీ కెప్టెన్సీ

భారత్ క్రికెట్ చరిత్రలో 2004 ఎడిషన్ చాలా స్పెషల్. టీమిండియా ఓపెన్ శిఖర్ ధావన్ ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. 2006లో పుజారా తన స్టైలిష్ బ్యాటింగ్‌తో సెంచరీతో మెరిశాడు. 2008లో విరాట్ కోహ్లీ విండీస్‌పై సెంచరీ చేసి భారత్‌ను ఛాంపియన్‌గా మార్చాడు. తర్వాత టీమిండియాలోనే ఛేజ‌ మాస్టర్‌గా మారాడు. 

అత్యధిక స్కోర్‌ చేసిన శ్రీలంక క్రికెటర్

2012లో క్వింటన్ డి కాక్‌, భారత్ ప్లేయర్‌  ఉన్ముక్త్ చంద్‌ సెంచరీలతో రెచ్చిపోయారు. 2018లో శ్రీలంకకు చెందిన హసిత బోయగోడా 191 పరుగులతో అప్పటి వరకు ఉన్న అత్యధిక స్కోర్‌ను అధిగమించి కొత్త రికార్డు సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు పదిలంగా ఉంది. 2020లో జైస్వాల్, 2022 రాజ్‌ బాబా 2024లో ముషీర్ ఖాన్, సెంచరీలు కొట్టారు.  

టాప్ హెడ్ లైన్స్

Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget