అన్వేషించండి
Advertisement
Geoffrey Boycott: లెజండరీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్‌కు గొంతు క్యాన్సర్, 85 ఏళ్ల వయసులో రెండోసారి ఎటాక్
Cricket legend England: ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు సర్ జెఫ్రీ బాయ్‌కాట్ సంచలన ప్రకటన చేశాడు. తాను గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు తెలిపారు.
Sir Geoffrey Boycott Diagnosed With Cancer : సర్ జెఫ్రీ బాయ్‌కాట్ (Sir Geoffrey Boycott)... ఇంగ్లాండ్( England) దిగ్గజ ఆటగాడు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని అంతర్జాతీయ క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 151 సెంచరీలు చేసి... అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసి 22 సెంచరీలను నమోదు చేసి ఇంగ్లాండ్‌లో లెజెండ్ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 18 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్‌లో 108 టెస్టులు ఆడిన జెఫ్రీ బాయ్‌కాట్ సంచలన ప్రకటన చేశాడు. తాను గొంతు క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం షాక్‌గు గురైంది.
Sir Geoffrey Boycott reveals cancer diagnosis
— Telegraph Cricket (@TeleCricket) July 2, 2024
క్యాన్సర్‌తో పోరాడుతున్నా...
ఇంగ్లాండ్ లెజెండ్ క్రికెటర్ సర్ జెఫ్రీ బాయ్‌కాట్‌కు సంబంధించిన విచారకరమైన వార్త బయటకు వచ్చింది. తనకు గొంతు క్యాన్సర్ సోకిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. గొంతు క్యాన్సర్ బాయ్‌కాట్‌ను ఇబ్బంది పెట్టడం ఇది రెండోసారి. పలు పరీక్షల తర్వాత తనకు క్యాన్సర్ తిరిగి వచ్చిందని తేలిందని... అందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారని బాయ్‌కాట్ తెలిపారు. గతంలోనూ బాయ్‌కాట్‌కు క్యాన్సర్ సోకింది. ఆ తర్వాత ఆయన కోలుకున్నారు. గత అనుభవాల తర్వాత తనకు మళ్లీ క్యాన్సర్ సోకిందని అనుమానించాని... వైద్యుల పరీక్షలో అదే నిజమని తేలిందని బాయ్‌కాట్ తెలిపారు. ఆపరేషన్ విజయవంతం అయినా తనకు క్యాన్సర్ మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. తాను మళ్లీ ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉందని.... అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నానని 83 ఏళ్ల జెఫ్రీ బాయ్‌కాట్ తెలిపారు. 62 ఏళ్ల వయసులో 2002లో బాయ్‌కాట్‌కు తొలుత క్యాన్సర్ సోకింది. సర్జరీ తర్వాత ఆయన కోలుకున్నారు. ఆపరేషన్ చేయించుకోకపోతే మూడు నెలలు కూడా బతకలేరని అప్పుడు వైద్యులు తెలపడంతో ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. 35 కీమోథెరపీ సెషన్‌ల తర్వాత భార్య, కుమార్తె మద్దతుతో క్యాన్సర్‌ను ఓడించారు.
దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు
జెఫ్రీ బాయ్‌కాట్ 1964లో ఇంగ్లండ్ తరపున తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్ తరపున 18 ఏళ్ల పాటు క్రికెట్ ఆడాడు. 108 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 47.72 సగటుతో 8,114 పరుగులు చేశాడు. టెస్ట్ కెరీర్‌లో 22 సెంచరీలు, 42 అర్ధ సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్ తరపున 36 వన్డేలు ఆడి 1,082 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో ఒక సెంచరీ, 9 అర్ధసెంచరీలు కూడా చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో బాయ్‌కాట్ పరుగుల వరద పారించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతని రికార్డులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో బాయ్‌కాట్ 609 మ్యాచులు ఆడి 151 సెంచరీలు, 238 హాఫ్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 48,426 పరుగులు చేశాడు. దేశవాళీలో బాయ్‌కాట్ అత్యధిక స్కోరు 261 నాటౌట్. 313 లిస్ట్ ఏ మ్యాచుల్లో బాయ్‌కాట్ ఎనిమిది సెంచరీలు, 74 అర్ధ సెంచరీలు చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నెల్లూరు
రైతు దేశం
విశాఖపట్నం
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion