అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ENG Vs AUS: చిరకాల ప్రత్యర్థుల పోరు షురూ, బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా
ODI World Cup 2023: ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరంలో టాస్ ఓడిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. భారీ స్కోరు నమోదు చేసి ఘన విజయం సాధించి నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరంలో టాస్ ఓడిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. మొదట భారీ స్కోరు నమోదు చేసి ఘన విజయం సాధించి నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది. అయితే నాకౌట్ సెమీస్ బెర్తును తేల్చే మ్యాచ్ కావడంతో సర్వశక్తులు ఒడ్డేందుకు కంగారులు సిద్ధమయ్యారు. ఆస్ర్టేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌కు దూరం అవ్వగా... కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ తుది జట్టులోకి వచ్చారు. ఇటు ఇంగ్లండ్ ఆస్ట్రేలియాను కట్టడి చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకుని కంగారులను తక్కువ పరుగులకే కట్టడి చేయాలని బ్రిటీష్ జట్టు చూస్తోంది.
ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. డేవిడ్ వార్నర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే వార్నర్ రెండు సెంచరీలు చేసి విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఈ విశ్వ సమరంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అయిదు సెంచరీలు నమోదు చేయగా అందులో రెండు వార్నరే చేశాడు. ఈ మెగా టోర్నీలో 413 పరుగులతో వార్నర్ టాప్ 5 జాబితాలో ఉన్నాడు. ఇద్దరు కీలక ఆటగాళ్లు మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆస్ట్రేలియాను కలవరపరుస్తోంది. వీరి స్థానంలో స్థానంలో కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ తుది జట్టులోకి వచ్చారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించడం ఆసిస్‌కు ఉపశమనం కల్గిస్తోంది. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కూడా రాణిస్తే ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయడం ఖాయమే. స్టోయినిస్, గ్రీన్ కూడా భారీ స్కోరుపై కన్నేసి తమను తాము నిరూపించుకోవాలని చూస్తున్నారు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్‌తో కంగారు పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండగా ఆడమ్ జంపా ఈ ప్రపంచకప్‌లో అంచనాలను మించి రాణిస్తున్నాడు.
ఇప్పటికే సెమీస్ ఆశలు కోల్పోయిన ఇంగ్లండ్... కంగారులపై గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇటు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌కు మరింత చేరువ కావాలని చూస్తోంది. ప్రపంచకప్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన కంగారులు...ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి సెమీస్ రేసులో నిలిచారు. ఇంగ్లండ్ మాత్రం వరుసగా నాలుగు పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఆస్ర్టేలియా మూడో స్థానంలో ఉండగా... ఇంగ్లండ్ అట్టడుగున ఉంది. పాయింట్లు, సెమీస్ ఆశలు ఇవన్నీ పక్కన పెడితే ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు ఖాయమని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
బ్యాటింగ్‌లో వరుసగా విఫలమవుతుడడం బ్రిటీష్ జట్టును కలవరపరుస్తోంది. చివరి మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్ 170 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌కు గెలుపు తప్పనిసరి. ప్రపంచ కప్‌లో మొదటి ఏడు స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ అర్హత సాధిస్తాయి. ఇప్పటివరకూ ఇరు జట్లు 155 వన్డేల్లో తలపడగా 87 సార్లు ఇంగ్లండ్ ఓడిపోయింది. డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ రాణించాలని బ్రిటీష్ జట్టు కోరుకుంటోంది.
ఇంగ్లండ్ ఫైనల్ 11: జోస్ బట్లర్ (కెప్టెన్), మోయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్
ఆస్ట్రేలియా ఫైనల్ 11: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్,మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
ఎంటర్టైన్మెంట్
సినిమా
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement