అన్వేషించండి

Mohammed Shami: ఐరాను చూడలేకపోతున్నా, షమీ భావోద్వేగం

Mohammed Shami: షమ్మీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన కుటుంబం గురించి మీడియా తో పంచుకున్నాడు. తన కుమార్తె ఐరాను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు.

Mohammed Shami On Missing Daughter, Not Visiting Her: భారత క్రికెటర్‌ మహమ్మద్‌ షమీ(Mohammed Shami) క్రీడా ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు.  పడి లేచిన తరంగం షమ్మీ. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన కుటుంబం గురించి మీడియా తో పంచుకున్నాడు. తన కుమార్తె ఐరాను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. కుటుంబ విభేదాల వల్ల కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్‌ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపాడు. ఎవరూ తన కుటుంబాన్ని, పిల్లలను కోల్పోవాలనుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఆరోగ్యంగా ఉంటూ అన్నింటిలో విజయం సాధించాలని  కోరుకుంటున్నానన్నాడు. ఒకప్పుడు  భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు, కోర్టు సమన్లు  ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు రోడ్డు ప్రమాదం ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గలేదు. ఇంకా దృఢంగా తయారయ్యాడు. జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపో లేదు. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు.  దానికి తగ్గ ఫలాలను అందిస్తున్నాడు.

ఇలాంటి ఇబ్బందే పడుతున్నాను అంటూనే కొంతకాలం క్రితం పోస్ట్ చేశాడు టీమిండియా క్రికెటర్ శిఖర్‌ ధావన్‌ (Shikar Dhawan)  తన కుమారుడు జోరావర్‌(Zoravar)తో మాట్లాడి ఐదారు నెలలు అవుతోందని ఉద్వేగానికి లోనయ్యాడు. తన  బిడ్డతో సరదాగా గడపాలని, అతడిని నా చేతుల్లో నిద్ర పుచ్చాలని, గట్టిగా కౌగిలించుకోవాలని తనకు ఉంటుందని ధావన్‌ అన్నాడు. తండ్రి ప్రేమను ఇవ్వాలనిపిస్తుందని... జోరావర్‌తో మాట్లాడి ఐదారు నెలలు అవుతోందని శిఖర్‌ తెలిపాడు. అయినా సరే తాను పాజిటివ్‌గానే ఉన్నానని... తన కుమారుడిని ప్రేమిస్తూనే ఉన్నానని తెలిపాడు. వాడు సంతోషంగా ఉండాలని.. దేవుడు కరుణిస్తే ఏదో ఒక రోజు జోరావర్‌ తనతో కలిసి ఉంటాడని ధావన్‌ వివరించాడు.

టీమిండియా క్రికెటర్ శిఖర్‌ ధావన్‌ (Shikar Dhawan) గత కొన్నాళ్లుగా వ్యక్తిగతంగా, కెరీర్ లోనూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఓవైపు భార్య అయేషా ముఖర్జీ (Ayesha Mukherjee) నుంచి మానసిక వేధింపులు భరించలేక కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాడు. కానీ అప్పటినుంచి శిఖర్ ధావన్ కు భార్య నుంచి వేధింపులు రెట్టింపయ్యాయి. కుమారుడ్ని ధావన్ కు దూరం చేసిన మాజీ భార్య అయేషా కనీసం సోషల్ మీడియాలో సైతం జోరావర్ కు సంబంధించిన వివరాలు క్రికెటర్ కు తెలియకుండా జాగ్రత్త పడుతోంది. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్‌ ఆయేషా ముఖర్జీని ధావన్‌ 2012లో వివాహం చేసుకోగా.. జోరావర్‌ సంతానం. అయితే, వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ధావన్‌ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ప్రకటించింది. ఆమెకు అంతకుముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు. విడాకుల కేసు తీర్పులో కోర్టు ధావన్ తన కుమారుడితో వీడియో కాల్‌ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతించింది. స్కూల్‌ వెకేషన్‌ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చి ధావన్‌ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget