Duleep Trophy Squads: దులీప్ ట్రోఫీకి స్టార్ ఆటగాళ్లు, వారికి మాత్రం విశ్రాంతే
Duleep Trophy : భారత స్టార్ ఆటగాళ్లు కోహ్లి, రోహిత్, బుమ్రా, అశ్విన్‌లకు దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు లభించింది. సెప్టెంబరు 5న ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం బీసీసీఐ నాలుగు జట్లను ఎంపిక చేసింది.

BCCI announces squads for first round of Duleep Trophy: దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) సహా కీలక ఆటగాళ్లందరూ పాల్గొంటారన్న ఊహాగానాలకు తెరపడింది. అసలు సీనియర్లు లేకుండానే దులీప్ ట్రోఫీ జట్టును బీసీసీఐ(Bcci) ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌తో భారత టెస్ట్ సీజన్ ఆరంభం కానుంది. వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా కనీసం 10 టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ క్రమంలోనే పని ఒత్తిడి పడకుండా సీనియర్లకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వగా యువ ఆటగాళ్లకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. దులీప్ ట్రోఫీతో భారత్‌లో దేశవాళీ టోర్నమెంట్లు ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ ఆటగాళ్లు బరిలోకి దిగుతుండడంతో ఈసారి దులీప్ ట్రోఫీకి కళ వచ్చింది. ఈ దేశవాళీ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ టోర్నమెంట్‌లో సత్తా చాటి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకునేందుకు యువకులు సిద్ధంగా ఉన్నారు.
Here are the squads for the first round of #DuleepTrophy 2024-25 🙌@IDFCFIRSTBank pic.twitter.com/2EmyInj7VT
— BCCI Domestic (@BCCIdomestic) August 14, 2024
కెప్టెన్లుగా వీళ్లే
మొత్తం నాలుగు జట్లకు గిల్(టీమ్ A), అభిమన్యు ఈశ్వరన్(టీమ్ B), రుతురాజ్(టీమ్ C), శ్రేయస్ అయ్యర్(టీమ్ D)లను కెప్టెన్‌లుగా నియమించారు. అయితే ఈ టోర్నీకి స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, అశ్విన్‌ను ఎంపిక చేయలేదు. గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ ఈ ట్రోఫీతో పునరాగమనం చేయనున్నారు. అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో ఆడబోతున్నారు. అలాగే బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ జట్టులో ఎంపికయ్యే ఆటగాళ్ళు దులీప్ ట్రోఫీకి దూరంగా ఉంచనున్నారు.
Duleep Trophy squads:
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2024
Team A - Gill (C), KL, Agarwal, Parag, Jurel, Tilak, Dube, Kotian, Kuldeep, Akash Deep, Prasidh, Khaleel, Avesh, Kaverappa, Kushagra and Shaswat Rawat.
Team B - Easwaran (C), Pant, Jaiswal, Sarfaraz, Musheer, Nitish Reddy, Sundar, Jadeja, Siraj, Dayal,… pic.twitter.com/4pawUg1Kzm
జట్లు ఇవే..
టీమ్ ఏ: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కెఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వాత్ కావరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.
టీమ్ B: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , N జగదీశన్.
టీమ్ సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, మయాంక్ మార్కండే, సందీప్ వారియర్.
టీమ్ డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్‌పాండే, కేఎస్ భరత్, సౌరభ్ కుమార్.




















