Duleep Trophy Highlights: బ్యాట్ ఝులిపించిన తిలక్ వర్మ, ప్రతమ్ సింగ్ - ఇండియా డి ముందు బిగ్ టార్గెట్
Duleep Trophy 2024 News | అనంతపురం కేంద్రంగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్ లో ఇండియా ఏ బ్యాటర్లు తిలక్ వర్మ, ప్రతమ్ సింగ్ శతకాలు బాదడంతో ఇండియా డి టీమ్ కు భారీ లక్ష్యాన్ని ఇచ్చారు.
Duleep Trophy News | అనంతపురం: దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో జరుగుతున్న ఇండియా -ఏ, ఇండియా -డీ మ్యాచ్‌లో శనివారం ఇండియా -డీ జట్టు బ్యాటర్లు ప్రతమ్ సింగ్, తిలక్‌వర్మ సూపర్ సెంచరీలు చేశారు. దీంతో ఇండియా -ఏ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఇండియా- సీ, బీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇండియా -బీ జట్టు బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో కదంతొక్కాడు. ఇండియా బీ జట్టు ఎదురీదుతోంది. ఇండియా సీ బౌలర్ అన్షుల్ 5 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఇండియా -డీ లక్ష్యం 380/3:
ముడో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 115/1తో ప్రారంభించిన ఇండియా ఏ జట్టు 98 ఓవర్లలో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 380 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. జట్టులో ప్రతమ్ సింగ్, తిలక్‌వర్మ సెంచరీలతో అదరగొట్టారు. ప్రతమ్ సింగ్ 189 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 122, తిలక్ వర్మ(నాటౌట్) 193 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో 111 పరుగులు చేశారు. మరో బ్యాట్స్‌మెన్ శాశ్వత్ రావత్ 88 బంతుల్లో 64 (7 ఫోర్లు)అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇండియా డీ జట్టు బౌలర్లలో సౌరభ్‌కుమార్ రెండు, శ్రేయస్ అయ్యర్ ఒక వికెట్ తీసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇండియా ఏ జట్టు..ఇండియా డీ జట్టు ముందు 488 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా ఆటముగిసే సమయానికి ఇండియా డీ జట్టు 19 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. జట్టులో యష్ దుబే 15, రికీ బుయీ 44 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అతర్వ డకౌట్ అయ్యాడు. ఇండియా ఏ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నాడు.
అన్షుల్ కాంబోజ్ 5 వికెట్లు
అభిమన్యు మెరుపు సెంచరీ:
ఇండియా -సీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా- బీ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన ఈశ్వరన్ చూడచక్కని షాట్లతో అలరించాడు. 262 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 143 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్ నారాయణ్ జగదీషన్ 70 పరుగులు చేశాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాట్స్‌మెన్‌లు పెద్దగా రాణించలేదు. ఇండియా సీ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 5 వికెట్లు తీసుకుని, ఇండియా బీ జట్టును కట్టడి చేశాడు. ఆటముగిసే సమయానికి ఇండియా బీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 309 పరుగులు చేసింది. ఇండియా సీ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 525 పరుగులు చేసింది.