Warner On Captaincy Ban: 'నా కుటుంబమే నాకు ముఖ్యం- ఆ చెత్తను క్లీన్ చేసే వాషింగ్ మెషీన్ ను కాదు'
Warner On Captaincy Ban: క్రికెట్ ఆస్ట్రేలియాపై ఆ జట్టు ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. తనకు క్రికెట్ కన్నా తన కుటుంబమే ముఖ్యమని తేల్చి చెప్పాడు. ఎందుకంటే!
Warner On Captaincy Ban: క్రికెట్ ఆస్ట్రేలియాపై ఆ జట్టు ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. తనకు క్రికెట్ కన్నా తన కుటుంబమే ముఖ్యమని తేల్చి చెప్పాడు. బాల్ టాంపరింగ్ విషయం కారణంగా కెప్టెన్సీ చేపట్టకుండా వార్నర్ పై జీవితకాల నిషేధం ఉంది. ఈ నిర్ణయంపై సమీక్ష కోరుతూ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే తాజాగా ఆ దరఖాస్తును విరమించుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆసీస్ బోర్డు స్వతంత్ర ప్యానెల్, కౌన్సిల్ సహాయక సిబ్బందిపై వార్నర్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీని గురించి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.
‘‘నాకు క్రికెట్ కన్నా నా కుటుంబమే ముఖ్యం. కేప్‌టౌన్‌లో మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ సంఘటన తర్వాత దాదాపు ఐదేళ్లుగా ఎన్నో అవమానాలను భరించాను. నాతో పాటు నా కుటుంబం కూడా వాటిని ఎదర్కోవలసి వచ్చింది. నాపై నిషేధం ఉన్నప్పటికీ ఆరోజు నుంచి నన్ను నేను ఆట పరంగా సంస్కరించుకోవడానికి కృషి చేశాను. క్రికెట్‌కు నా సేవలు ఎన్నో అందించాను. అయినా, నేను అనుభవిస్తున్న శిక్ష నుండి ఇప్పటికీ విముక్తి పొందలేకపోతున్నాను. అని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
వాషింగ్ మెషీన్ లా క్లీన్ చేయలేను
గత నవంబర్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రవర్తనా నియమావళిని సవరించింది. దీంతో వార్నర్ తనపై ఉన్న జీవితకాల నిషేధంపై సమీక్ష నిర్వహించాలని దరఖాస్తు చేసుకున్నాడు. సవరించిన నియమావళి నాలో కొత్త ఆశలను రేకెత్తించింది. నాపై ఉన్న నిషేధంపై సమీక్షను కోరేందుకు ఒక అవకాశం లభించిందని అనుకున్నాను. అయితే ఇటీవల ఈ విషయంలో కౌన్సిల్ న్యాయవాది నాపైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. 2018 న్యూజిలాండ్ పర్యటన సమయంలో అసలేం జరిగిందనే విషయంపై వారు బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ సంఘటనపై పబ్లిక్ ట్రయల్ నిర్వహించాలని ప్యానెల్ నిర్ణయించింది. అయితే దీని వల్ల నా కుటుంబం సభ్యులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ చెత్త ఎపిసోడ్‌ను క్లీన్ చేసేందుకు వాషింగ్ మెషీన్‌లా నేను సిద్ధంగా లేను’’ అని వార్నర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశాడు.
View this post on Instagram