అన్వేషించండి

T20 World Cup 2022: ఈ ప్రపంచ కప్‌ను ఈ నాలుగు జట్లు మాత్రం కచ్చితంగా మర్చిపోవు

ఇప్పటిదాకా ఏ టీ20 ప్రపంచకప్ లోనూ ఇంత పోటాపోటీ మ్యాచెస్ జరగలేదు. దానికి ప్రధాన కారణం... ఈసారి చిన్నజట్లుగా పిలిచే టీమ్స్ చేసిన స్ఫూర్తిదాయక ప్రదర్శనే.

2007 నుంచి ఇప్పటివరకు జరిగిన టీ20 వరల్డ్ కప్స్‌లో 11 గ్రేట్ అప్ సెట్స్‌ను ఐసీసీ అనౌన్స్ చేసింది. అప్ సెట్ అంటే...  అంచనాలే లేని చిన్న జట్టు... బలమైన జట్టుపై గెలవడాన్ని క్రికెట్ భాషలో అప్ సెట్ అంటారు. సో ఆ విధంగా... ఐసీసీ విడుదల చేసిన ఈ 11 గ్రేట్ అప్ సెట్స్‌లో నాలుగు... ఈ ఏడాది టోర్నమెంట్‌లోనే జరగడం విశేషం. ఈ ఒక్కటీ చాలదా ఈ ఏడాది వరల్డ్ కప్ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా జరిగిందో చెప్పడానికి. దానికి రీజన్ ఇదిగో ఐసీసీ విడుదల చేసిన ఈ స్టాటిస్టిక్స్‌లోనే కనిపిస్తోంది. ఎప్పుడైనా సరే మ్యాచెస్ వన్ సైడెడ్‌గా సాగితే ఏం మజా ఉంటుంది చెప్పండి. ఈసారి టోర్నమెంట్ లో చిన్న జట్లు సైతం.... చాలా బాగా ఆడటంతో మనకు మంచి మ్యాచెస్ వచ్చాయి. ఎంతలా అంటే.... సూపర్-12 లో దాదాపు ఆఖరి మ్యాచ్ దాకా సెమీస్ కు ఎవరు వెళ్లారో తెలియనంతగా. తమతో రెగ్యులర్ గా క్రికెట్ ఆడాలే కానీ..... తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్తామని చిన్న జట్లు బల్ల గుద్ది చెప్తున్నాయి. 

నిజమే.... ఎప్పుడో ఓసారి ఇలా వరల్డ్ కప్ లో ఎదురైనప్పుడు పెద్ద జట్లు... వీటితో ఆడటం కన్నా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా బైలేటరల్ సిరీస్ ఆడితే... ఆయా దేశాల క్రికెటింగ్ ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. ఈ వరల్డ్ కప్ లో ఆకట్టుకున్న చిన్న దేశాల గురించి, వాళ్లకు ఈ టోర్నమెంట్ లో లభించిన పాజిటివ్స్ గురించి చెప్పుకుందాం. నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఐర్లాండ్ ఇప్పుడు సంచలనంగా మారాయి.  

నెదర్లాండ్స్

క్వాలిఫయింగ్ స్టేజ్ లో 2 విజయాలతో నెదర్లాండ్స్ సూపర్-12కు అర్హత సాధించింది. ఇక సూపర్-12కి వచ్చాక... దాదాపుగా అన్ని జట్లకు తెలిసి వచ్చింది ఏంటంటే... నెదర్లాండ్స్ బౌలింగ్ చాలా డిసిప్లైన్డ్ గా ఉందని. ముఖ్యంగా ఇన్నింగ్స్ ప్రారంభంలో, మిడిల్ ఓవర్స్‌లో చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు అని. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచెస్ అన్నింట్లోనూ బ్యాటర్లకు సులువుగా పరుగులు ఇవ్వలేదు. డెత్ ఓవర్స్‌లో కాస్త మెరుగైతే... నెదర్లాండ్స్ బౌలింగ్ అంతర్జాతీయ స్థాయి ఉన్నట్టే. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్ దాదాపుగా గెలవాల్సిందే కానీ 9 పరుగుల తేడాతో పోరాడి ఓడారు. కానీ నెదర్లాండ్స్‌కు టోర్నమెంట్‌లో దక్కిన ఫినిషింగ్ అద్భుతం అనే చెప్పుకోవాలి. జింబాబ్వేపై గెలిచారు. ఇక హైలైట్ అంటే... సౌతాఫ్రికాకు హార్ట్ బ్రేక్ మిగిల్చారు. వాళ్ల సెమీస్ ఆశలపై నీళ్లు జల్లలేదు. ఏకంగా కుమ్మరించారు. ఈ రెండు విజయాల వల్ల నెదర్లాండ్స్‌కు ఇంకో లాభం ఏంటంటే.... గ్రూప్-2 లో టాప్-4 లో ఫినిష్ అయ్యారు. సో 2024 టీ20 వరల్డ్ కప్ కు డైరెక్ట్ క్వాలిఫికేషన్ లభించింది. ఇది కచ్చితంగా వారి క్రికెట్ డెవలప్ అయిందని చెప్పడానికి సూచనే. వాళ్ల పేసర్ వ్యాన్ మీకెరెన్ ఓ కోరికను బయటపెట్టాడు. ఇంగ్లండ్ టూర్స్‌కు వెళ్లే పెద్ద జట్లు.... ప్రాక్టీస్ కోసం సిరీస్‌కు ముందు కౌంటీ జట్లతో ఆడే బదులు.... నెదర్లాండ్స్‌కు వచ్చి తమతో ఆడాలని కోరాడు. మంచి కోరికే. కానీ ఫుల్ మెంబర్ నేషన్స్ దీన్ని ఎంతవరకు పరిశీలిస్తాయో చూడాలి.    

జింబాబ్వే
జింబాబ్వే జట్టు గురించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. 90ల చివర్లో మంచి ఫాంలో ఉండేది. కన్సిస్టెంట్ క్రికెట్ ఆడుతూ వచ్చేది. కానీ గత దశాబ్దకాలంలో వాళ్ల గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. బోర్డు పరిస్థితులు కూడా ఓ కారణం అనుకోండి. అది వేరే విషయం. కానీ ఈ టోర్నమెంట్‌లో సూపర్-12 కు అర్హత సాధించాక.... ఈ స్టేజ్ లో వాళ్లకు ఓ ప్లేయర్, ఓ మ్యాచ్.... ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్లేయర్ పేరు సికందర్ రజా. టీంను ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు... దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సత్తా చాటుతూ పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్ అయితే జింబాబ్వే క్రికెట్ హిస్టరీలోనే అతిపెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. ఆఖరి బాల్ దాకా సాగిన మ్యాచ్ లో జింబాబ్వే విజయం సాధించాక... ఒక్కసారిగా వాళ్లు కూడా సెమీస్ రేస్ లోకి వచ్చారు. కానీ బంగ్లాదేశ్ తో జరిగిన మరో థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఓడిపోవడం వాళ్లకు మైనస్ గా మారింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే నెదర్లాండ్స్ లానే... జింబాబ్వే బౌలింగ్ కూడా ఆకట్టుకుంది. రిచర్డ్ ఎంగర్వా, బ్లెసింగ్ ముజరబానీ, టెండాయ్ చటారా, సికందర్ రజా.... అందరూ ఇంప్రెస్ చేశారు. బ్యాటింగ్ లోనే రజాపై ఎక్కువ ఆధారపడటం దెబ్బతీస్తోంది. మిగతా వారు కూడా బ్యాట్ తో కంట్రిబ్యూట్ చేస్తే.... జట్టు ఇంకా బలపడుతుంది. ఈ టోర్నమెంట్ లో ఇన్స్ పైరింగ్ పర్ఫార్మెన్స్ చేసినా... వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం క్వాలిఫయర్స్ ఆడి తీరాల్సిందే. అదొక్కటే కాస్త వాళ్లను బాధించే విషయం. 

బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ గురించి చెప్పుకునే ముందు చిన్నమాట... అది ఏమాత్రం చిన్న జట్టు కాదు. వన్డేల్లో మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తోంది. కానీ టీ20ల్లో ఎప్పుడూ కన్సిస్టెన్సీ లేదు. ఎంతలా అంటే.... ఇప్పటిదాకా జరిగిన ప్రతి టీ20 వరల్డ్ కప్ ఆడినా సరే.... రెండో రౌండ్ లో ఎప్పుడూ ఒకటికి మించి మ్యాచెస్ గెలవలేదు. కానీ ఈసారి రెండు మ్యాచెస్ గెలిచింది. అంతే అంటారా.... లాస్ట్ మ్యాచ్ ముందు వరకు సెమీస్ రేస్ లో నిలిచింది. పాక్ బదులు గెలిచి ఉంటే... బంగ్లాదేశ్ సెమీస్ కు వచ్చేది. ఇంకో విషయం కూడా ఉంది. వర్షం... వాళ్ల ఫ్లోకు అడ్డు వచ్చిందే తప్ప లేకపోతే ఇండియాకు కూడా గట్టి షాక్ ఇచ్చేవాళ్లు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో ఘోర పరాజయం తప్పిస్తే... ప్రతి మ్యాచ్ లోనూ వాళ్ల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ప్లేయర్స్ పరంగా కాకుండా జట్టు పరంగా చూసుకుంటే కచ్చితంగా ఇదే బంగ్లాదేశ్ కు బెస్ట్ టీ20 వరల్డ్ కప్

ఐర్లాండ్

బంగ్లాదేశ్ లా కూడా ఐర్లాండ్ కూడా చిన్న జట్టేమీ కాదు. గత కొన్నేళ్లుగా మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తోంది. ఈ వరల్డ్ కప్ లో కూడా ఇంగ్లండ్ కు షాక్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయారు. వర్షం వల్ల అఫ్గాన్ మ్యాచ్ రద్దైంది. ఆసీస్, కివీస్ చేతిలో ఓడిపోయారు. అంతమాత్రాన ఐర్లాండ్ టీంను తక్కువ అంచనా వేయడానికి లేదు. మార్క్ అడైర్, జోషువా లిటిల్, బ్యారీ మెక్ కార్తీ బౌలింగ్ లో ఆకట్టుకుంటున్నారు. కొన్ని లూప్ హోల్స్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాటింగ్ లో కూడా టాప్ ఆర్డర్ లో అనుభవజ్ఞులు పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్ బిర్నీ ఉన్నారు. మిడిల్ లో లోర్కాన్ టకర్, హ్యారీ టెక్టర్ ఉన్నారు..... కానీ సేమ్ అన్ని చిన్న జట్లలానే బ్యాటింగ్ లో ఇంకా మెరుగవాల్సిన అవసరముంది.

సో ఓవరాల్ గా చూసుకుంటే... ఈ వరల్డ్ కప్ లో చిన్న జట్లు ఇంత మంచి ప్రదర్శన చేయడం.... ప్రపంచ క్రికెట్ కు చాలా మంచిదే. రసవత్తర మ్యాచెస్ జరిగితే క్రికెట్ కు మేలే కదా. ఇప్పుడు పైన చెప్పుకున్న నాలుగు జట్లన్నీ... బౌలింగ్ విషయంలో పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదేమో. బ్యాటింగ్ లోనే ఇంటర్నేషనల్ లెవల్ కు తగ్గట్టు గేమ్ అవేర్ నెస్, హిట్టింగ్ సామర్థ్యం పెంచుకుంటే సరిపోతుంది. అప్పుడు రాబోయే కాలంలో..... ఏ చిన్న జట్టు పెద్ద టీం మీద గెలిచినా అది ఇక అప్ సెట్ అనడానికి వీల్లేదు. వాళ్లు బాగా ఆడి గెలిచారని అని తీరాల్సిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget