అన్వేషించండి

Harmanpreet Kaur Post Viral: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ కాదు.. వరల్డ్ కప్ ట్రోఫీతో హర్మన్‌ప్రీత్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీతో మొదటి పోస్ట్ షేర్ చేసింది. క్రికెట్ కేవలం జెంటిల్మెన్స్ గేమ్ కాదు అని రాసింది.

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ICC మహిళల వన్డే ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ సాధించిన తరువాత తన మొదటి సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ సంచలనం సృష్టించింది. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రపంచ కప్ విజేత కెప్టెన్‌గా నిలిచిన హర్మన్ ప్రీత్ ఈ పోస్ట్ కేవలం వేడుకలతో లేదు, ఇది అందరి దృష్టిని ఆకర్షించిన ఒక రహస్య సందేశంలా మారింది. 

హర్మన్‌ప్రీత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోఫీతో తన ఫోటోను షేర్ చేసింది. ఆమె ధరించిన టీషర్టుపై “క్రికెట్ కేవలం జెంటిల్‌మెన్ గేమ్ మాత్రమే కాదు” అని రాసి ఉంది. సాధారణంగా క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ అని వ్యవహరిస్తారు. అయితే హర్మన్ టీషర్టుపై క్రికెట్ అందరి గేమ్ అని స్పష్టం చేసింది. అందుకోసం జెంటిల్మెన్ గేమ్ అనే పదాలను కొట్టివేస్తున్నట్లుగా ఆమె జెర్సీపై రాసి ఉంది. క్రికెట్ ఇప్పుడు కేవలం “పురుషుల ఆట” మాత్రమే కాదు, మహిళలది కూడా అని సందేశాన్ని ఇచ్చింది. మహిళా క్రికెటర్లు ఇప్పుడు క్రికెట్‌లో సమాన గౌరవం, గుర్తింపునకు అర్హులని హర్మన్ సందేశం స్పష్టంగా ఉంది.

మహిళా క్రికెట్ కొత్త గుర్తింపు

హర్మన్‌ప్రీత్ పోస్ట్ మహిళా క్రికెట్ మారుతున్న తీరును వివరిస్తుంది. చాలా సంవత్సరాలుగా క్రికెట్‌ను పురుషుల ఆట (జెంటిల్మెన్ గేమ్)గా చూశారు. కాని ఇప్పుడు భారత మహిళా జట్టు ఈ ఆట ఇకపై ‘పురుషుల’ది మాత్రమే కాదు, ‘మహిళల’ది కూడా అని నిరూపించేలా వన్డే వరల్డ్ కప్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. హర్మన్ చేసిన ఈ పోస్ట్‌ను లక్షలాది మంది లైక్ చేశారు. వేలాది మంది వ్యాఖ్యానించి ఆమె ఆత్మవిశ్వాసాన్ని, ఆలోచనను ప్రశంసించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harmann (@imharmanpreet_kaur)

ఫైనల్‌లో భారత్ ఆధిపత్యం

ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా మీద భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన డే అండ్ నైట్ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి మహిళల వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ 87 పరుగులు, స్మృతి మంధాన 45 పరుగులతో రాణించారు. మిడిలార్డర్ లో దీప్తి శర్మ విలువైన 58 పరుగులు,  రిచా ఘోష్ 24 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. టార్గెట్ ఛేదనలో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ సాధించింది. ఆ జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఐదు దశాబ్దాల వరల్డ్ కప్ కల నెరవేరడంతో మహిళల క్రికెట్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget