Ind Vs Aus Test Serie Updates: రంగంలోకి చీఫ్ సెలెక్టర్ అగార్కర్.. రోహిత్ టెస్టు కెరీర్ కు డేంజర్ బెల్స్.. వేటు తప్పదా?
ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్న రోహిత్ టెస్టు కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్ లో మూడు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ కలిపి కేవలం 22 పరుగులే చేశాడు.
Rohit Sharma Test career On Danger: భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు కెరీర్ కు డేంజర్ సిగ్నల్ కనిపిస్తున్నాయి. గతేడాది కాలంగా విఫలమవుతున్న హిట్ మ్యాన్ కెరీర్ పై తుది నిర్ణయానికి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. తాజాగా భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. మెల్ బోర్న్ కు చేరుకోవడం ఈ ఊహగానాలకు మరింత ఊపునిస్తోంది. కెరీర్ పై రోహిత్ తో చర్చించేందుకే అగార్కర్ అంత దూరం వెళ్లాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్ చేరుకోలేకపోతే కచ్చితంగా రోహిత్ పై వేటు ఉండబోతోందని, మెల్ బోర్న్ టెస్టు తర్వాత అతని కెప్టెన్సీపై నిర్ణయం ఉంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఈ సిరీస్ లో ఘోరంగా విఫలం..
ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ లో రోహిత్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ సిరీస్ లో మూడు టెస్టుల్లో కలిపి 4 ఇన్నింగ్స్ లు ఆడిన హిట్ మ్యాన్ కేవలం 22 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా బాక్సింగ్ డే టెస్టులో ఏరి కోరి మరి తన ఓపెనింగ్ పొజిషిన్ లోకి వచ్చిన రోహిత్ కేవలం ఐదు బంతులకే ఔటయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో ఫుల్ షాట్ కు ప్రయత్నించి మిడాన్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జట్టులోతన బ్యాటింగ్ స్థానం గురించి యువ క్రికెటర్ శుభమాన్ గిల్ ను టీమ్ నుంచి తప్పించారు. నిజానికి ఫుల్ షాట్ ఆడటంతో దిట్ట అయిన రోహిత్.. అదే ఫుల్ షాట్ ఆడుతూ ఔట్ కావడం అతని ఫామ్ లేమిని సూచిస్తోందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మండి పడ్డాడు. ఇక ఈ టెస్టులో కెప్టెన్సీ వైఫల్యాలపై కూడా అసహనం వ్యక్తం చేశాడు.
కఠిన నిర్ణయం తప్పదు..
ప్రస్తుతం 37వ పడిలో ఉన్న రోహిత్ టెస్టు కెరీర్ పై కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక బాక్సింగ్ డే టెస్టులో అతను ఔటైన విధానం చూసి ఫైరయ్యాడు. ఫుట్ వర్క్ లేమి, అలసట, రెండు రకాల మైండ్ సెట్ తో బంతిని ఆడి, సునాయసంగా ఔటయ్యాడని విమర్శించాడు. ఏజ్ రిత్యా రోహిత్ అంత చురుకుగా లేడని, బంతిపై షాట్ ఆడటంతో లేట్ అయ్యాడని, అందుకే క్యాచింగ్ ప్రాక్టీస్ మాదిరిగా రోహిత్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడని ఫైరయ్యాడు. ఏదైనా ఏ ఏడాది టీ20 ప్రపంచకప్ సాధించి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. చూడబోతుంటే టెస్టులకు కూడా గుడ్ బై చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే నాలుగు, ఐదో టెస్టులో గెలుపు తప్పనిసరి. ప్రస్తుతం నాలుగో టెస్టులో భారత్ వెనుకంజలో ఉంది. ఐదు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టును భారత్ గెలుపొందగా, రెండోటెస్టును ఆసీస్ కైవసం చేసుకుంది. బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టు పలుమార్లు వర్షం అంతరాయం కలుగడం వల్ల డ్రాగా ముగిసింది. ఇక నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగుల భారీ స్కోరు చేయగా, మూడో రోజు టీ విరామానికి భారత్ ఏడు వికెట్లకు 326 పరుగులు చేసింది.