Ind Vs Aus Test Series: తప్పదు, రోహిత్ త్యాగం చేయాల్సిందే- బ్యాటింగ్ ఆర్డర్ లో స్థానంపై పుజారా సూచన
Rohit Sharma: ఈనెల 14 నుంచి బ్రిస్బేన్ లో ప్రారంభమయ్య మూడో టెస్టులో రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి పుజారా వ్యాఖ్యానించాడు. అలాగే తన బ్యాటింగ్ మెరుగుదల కోసం టిప్స్ చెప్పాడు.
Bumrah Vs Rohit: భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత కొంత అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో తనెక్కడ ఆడాలనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నాడు. తనకెంతో అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానాన్ని వదులు కోలేక, ఇటు మరీ లోయర్ మిడిలార్డర్ లో ఆడలేక సతమతమవుతున్నాడు. అయతే జట్టు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ కొన్ని త్యాగాలకు సిద్ధపడాలని వెటరన్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా సూచించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ కుదురుకున్నారని, వాళ్లను అదే స్థానా్లో బ్యాటింగ్ చేయించాలని సూచించాడు. కష్టమైనప్పటికీ రోహిత్ శర్మ ఆరో స్థానంలోనే బ్యాటింగ్ చేయాలని వ్యాఖ్యానించాడు.
అదొక్కటి మెరుగు పర్చుకుంటే చాలు..
గత న్యూజిలాండ్ సిరీస్ నుంచి విఫలమవుతున్న రోహిత్ ను పుజారా వేనకేసుకొచ్చాడు. తన టెక్నిక్ లో కొన్ని మార్పులు చేసుకుంటే అతను రాణించే అవకాశముందని తెలిపాడు. ముఖ్యంగా స్టంప్ లైన్ లో వస్తున్న బంతులతో హిట్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నాడని, దీన్ని అధిగమించేందుకు నెట్ లో విపరీత సాధన చేయాల్సిన అవసరముందని సూచించాడు. అలాగే ఫుట్ వర్క్ ను కూడా మెరుగుపర్చుుకుంటే రోహిత్ కు తిరుగే ఉండదని తెలిపాడు. ఇక వరుసగా విఫలమవుతున్నా రోహిత్ కు దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా మద్దతుగా నిలిచాడు. క్రికెట్లో తానింకా నిరూపించుకోవల్సిందేమీ లేదని రోహిత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఒకట్రెండు టెస్టుల్లో తను గాడిన పడే అవకాశముందని తెలిపాడు. ఇక ఆసీస్ సిరీస్ లో రోహిత్ ఒక టెస్టు మాత్రమే ఆడాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టు ఆడలేకపోయిన రోహిత్.. అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లు కలిపి 9 పరుగులే చేశాడు.
రోహిత్, బుమ్రా సారథ్యంలోని తేడాలివే..
ఆస్ట్రేలియా పర్యటనలోని తొలి రెండు టెస్టులకు జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ నాయకత్వ వహించిన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా సారథ్యంలోని తొలిటెస్టులో భారత్ గెలుపొందగా, రెండో టెస్టులో మాత్రం రోహిత్ కెప్టెన్సీ పది వికెట్లతో భారత్ ఘోరంగా ఓడిపోయింది. దీనిపై తాజాగా ఆసీస్ మాజీ ప్లేయర్ సైమన్ కటిచ్ వ్యాఖ్యానించాడు. బౌలర్లను సమర్థంగా ఉపయోగించడంలో ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉందని విశ్లేషించాడు. తొలి టెస్టులో 150 పరుగులకే భారత్ ఆలౌటయినప్పటికీ, బౌలర్లు అద్భుతంగా ఆడి మ్యాచ్ ను గెలిపించారని సూచించాడు. ఆ మ్యాచ్ లో ఆసీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 104 పరుగులకే కట్టడి చేయడంలో టీమిండియా సక్సెస్ అయింది.
రెండో టెస్టులో బౌలర్లు తేలిపోవడంతోనే భారత్ ఓడిపోయిందని, బౌలర్లను సమర్థంగా ఉపయోగించుకోవడంలో రోహిత్ విఫలమయ్యాడని తెలిపాడు. అందుకే ట్రావిస్ హెడ్ భారీ సెంచరీతో సత్తా చాటాడని పేర్కొన్నాడు. మ్యాచ్ ను గెలుపొందేందుకు కావాల్సిన అంశాలన్నింటినీ బుమ్రా టిక్ చేశాడని, రోహిత్ మాత్రం ఈ విషయంలో వెనకబడ్డాడని పేర్కొన్నాడు. ఇక రోహిత్ కెప్టెన్సీలో భారత్ కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. స్వదేశంలో కివీస్ చేతిలో మూడు మ్యాచ్ ల్లో ఓడగా, తాజాగా ఆసీస్ చేతిలోనూ పరాజయం పాలైంది.
Also Read: Shaheen Afridi: హిస్టరీ క్రియేట్ చేసిన ఆఫ్రిదీ.. పాక్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మొనగాడు
Also Read: ICC Punishment: అంపైర్లను దూషించిన ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయర్- ఐసీసీ కన్నెర్ర