Shaheen Afridi: హిస్టరీ క్రియేట్ చేసిన ఆఫ్రిదీ.. పాక్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మొనగాడు
Shaheen Afridi Record: తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది తన దేశం తరపున రికార్డు నెలకొల్పాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఒక ఘనత సాధించిన ఏకైక పాక్ బౌలర్ తనే కావడం విశేషం.
Cricket News: పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిది తాజాగా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలో కలిపి వంద వికెట్లు సాధించిన తొలి పాక్ ప్లేయర్ గా 24 ఏళ్ల షాహిన్ నిలిచాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన ఆఫ్రిది.. అంతర్జాతీయంగా వంద టీ20 వికెట్లు తీసిన క్లబ్బులో స్థానం దక్కించుకున్నాడు. 74వ మ్యాచ్ లో తను ఈ ఘనత సాధించడం విశేషం. టీ20ల్లో అతనికంటే ముందు హారీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ మాత్రమే ఈ క్లబ్బులో తమ పేరు లిఖించుకున్నారు. మొత్తానికి ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. ఇక ఆల్ ఫార్మాట్ వంద వికెట్ల క్లబ్బులో ఇంకా టిమ్ సౌతీ (న్యూజిలాండ్), షకీబల్ హసన్ (బంగ్లాదేశ్), శ్రీలంకకు చెందిన లసిత్ మలింగా మాత్రమే ఉన్నారు.
Shaheen Afridi joins the elite club of picking 100 wickets in each format !#PakistanCricket pic.twitter.com/EEgGxu4eIg
— CAPTAIN SUII 🐐 (@VKBA1856) December 11, 2024
పొదుపుగా బౌలింగ్ చేసి..
నిజానికి ఈ మ్యాచ్ లో ఆఫ్రిది మంచి టచ్చులో కనిపించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత 140 కేపీహెచ్ మార్కును అందుకున్నాడు. తొలుత రస్సీ వాన్ డర్ డస్సెన్ ను అద్భుతమైన యార్కర్ తో బౌల్డ్ చేసిన ఆఫ్రిది.. తర్వాత డేవిడ్ మిల్లర్, పీటర్ లను బోల్తా కొట్టించి వంద వికెట్ల ఘనతను సాధించాడు. ఇక టెస్టుల్లో 116 వికెట్లు తీసిన ఆఫ్రిది.. వన్డేల్లో 112 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి మూడు ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి పాక్ బౌలర్ గా నిలవడం తనకెంతో సంతోషంగా ఉందని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. మరోవైపు తమ దేశం తరపున ఆఫ్రిది ఈ రికార్డు నెలకొల్పడంతో అభిమానులు ఫుల్లు ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆఫ్రిది సాగించిన వికెట్ల వేటకు సంబంధించి క్లిప్పింగ్ లను షేర్ చేస్తే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తొలి టీ20లో పాక్ బోల్తా..
దక్షిణాఫ్రికా పర్యటనను ఓటమితో పాక్ ఆరంభించింది. డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 183 పరుగులు చేసింది. మిల్లర్ విధ్వంసక మెరుపు ఫిఫ్టీ (40 బంతుల్లో 82, 4 ఫోర్లు, 8 సిక్సర్లు)తో చెలరేగాడు. పాక్ బౌలర్లను ఊచకోత కోసి, సిక్సర్ల వర్షం కురిపించడంతో ప్రొటీస్ భారీ స్కోరు సాధించింది. జార్జ్ లిండ్ (48) చివర్లో చెలరేగాడు. ఆఫ్రిదితోపాటు అబ్రార్ అహ్మద్ కి మూడు వికెట్లు దక్కాయి. అబ్బాస్ ఆఫ్రిది రెండు వికెట్లు తీశాడు.
ఇక ఛేదనలో పాక్ చేతులెత్తేసింది. ఓవర్లన్నీ ఆడి 172/8కే పరిమితమైంది. దీంతో 11 పరుగులతో పరాజయం పాలైంది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 74) వన్డే తరహా బ్యాటింగ్ తో విసిగించాడు. బాబర్ ఆజమ్ డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో స్వల్ప తేడాతో పాక్ ఓడిపోయింది. లిండే నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. మఫాక రెండు వికెట్లు తీశాడు. దీంతో మూడు టీ20ల సిరీస్ లో 1-0తో సఫారీలు ఆదిక్యంలో నిలిచారు. సిరీస్ లో తర్వాతి మ్యాచ్ సెంచూరియాన్ వేదికగా శుక్రవారం జరుగుతుంది.
Also Read: అబుధాబి టీ10 లీగ్ లో ఫిక్సింగ్ కలకలం? ఆరేళ్ల నిషేధం విధించిన ఐసీసీ