Asia Cup 2025 Ban vs SL Result Update: లంకకు షాక్.. 4 వికెట్లతో బంగ్లా విజయం.. రాణించిన సైఫ్, తౌహిద్.. లీగ్ దశ ఓటమికి బంగ్లా ప్రతీకారం..
సూపర్ 4 లో అనూహ్య ఫలితం వచ్చింది. లీగ్ దశలో తమను ఓడించిన లంకపై బంగ్లా ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటి, సూపర్-4లో బోణీ కొట్టింది.

Asia Cup 2025 Bangaledesh Stuns Sri Lanka latest News : ఆసియాకప్ లో చిన్నపాటి సంచలనం నమోదైంది. సూపర్-4 తొలి మ్యాచ్ లో గత ఎడిషన్ రన్నరప్ శ్రీలంకపై బంగ్లా అద్బుత విజయం సాధించింది. శనివారం దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంక.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ దాసున్ షనక ధనాధన్ ఫిఫ్టీ (37 బంతుల్లో 64 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో ముస్తాఫిజుర్ రహ్మాన్ మూడు వికెట్లతో రాణించాడు.
అనంతరం టార్గెట్ ను 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసి, బంగ్లా పూర్తి చేసింది. ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సైఫ్ హసన్ సూపర్భ్ ఫిఫ్టీ (45 బంతుల్లో 61, 2 ఫోర్లు, 4 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో వనిందు హసరంగా, షనకలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో లీగ్ దశలో లంక చేతిలో ఎదురైన పరాజయానికి బంగ్లా ప్రతీకారం తీర్చుకుంది. మరోవైపు లీగ్ దశలో హ్యాట్రిక్ విక్టరీలతో సత్తా చాటిన లంక.. సూపర్-4 తొలి మ్యాచ్ లోనే చేతులెత్తేసింది. సూపర్-4లో తర్వాతి మ్యాచ్ ఆదివారం ఇదే వేదికపై భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతుంది.
Bangladesh notch up a statement win ✌️
— AsianCricketCouncil (@ACCMedia1) September 20, 2025
Led by incredible 5️⃣0️⃣s from Saif Hassan & Towhid Hridoy, 🇧🇩 channelled their inner tigers in an all-out attack on their opponents, claiming victory! 👏#SLvBAN #DPWorldAsiaCup2025 #ACC pic.twitter.com/ThtrWgXaZC
రాణించిన ఓపెనర్లు..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లంకకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. పతుమ్ నిసాంక (22), వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (34) వేగంగా ఆడారు. వీరిద్దరూ 44 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడం, మిడిలార్డర్ కాస్త తడబడటంతో లంక కుదుపునకు లోనైంది. అయితే షనక మాత్రం ఆరు సిక్సర్లతో రెచ్చిపోయాడు. చివరికంటా క్రీజులో నిలిచి, ఫైటింగ్ టోటల్ ను జట్టుకు అందించాడు.అతనికికెప్టెన్ చరిత్ అసలంక (21) చక్కని సహకారం అందించాడు. మిగతా బౌలర్లలో మహెది హసన్ కు రెండు వికెట్లు దక్కాయి.
సైఫ్, తౌహిద్ జోరు..
కాస్త డీసెంట్ టార్గెట్ ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన బంగ్లాకు ఆరంభంలోనే షాక్ తాకింది. ఓపెనర్ తంజిద్ హసన్ డకౌటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ లిటన్ దాస్ (23) తో కలిసి సైఫ్ ఇన్నింగ్స్ నిర్మించాడు. వీరిద్దరూ వేగంగా ఆడారు. అయితే దాస్ ఔటైన తర్వాత, తౌహిద్ హృదయ్ (37 బంతుల్లో 58, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కని అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ లంక బౌలర్లను ఉతికారేశారు. మూడో వికెట్ కు మ్యాచ్ విన్నింగ్ 54 పరుగులు జోడించారు. ఈక్రమంలో36 బంతుల్లో సైఫ్, 31 బంతుల్లో తౌహిద్ ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరిని కీలక దశలో ఔట్ చేసిన లంక బౌలర్లు.. బంగ్లాపై ఒత్తిడి పెంచి మరిన్ని వికెట్లు సాధించారు.అయితే షమీమ్ హుస్సేన్ (14 నాటౌట్) జట్టు విజయతీరాలకు చేరే వరకు క్రీజ్ లో నిలిచాడు.




















