Suryakumar Remembers Rohit Sharma Asia Cup 2025 | హిట్‌మ్యాన్‌లా మారిపోతున్న సూర్యకుమార్
ఆసియా కప్ లో ఇండియా ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ... రోహిత్ శర్మను గుర్తు చేసుకున్నాడు. టాస్ టైంలో ప్లేయర్స్ పేర్లను మర్చిపొయ్యాడు. " నేను రోహిత్‌లా మారిపోతున్నా.. అని నవ్వుతూ బదులిచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే ఆసియాకప్ లో ఇండియా ఒమన్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్..బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కామెంటేటర్ రవిశాస్త్రి.. ఫైనల్ టీమ్ లో చేంజెస్ గురించి సూర్యను అడిగాడు. సూర్య ఒక్కసారిగా టీమ్ లో మార్పులను మర్చిపోయాడు.
“హర్షిత్ రాణా ఫైనల్ టీమ్ లో ఉన్నాడు. ఇంకొకరు ఎవరంటే.. ఎవరంటే.. అదేంటి నేను రోహిత్ శర్మలా మారిపోయాను. ఏదోలే ... మొత్తంగా రెండు మార్పులతో ఈ మ్యాచ్‌లోకి దిగాం” అని అన్నాడు. అర్షదీప్ సింగ్ పేరు చెప్పడం సూర్యకుమార్ మర్చిపోయాడు.
అయితే ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ కూడా తన టీమ్ లోని చేంజెస్ ను మర్చిపొయ్యాడు. ఈ వీడియో చూసిన వారంతా రోహిత్ శర్మను గుర్తు చేసుకుంటున్నారు. రోహిత్ శర్మ కూడా గతంలో ఇలా ఎన్నో సార్లు టాస్ సమయంలో ప్లేయర్స్ పేరు చెప్పడం మర్చిపోయాడు. కొన్ని సార్లు అయితే టాస్ గెలిచాక ఎం ఎంచుకోవాలో కూడా మర్చిపొయ్యాడు. ఈ ఇద్దరు కెప్టెన్స్ కలిసి రోహిత్ శర్మకు ట్రిబ్యూట్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు.





















