అన్వేషించండి

Asia Cup 2025 Ind vs Pak Preview Update: మ‌రోసారి దాయాదుల పోరుకు రంగం సిద్దం.. స‌మ‌రోత్సాహంతో టీమిండియా.. అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా సూర్య సేన‌.. ప్ర‌తీకారంతో పాక్..

వారం వ్య‌వ‌ధింలో మ‌రోసారి దాయాదులు పాక్, భార‌త్ త‌ల‌ప‌డుతున్నాయి. తొలి మ్యాచ్ లో విజ‌యం సాధించిన ఉత్సాహంలో టీమిండియా బ‌రిలోకి దిగుతుండ‌గా, ఈ సారి ఎలాగైనా నెగ్గాల‌ని పాక్ భావిస్తోంది. 

Asia Cup 2025 Ind vs Pak latest News :  హ్యాండ్ షేక్, మ్యాచ్ రిఫరీ వివాదం త‌ర్వాత చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ మ‌రోసారి డీకొన‌నున్నాయి. ఆసియాక‌ప్ సూప‌ర్-4 రెండో మ్యాచ్ లో దాయాదులు దుబాయ్ వేదిక‌గా ఆదివారం త‌ల‌ప‌డ‌నున్నాయి. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ మ్యాచ్ కాస్త ఎమోష‌న‌ల్ గా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిస్సందేహంగా ఈ మ్యాచ్ లో భార‌తే ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగుతోంది. కీల‌క మైన మ్యాచ్ కాబ‌ట్టి, పూర్తి స్థాయి టీమ్ తో జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది. ఈ నేప‌థ్యంలో స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి తిరిగి పునరాగ‌మ‌నం చేసే అవ‌కాశ‌ముంది. ఈ మ్యాచ్ లో నెగ్గి, సూప‌ర్-4లో శుభారంభం చేయాల‌ని ఇరుజ‌ట్లు భావిస్తున్నాయి. 

ప‌టిష్టంగా టీమిండియా..
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో పాక్ కంటే టీమిండియా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. ఓపెనర్లుగా శుభ‌మాన్ గిల్, అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగుతుండ‌గా,  మిడిలార్డ‌ర్ లో కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌, ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, శివ‌మ్ దూబే, వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ ఆడ‌తారు. ఒమ‌న్ తో మ్యాచ్ లో త‌ల‌కు గాయం కావ‌డంతో అక్ష‌ర్ ప‌టేల్ ఈ మ్యాచ్ లో ఆడేది లేనిది డౌట్ గా ఉంది. త‌ను బ‌రిలోకి దిగ‌క‌పోతే అర్ష‌దీప్ సింగ్ లేదా హ‌ర్ఙిత్  రాణా ఆడే అవ‌కాశ‌ముంది. పేస‌ర్ గా జ‌స్ ప్రీత్ బుమ్రా ఆడుతుండ‌గా, స్పిన్న‌ర్లుగా కుల్దీప్ యాద‌వ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బ‌రిలోకి దిగుతారు. దీంతో భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. ఇక లీగ్ దశలో మూడింటికి మూడు మ్యాచ్ లు గెలిచి, సమరోత్సాహంతో ఉంది. అలాగే పాక్ పై కూడా ఈజీ విక్టరీని సొంతం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్ లో మరింత జోష్ గా బరిలోకి దిగబోతోందని తెలుస్తోంది. ఇక భారత్ తర్వాతి మ్యాచ్ ల్లో ఈనెల 24న బంగ్లాదేశ్, 26న శ్రీలంకతో తలపడనుంది. 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 

అయోమ‌యంలో.. 
ఈ టోర్నీలో పాక్ కాస్త అయోమ‌యంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌ర‌చూ ప్లేయింగ్ లెవ‌న్ ను మారుస్తూ ఉంది. ఇక అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ చెప్పుకోద‌గిన విధంగా రాణించ‌డం లేదు. గ‌త ఆదివారం జ‌రిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫ‌ల్యంతోనే జట్టు ఓడిపోయింది. ఈ సారి మాత్రం అలాంటి పొర‌పాటు రిపీట్ కావ‌ద్ద‌ని భావిస్తోంది. మ్యాచ్ కోసం స‌రైన జ‌ట్టును ఎంపిక చేయ‌డం స‌వాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏ కాంబినేషన్ తో ఆడుతుందో చూడాలి.  తొలి మ్యాచ్ లో ఓడిపోవ‌డంతో అభిమానులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉండ‌టంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాల‌ని టీమ్ మేనేజ్మెంట్ కోరుకొంటోంది.  ఇక ఈ మైదానంలో ఛేజ్ చేసే జ‌ట్ల‌కు అనుకూలంగా మారుతోంది. దీంతో టాస్ గెలిచిన జ‌ట్లు ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశ‌ముంది. ఈ మ్యాచ్  సోనీ నెట్ వ‌ర్క్ లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget