అన్వేషించండి

Australia vs West Indies: విండీస్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా,భారత్‌ ర్యాంకును దెబ్బకొట్టిన కంగారులు

Australia vs West Indies: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో విజయంతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా... టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది.

వెస్టిండీస్‌(West Indies)తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా(Australia) ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌ల కంగారుల ధాటికి కరేబియన్‌ జట్టు తేలిపోయింది. వెస్టిండీస్‌ నిర్ణయించిన 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌( World Test Championship)లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా... టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ రోహిత్‌ సేనకు కీలకంగా మారింది. ఆ సిరీస్‌ను కైవసం చేసుకుంటే టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకోనుంది. 

మ్యాచ్‌ సాగిందిలా...?
ఇటీవలే స్వదేశంలో పాక్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆస్ట్రేలియా.. తొలి టెస్ట్‌ను విండీస్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కరేబియన్‌ జట్టు.. హాజిల్‌వుడ్‌ 4/44, కమిన్స్‌ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కిర్క్‌ మెక్‌కెంజీ (50), షమార్‌ జోసఫ్‌ (36) మాత్రమే రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌.. ట్రవిస్‌ హెడ్‌ సెంచరీతో  283 పరుగులకు ఆలౌటైంది. హెడ్‌ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లోనే విండీస్‌ పేసర్‌ షమార్‌ జోసఫ్‌ అయిదు వికెట్లు నేలకూల్చి సత్తా చాటాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే స్టీవ్‌ స్మిత్‌ను అవుట్‌ చేసి రికార్డు సృష్టించాడు. 95 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్‌ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్‌ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్‌ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కిర్క్‌ మెక్‌కెంజీ (26) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో విండీస్‌ ముందు 26 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌.. వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్‌ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్‌ హెడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.


వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ర్యాంకులు ఇలా...
ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పట్టికలో ఆసీస్‌ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుత డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆసీస్‌ తొమ్మిది టెస్టులు ఆడింది. ఆరు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో మొత్తం 61.11 శాతం విజయాలతో తొలి స్థానంలో నిలిచింది. టీమ్‌ఇండియా రెండో స్థానానికి పడిపోయింది. భారత్ నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక ఓటమి, ఒక డ్రాతో 54.16 శాతం నమోదు చేసింది. దక్షిణాఫ్రికా (50శాతం), న్యూజిలాండ్‌ (50), బంగ్లాదేశ్‌ (50) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే సీజన్‌ పూర్తయ్యే నాటికి తొలి రెండు స్థానాల్లో నిలవాలి. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఆడనుంది. ఈ సిరీస్‌లో అధిక విజయాలు నమోదు చేస్తే మళ్లీ అగ్రస్థానానికి చేరుకొనే అవకాశం భారత్‌కు ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలతNagababau on Pithapuram | గీతకు కాల్ చేసిన కడప వ్యక్తి..వార్నింగ్ ఇచ్చిన నాగబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్ 
Jayaprada: తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
తిరుమలలో జయప్రద, ఏపీ ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు
ITR 2024: పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
పోస్టాఫీస్‌లో ఈ ఖాతా ఉందా?, ఆదాయ పన్ను భారం రూ.లక్షన్నర తగ్గినట్లే
Kodali Nani: గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
గుడివాడలో కొడాలి అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన! టీడీపీ ఫిర్యాదుతో టెన్షన్‌లో నాని
Telangana Lok Sabha Elections : అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
అసెంబ్లీ ఎన్నికలతోనే అలసిపోయిన నేతలు - తెలంగాణలో లోక్‌సభ ప్రచారంపై నిర్లిప్తత
IPL 2024: గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
గుజరాత్‌-బెంగళూరు మ్యాచ్‌, రికార్డులు ఎవరివైపు అంటే?
HBD Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
సమంత బర్త్ డే స్పెషల్ - ఆమె కూడా మరో సావిత్రేనా? సినిమాల సక్సెస్​కి, కెరీర్​ డౌన్​ఫాల్​కి తనే కారణమా?
TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షల షెడ్యూలు విడుద‌ల‌, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
Embed widget