అన్వేషించండి

AUS vs PAK: టాస్‌ గెలిచి బౌలింగ్‌కు దిగిన పాక్‌ - ప్రపంచ కప్ లో మరో ఆసక్తికర మ్యాచ్

Pakistan Vs Australia: ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అయిదుసార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి.

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అయిదుసార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. ప్రపంచకప్‌లో భాగంగా  ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు విజయం కీలకం కావడంతో విజయం కోసం ఆసిస్‌-పాక్ సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు చెరి 3 మ్యాచ్‌లు ఆడగా.. పాక్‌ రెండింటిలో, ఆస్ట్రేలియా ఓ మ్యాచ్‌లో గెలుపొందాయి. రెండు మ్యాచుల్లో ఓడిన ఆసీస్‌కు ఈ మ్యాచ్‌ అత్యంత కీలకం కానుంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. భారత్‌, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన శ్రీలంకపై గెలిచిన కంగారులు పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌ తర్వాత ఆరో స్థానంలో ఉన్నారు. నెదర్లాండ్స్‌, శ్రీలంకలను ఓడించి, భారత్‌ చేతిలో ఓడిన పాక్‌ నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపోటములు పాయింట్ల పట్టికలో స్థానాలను తారుమారు చేయనున్నాయి. 
 
మారనున్న సెమీస్‌ సమీకరణాలు
 
పాకిస్థాన్, ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ వైపు అడుగు బలంగా వేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. ఒత్తిడిని ఎదుర్కొంటూ గెలుపొందాలని కంగారూలు, పాక్ జట్టు ప్రణాళిక రచిస్తున్నాయి. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. దాన్ని మరచిపోయి ఆసిస్‌పై గెలుపొందాలని బాబర్‌ సేన భావిస్తోంది. టీమిండియా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పాక్ ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో హైదరాబాద్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పాక్‌.. తర్వాత టీమిండియా చేతిలో పరాజయం పాలైంది.
 
పాక్‌కు విజయం అత్యవసరం
 
మరోవైపు ఆసీస్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆసిస్‌ భారత్‌పై ఓటమితో కంగుతింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన లంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించడం కంగారూల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా-పాక్‌ 69 వన్డేలు ఆడగా అందులో 34 మ్యాచుల్లో కంగారూలు గెలుపొందారు. ప్రపంచ కప్‌లో పది మ్యాచ్‌లు అడగా అందులో ఆరు మ్యాచ్‌లు ఆసిస్ గెలవగా.. 4 మ్యాచుల్లో పాక్‌ గెలిచింది. ప్రారంభం నుంచి ధాటిగా ఆడుతూ ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాలని పాక్‌ భావిస్తోంది. ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ మూడు మ్యాచ్‌ల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేయడం పాక్‌ను కలవరపెడుతోంది. ఫఖర్ జమాన్‌, అబ్దుల్లా షఫీక్‌ భారీ పరుగులు చేయాలని బాబర్‌ సేన కోరుకుంటోంది. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో పాక్‌ సారథి బాబర్ అజమ్ భారీ స్కోరు చేయకపోవడం మేనేజ్మెంట్‌ ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌పై అర్ధ శతకం చేసిన బాబర్‌... నెదర్లాండ్స్, శ్రీలంకపై తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. 
 
గాడిన పడాలని చూస్తున్న ఆసిస్
 
ఆస్ట్రేలియా ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం సాధించింది. సెమీస్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌ కీలకం కావడంతో కంగారూలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జోష్ ఇంగ్లిస్ మినహా మరే బ్యాట్స్‌మెన్‌ ఈ ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇంగ్లిష్‌ మినహా మరే ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ 50 పరుగులు కూడా చేయలేకపోవడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని తెలియజేస్తోంది. ప్రపంచకప్‌లో 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ మార్నస్ లబుషేనే. 
 
ఆస్ట్రేలియా:
 
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్,  జోష్ ఇంగ్లిస్, జోష్ హేజిల్‌వుడ్,  మార్నస్ లబుషేన్‌, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
 
పాకిస్థాన్:
బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ , షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాసిం.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Satyavathi Rathod With ABP Desam: బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
బిడ్డ ఆసుపత్రిలో ఉంటే తల్లి బ్యూటీపార్లర్‌కు వెళ్లినట్లుంది రేవంత్ పాలన- ఏబీపీ దేశంతో సత్యవతి రాథోడ్
Kia Price Hike: జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
జనవరి నుంచి పెరగనున్న కియా కార్ల ధరలు - ఎంత పెరగనున్నాయి?
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Embed widget