అన్వేషించండి

Rohit ODI Record: పదివేల పరుగుల క్లబ్‌లో హిట్‌మ్యాన్ - ఆసియా కప్‌లో అజేయ సారథిగా రికార్డు

టీమిండియా సారథి రోహిత్ శర్మ వన్డేలలో అరుదైన ఘనతను అందుకున్నాడు. యాభై ఓవర్ల ఫార్మాట్‌లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

Rohit ODI Record: భారత క్రికెట్  జట్టు సారథి  రోహిత్ శర్మ వన్డేలలో  మరో మైలురాయిని అందుకున్నాడు.   50 ఓవర్ల ఫార్మాట్0లో హిట్‌మ్యాన్ పదివేల పరుగుల క్లబ్‌లో చేరాడు.  తద్వారా ఈ ఘనత సాధించిన  ఆరో  భారత (అంతర్జాతీయ స్థాయిలో 15) బ్యాటర్‌గా నిలిచాడు.  మంగళవారం  భారత్ - శ్రీలంక మధ్య  ముగిసిన మ్యాచ్‌లో  రోహిత్ ఈ ఘనత సాధించాడు.  నిన్నటి మ్యాచ్‌లో  హిట్‌మ్యాన్ సాధించిన రికార్డులు కింది విధంగా ఉన్నాయి. 

రోహిత్ @ 10 వేలు

- వన్డేలలో పదివేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న  రెండో క్రికెటర్ రోహిత్. ఈ ఘనతను  అందుకోవడానికి హిట్‌మ్యాన్‌కు 241 ఇన్నింగ్స్ అవసరం పడ్డాయి. అంతకుముందు  విరాట్ కోహ్లీ  205 ఇన్నింగ్స్‌లలోనే  పదివేల పరుగుల క్లబ్‌లో చేరాడు.   భారత క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్, గంగూలీ   263 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించారు. భారత క్రికెట్ జట్టులో సచిన్ (18,426), విరాట్ (13,027), గంగూలీ (11,363), ద్రావిడ్ (10,889), ఎంఎస్ ధోని (10,773)  తర్వాత స్థానం రోహిత్‌ (10,031)దే..

- రోహిత్‌కు  ఆసియా కప్ - 2023లో ఇది వరుసగా మూడో అర్థ సెంచరీ. తద్వారా అతడు ఈ టోర్నీ చరిత్రలో 10 కంటే ఎక్కువగా ఫిఫ్టీ ప్లస్  స్కోర్లు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.    శ్రీలంకతో మ్యాచ్‌లో చేసిన  53 పరుగులతో  ఈ టోర్నీలో  రోహిత్ 10 అర్థ శతకాలు పూర్తి చేశాడు.   ఆసియా కప్‌లో రోహిత్  ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది.   25 ఇన్నింగ్స్‌లలో 10 అర్థ శతకాలు ఒక శతకంతో  ఉన్న  రోహిత్.. కుమార సంగక్కర (8 హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు - 12) తర్వాత ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.  

 

- వన్డేలలో  అత్యంత వేగంగా 8వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్ కూడా రోహిత్ శర్మనే.. 

- ఈ మ్యాచ్‌లో గిల్ నిష్క్రమించిన తర్వాత  కోహ్లీతో కలిసి రోహిత్ రెండో వికెట్‌కు 10 పరుగులు జోడించాడు.  తద్వారా  వన్డేలలో ఈ  జోడీ 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని  పూర్తిచేసుకున్నారు. 

ఆసియా కప్‌లో ఓటమెరుగని సారథి.. 

-  ఆసియా కప్‌లో ఓటమెరుగని సారథిగా  రోహిత్ శర్మ రికార్డు కొనసాగుతోంది. వన్డే ఫార్మాట్‌లో 2018లో నిర్వహించిన  ఆసియా కప్‌కు అతడే సారథి.   ఆ టోర్నీలో ఐదు మ్యాచ్‌లను  నెగ్గి ట్రోఫీ కూడా నెగ్గిన రోహిత్ సేన ఇప్పుడు నేపాల్, పాకిస్తాన్, శ్రీలంకలపై గెలిచింది. రోహిత్‌కు వరుసగా ఇది 8వ విజయం.  ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వన్డేలు గెలిచిన సారథులలో  9 విజయాలతో ధోని ప్రథమ స్థానంలో ఉండగా రోహిత్  8 విజయాలతో ఉన్నాడు. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi at Uppal Stadium: ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
ఉప్పల్ లో మెస్సీ మేనియా.. పిల్లలకు ఫుట్ బాల్ టిప్స్ నేర్పించి వారెవ్వా అనిపించిన మెస్సీ
Etala Rajender Fire: నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
నేను ఏ పార్టీనో టైమ్ విల్ డిసైడ్ - మరోసారి ఈటల సంచలన వ్యాఖ్యలు
H3N2 Super Flu: బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు చేరిన H3N2 సూపర్ ఫ్లూ వైరస్.. భారత్‌కు తప్పని ముప్పు
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Parvathi Reddy: మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
మెస్సీ టూర్ చీఫ్ ప్యాట్రన్ పార్వతీరెడ్డి - ఈమె ఎవరంటే?
Embed widget