అన్వేషించండి

BCCI: విదేశీ టూర్లలోనూ కుటుంబాలు మాతోనే ఉండాలి - కోహ్లీ అభిప్రాయం - రూల్స్ మార్చేందుకు బీసీసీఐ రెడీ !

Virat Kohli: విదేశీ పర్యటనల సమయంలో కుటుంబాలు వెంట ఉండటానికి బీసీసీఐ అనుమతించకపోవడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే బీసీసీఐ ఈ అంశంపై నిబంధనలు సడలించడానికి సిద్ధమయింది.

Team India: భారత క్రికెటర్లు విదేశాల్లో సిరీస్‌లు ఆడేందుకు వెళ్లే సమయంలో కుటుంబాలను తీసుకెళ్లే విషయంలో ఉన్న నిబంధనలను మరింత సరళతరం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పుడున్న రూల్స్ పై విరాట్ కోహ్లీ ఇటీవల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకురావాలని భావిస్తోంది. విదేశాల్లో ఆడేటప్పుడు ఆటగాళ్లు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే కుటుంబసభ్యులు కూడా ఉంటే బాగుంటుందని క్రికెటర్లు భావిస్తున్నారు.  "ఆటగాళ్ళు తమ కుటుంబాలు పర్యటనలలో ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. BCCI తగిన విధంగా నిర్ణయం తీసుకుంటుంది" అని BCCI ఉన్నతాధికారి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. 

విదేశీ పర్యటనల సమయంలో పరిమితంగానే కుటుంబానికి అనుమతి

ప్రస్తుతం విదేశీ సిరీస్‌ల సమయంలో కుటుంబాలను తీసుకెళ్లడంపై ఆంక్షలు ఉన్నాయి. విదేశీ పర్యటనల సమయంలో ప్రస్తుతం వారి భాగస్వాములు,  పిల్లలు రెండు వారాల వరకు గడపవచ్చు. అంత కంటే ఎక్కువ ఉండటానికి అవకాశం లేదు. అది కూడా సిరీస్ నలభై ఐదు రోజుల మించి జరిగే అవకాశం ఉంటేనే. ఈ సమయంలో కూడా వసతి సౌకర్యాన్ని మాత్రమే బీసీసీఐ భరిస్తుంది. కుటుంబ ఖర్చులన్నీ క్రికెటరే పెట్టుకోవాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనల సమయంలో బీసీసీఐ పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వారాల పాటు కుటుంబాన్ని తన వెంట ఉంచకోవాలనుకుంటే ముందుగా కోచ్, కెప్టెన్ ,  GM ఆపరేషన్స్ అంగీకరించిన తేదీలలో మాత్రమే షెడ్యూల్  చేస్తారు. వారి ఆమోదం లేకపోతే ఆ అనుమతి కూడా ఉండదు. 

కుటుంబాలు వెంట ఉంటేనే బాగుంటుందన్న కోహ్లీ 
 
ఇటీవల IPL 2025 కి సంబంధించిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ కుటుంబ ప్రయాణంపై ఉన్న ఆంక్షలకు వ్యతిరేకంగా గళం విప్పాడు. ఏ ఆటగాడు అయినా  కుటుంబం ఎల్లప్పుడూ తన చుట్టూ ఉండాలని కోరుకుంటారని అన్నాడు. ఆట ముగిసిన తర్వాత తాను  ఒంటరిగా గదికి వెళ్లి  కూర్చుని విచారంగా ఉండటం తనకు ఇష్టం ఉండదన్నారు. కుటుంబం పక్కన ఉంటే..ఆటను  ఒక బాధ్యతగా పరిగణించవచ్చు. మరింత మానసికంగా బలంగా ఉండవచ్చని విరాట్ కోల్హీ అభిప్రాయపడ్డారు.  మాజీ కెప్టెన్ కపిల్ దేవ్  విరాట్ కోహ్లీ వ్యాఖ్యలకు మద్దతు పలికాడు. కపిల్ దేవ్ హయాంలో క్రికెటర్లతో పాటు కుటంబాలు రావడానికి ఆంక్షలు ఉండేవి కావు. ఇదే విషయాన్ని కపిల్ దేవ్ చెప్పారు.  

కోహ్లీకి కపిల్ దేవ్ సపోర్టు - రూల్స్ మార్చేందుకు బీసీసీఐ రెడీ
   
ఇటీవల దుబాయ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోపీలో  భారత ఆటగాళ్లతోపాటు వారి కుటుంబాలు కూడా వచ్చాయి. విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ వంటి వారు తమ కుటుంబాలతో కలిసి చాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని ఆస్వాదించారు.  గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో పరాజయం తర్వాత కుటుంబాలతో వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని సరిగ్గా ఆడటం లేదన్న విమర్శలు రావడంతో  విదేశీ పర్యటనలలో కుటుంబాలు ఆటగాళ్లతో ఉండటానికి అనుమతించిన సమయాన్ని బీసీసీఐ  పరిమితం చేసింది. ఇప్పుడు ఆ విధానాలను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget