By: ABP Desam | Updated at : 05 Jan 2022 12:37 PM (IST)
టెస్టు చాంపియన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ (Image: AFP)
Nz Vs Ban 1st Test Bangladesh Defeat New Zealand: పసికూన అనే పేరును చెరిపేసుకున్న బంగ్లాదేశ్ జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తూ సరికొత్త చరిత్ర లిఖించుకుంది. గతేడాది టెస్టుల్లో వరుస పరాజయాలతో చతికిలబడిన బంగ్లాదేశ్ తాజాగా టెస్టు ఛాంపియన్ న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. ఓవల్‌లోని మౌంట్ మాంగనీలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుపై బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 10 ఏళ్ల తరువాత కివీస్‌ను వారి గడ్డపై ఓడించిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.
గత పది సంవత్సరాల నుంచి కివీస్ గడ్డపై ఆ జట్టును ఏ ఆసియా జట్టు ఓడించలేదు. తాజాగా ఆ చరిత్రను బంగ్లాదేశ్ తిరగరాస్తూ న్యూజిలాండ్‌పై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. కివీస్ గడ్డపై 16 ఓటముల తర్వాత బంగ్లా టీమ్ గెలిచింది. ఆట ఐదవరోజు తమ కివీస్ 147/5 గా ఉన్న కివీస్ మరో 22 పరుగులకే చివరి 5 వికెట్లు కోల్పోయింది. విజయానికి కేవలం 40 పరుగులు అవసరం కావడంతో బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.
బంగ్లాదేశ్‌కు అన్ని ఫార్మాట్లలో కలిపి కివీస్‌పై ఇదే తొలి గెలుపు. గతంలో ఆడిన 32 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ దే పైచేయి. తాజా విజయంతో బంగ్లా ఆటగాళ్లలో నూతనోత్సాహం కనిపిస్తోంది. తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిన్ నెగ్గిన కివీస్‌ను బంగ్లాదేశ్ ఓడించడాన్ని అన్ని దేశాల క్రికెట్ జట్లు స్వాగతిస్తున్నాయి. చివరిసారిగా హామిల్టన్ వేదికగా 2011 జనవరిలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. ఆ తరువాత కివీస్‌ను వారి గడ్డ మీద ఓడించిన ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ నిలిచింది.
Also Read: Ranji Trophy Postpone: ఆటగాళ్లకు కరోనా ఎఫెక్ట్.. రంజీ ట్రోఫీ వాయిదా వేసిన బీసీసీఐ
Also Read: Bengal Team Covid Positive: శివమ్ దూబె, బెంగాల్ రంజీ క్రికెటర్లలో ఏడుగురికి కరోనా
Thailand Open: ప్చ్.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!
IPL 2022 TV Ratings: ఐపీఎల్ టీవీ రేటింగ్స్ ఢమాల్! పరిహారం డిమాండ్ చేస్తున్న అడ్వర్టైజర్లు
MI vs DC: అర్జున్ తెందూల్కర్‌కు టైమొచ్చింది! ట్విటర్లో ట్రెండింగ్!
MI vs DC: ముంబయి.. అస్సాంకు పంపించేది దిల్లీనా, ఆర్సీబీనా? MIకి RCB సపోర్ట్!
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !