By: ABP Desam | Updated at : 03 Jan 2022 12:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
shivam dubey
కరోనా మూడో వేవ్ దేశవాళీ క్రికెట్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమ్‌ఇండియా యువ క్రికెటర్ శివమ్ దూబెకు కొవిడ్ సోకింది. బెంగాల్ రంజీ క్రికెట్ జట్టులో ఆరుగురు క్రికెటర్లు, సహాయ సిబ్బందిలో ఒకరికి కరోనా వచ్చింది. విషయం తెలియడంతో బీసీసీఐ, బెంగాల్, ముంబయి క్రికెట్ సంఘాలు నష్టనివారణ చర్యలు చేపట్టాయి.
మరికొన్ని రోజుల్లో రంజీ సీజన్ ఆరంభం కానుంది. ఇందుకోసం కోల్‌కతాలోని బెంగాల్ జట్టు సాధన చేసింది. ఇదే సమయంలో ఏడుగురు సభ్యులకు కొవిడ్ సోకడంతో ప్రాక్టీస్ సెషన్లను రద్దు చేశారు. బెంగళూరు పర్యటనను నిలిపివేశారు. జనవరి 8న ఆరంభమయ్యే ఎలైట్ గ్రూప్ బి మ్యాచుల కోసం బెంగాల్ జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది.
మహమ్మారి నేపథ్యంలో వారాంతంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా సోకిందని బెంగాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి దేవవ్రత దాస్ ఈఎస్‌పీఎన్‌కు తెలిపారు. సుదీప్ ఛటర్జీ, అనుష్టుప్ మజుందార్, కాజీ జునైద్ సైఫి, గీత్ పూరి, ప్రదీప్త ప్రమాణిక్, సుజిత్ యాదవ్, సహాయ కోచ్ సౌరాషిష్ లాహిరికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది.
కోల్‌కతాలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులు, ట్రైనింగ్ సెషన్లలో ఆటగాళ్లు, కోచ్ పాల్గొన్నారని సమాచారం. పాజిటివ్ అని తెలిసిన తర్వాత అందరినీ ఐసోలేషన్‌కు పంపించారు. బెంగళూరుకు వెళ్లేముందు కోల్‌కతాలోనే మ్యాచులు ఆడాల్సిన ముంబయితో కోల్‌కతా సన్నాహక మ్యాచులు ఆడాల్సింది. వీటిని ఇప్పుడు రద్దు చేశారు.
ఇక ముంబయి తరఫున ఆడుతున్న టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబె, జట్టు వీడియో విశ్లేషకుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ముంబయి జట్టు కోల్‌కతాకు బయల్దేరే ముందు వీరి ఫలితాలు వచ్చాయి. పాజిటివ్ అని తెలియడంతో వారిని ఐసోలేషన్‌కు పంపించారు.
దూబె స్థానంలో సైరాజ్ పాటిల్‌ను జట్టులోకి తీసుకున్నారు. కరోనా వల్ల కోల్‌కతాలోని స్థానిక క్రికెట్ టోర్నీలన్నీ రద్దు చేశారు. రంజీ ట్రోఫీ కోసం కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరువనంతపురంను బీసీసీఐ వేదికలుగా ఎంపిక చేసింది.
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
Also Read: IND vs SA 2nd Test: వాండరర్స్‌లో 'వండర్'కు సిద్ధమైన కోహ్లీ.. 7 పరుగులు చేస్తే ఆ రికార్డు బద్దలే!
Also Read: Team India Schedule 2022: ఏడాదంతా క్రికెట్ పండగే! టీమ్‌ఇండియాకు వరుసగా కీలక సిరీసులు.. ప్రపంచకప్
Also Read: Jasprit Bumrah: పేస్ బౌలర్లకు బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు.. అవసరమైతే బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు
MI vs DC: అర్జున్ తెందూల్కర్‌కు టైమొచ్చింది! ట్విటర్లో ట్రెండింగ్!
MI vs DC: ముంబయి.. అస్సాంకు పంపించేది దిల్లీనా, ఆర్సీబీనా? MIకి RCB సపోర్ట్!
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?
RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం
CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!
Subrahmanyam Death Case: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు, సుబ్రహ్మణ్యం మృతి కేసులో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్