Chanakya: ఆ విషయాల్లో మగవారి కన్నా మగువలే ముందుంటారట..!
మగువలు, మగవారు ఎనరు బెస్ట్ అంటే కొన్ని విషయాల్లో వాళ్లు ముందుంటే మరికొన్ని విషయాల్లో వీళ్లు ముందుటారు. అయితే ముఖ్యమైన కొన్నింటిలో మాత్రం పురుషుల కన్నా మహిళలదే పైచేయి అంటాడు చాణక్యుడు.
ఆ విషయాల్లో మగవారి కన్నా మగువలే ముందుంటారట..!
తన అసమాన ప్రతిభతో మౌర్య సామ్రాజ్య ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపింపజేసిన ఘనత ఆచార్య చాణక్యుడిది. దౌత్యవేత్తగా, రాజనీతికోవిదుడిగా, ఆర్థికవేత్తగా మన్ననలందుకున్న కౌటిల్యుడు… జీవితానికి సంబంధించిన చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడవారి, మగవారికి సంబంధించి చాణక్యుడు చెప్పిన ప్రతి మాటా తరాలు గడిచినా నిలిచిపోయేలా ఉంటాయి. ముఖ్యమైన కొన్ని విషయాల్లో పురుషుల కన్నా మహిళలే ముందుంటారని చెప్పాడు కౌటిల్యుడు.
తెలివి విషయంలో..
మహిళలకు మగవారి కన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. అందుకే వారు ఎలాంటి కష్టమైన పరిస్థితులనైనా హ్యాండిల్ చేయగలుగుతారు. ధైర్యం విషయంలోనూ పురుషులపై మహిళలదే పైచేయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అస్సలు భయపడరు. కౌటిల్యుడి చెప్పిన మాటల ప్రకారం మగవారి కన్నా మగువలకు ఆరురెట్లు ధైర్యం ఎక్కువ ఉంటుందట.
ఎక్కువ ఆకలి
ఫుడ్ విషయంలోనూ మహిళలదే పైచేయి. సాధారణంగా ఆడవారి కన్నా మగవారు ఎక్కువ తింటారని అనుకుంటాం . కానీ కౌటిల్యుడి ప్రకారం మగవారి కన్నా మహిళలే ఎక్కువ తింటారట. అంతేకాదు వారికి త్వరగా ఆకలి అవుతుందట. మహిళల శరీర కూర్పు కారణంగా వారికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయని, అందుకే వారు ఎక్కువ భోజనం తినాలని కూడా పెద్దలు చెబుతుంటారు. చాణక్యుడి చెప్పిందీ ఇదే…
పొదుపు విషయంలో పైచేయి…
చిన్నప్పుడు కిడ్డీ బ్యాంక్ దగ్గరనుంచి…పోపుల పెట్టె వరకూ…పొదుపు విషయంలో మహిళల్ని అస్సలు దాటలేరట మగవారు. షాపింగుల పేరుతో ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారని అనుకుంటా కానీ… పొదుపు విషయంలోనూ అంతకు మించి అనేలా ఉంటారట. ఎంత సొమ్ముతో షాపింగ్ చేయాలో.. ఏ వస్తువుకు ఎంత ఖర్చు చేయాలో వారికి బాగా తెలుసట. అలాగే డబ్బు ఆదా చేయడంలోనూ ఆడవారిదే పైచేయి.
లైంగిక వాంఛలు ఎక్కువే…
సాధారణంగా శృంగారాన్ని పురుషులతో ముడిపెట్టి చూస్తారు. కానీ మగవారితో పోలిస్తే మగువల్లో లైంగిక వాంఛ ఎనిమిది రెట్లు ఎక్కువని చెప్పాడు చాణక్యుడు. అందుకే మగవారు సంతృప్తి పొందినంత త్వరగా మహిళల్లో ఆ ఫీలింగ్ కనిపించదంటారు. ఇదే విషయాన్ని వైద్యశాస్త్ర నిపుణులు కూడా స్పష్టం చేశారు. దీనిపై ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. చాలా అధ్యయనాల్లో ఈ విషయాల్లో అమ్మాయిలదే పైచేయి అని తేలింది. సిగ్గు విషయానికొస్తే మగవారి కన్నా మహిళల్లో నాలుగురెట్లు ఎక్కవ సిగ్గుపడతారని స్పష్టం చేశాడు కౌటిల్యుడు.
కౌటిల్యుడికి స్త్రీ అంటే చిన్నచూపు ఉందనే అభిప్రాయం బలపడడానికి కారణం ఆయన అర్థశాస్త్రంలో పొందుపరిచిన కొన్ని విషయాలే. అవేంటంటే…
స్వభావరీత్యా స్త్రీ అబద్ధాల కోరు, ధైర్యవంతురాలు, మోసగత్తె, మూర్ఖురాలు, ఆశపోతు, అపవిత్రురాలు…ఇవన్నీ ఆమెలో ఉండే లక్షణాలు అంటాడు కౌటిల్యుడు. ఓ అమ్మాయి తనను ప్రేమిస్తోందని ఎవరైనా అనుకుంటే వాడికన్నా వెర్రివాడు మరొకడు ఉండడు. ఓ వ్యక్తితో సంభాషిస్తూ, ఇంకో వ్యక్తిని గమనిస్తూ, రహస్యంగా మరొకడిని ఇష్టపడుత ఉండే స్త్రీ ఏనాటికీ ఒక పురుషుడిని మాత్రమే ప్రేమించేలదని ఓ శ్లోకంలో చెప్పాడు చాణక్యుడు.
స్త్రీలు ఎంతమాత్రం నమ్మదగినవారు కాదని చెప్పిన చాణక్యుడు…వారిని గౌరవించాలని కూడా అన్నాడు. జన్మనిచ్చిన తల్లిదే ఎప్పటికీ ప్రధమ స్థానం అన్నాడు. చాణక్యుడి దృష్టిలో స్త్రీల బాధ్యత భర్తకు సేవ చేయడం, ఆయన చెప్పినట్టు వినడం, వంశాన్ని వృద్ధి చేయడమే. బుద్ధి మంతుడైన కొడుకు… తాను చెప్పినట్టు నడుచుకుని, సంపాదించిన దానితో సంతృప్తి చెందే భార్య ఉంటే ఆ ఇంటి మగాడు స్వర్గంలో ఉన్నట్టే భావించాలంటాడు చాణక్యుడు. అయితే ఆమె ఎంతమంది కొడుకులను ఇచ్చినా వారెవ్వరూ ప్రయోజకులు కాకపోతే ఆ ఇల్లు నరకమే అవుతుంది. పనికిమాలిన వందమంది మగపిల్లలు ఉండేకన్నా ప్రయోజకుడైన ఓ కొడుకు ఉంటే చాలంటాడు చాణక్యుడు.
వెలయాలు అయినా తనకు నచ్చని వ్యక్తికి లైంగిక సుఖం అందించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇష్టాయిస్టాలు ఉంటాయి ఆమెకు ఓ విటుడు నచ్చకపోతే అతడితో ఆమె సంగమించాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎవరైనా బలవంతం చేస్తే వారు శిక్షార్హులు అని చెప్పాడు కౌటిల్యుడు.
అప్పటి పరిస్థితుల ఆధారంగా కౌటిల్యుడు ఈ విషయాలు చెప్పినా వర్తమాన కాలంలోనూ చాలామందికి అవి వర్తించేలా ఉంటాయి.