అన్వేషించండి

గురువారం సబ్బుతో స్నానం చేయకూడదా? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు?

తలకు, ఒంటికి నూనె రాసుకోవడం, సబ్బుతో స్నానం చెయ్యడం ఈ రెండు పనులు గురువారం రోజున చెయ్యకూడదు. దీని వెనకున్న కారణాలేమిటో జ్యోతిషశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం.

జ్యోతిష్యమంటే.. కేవలం గ్రహస్థితి, జాతకం మాత్రమే కాదు. ప్రతి రోజు, తిథి, వార, నక్షత్రాలను అనుసరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నియమాలన్నీ కూడా శాస్త్రం వివరిస్తుంది.

గురువారం విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమయిన రోజు. గురుగ్రహానికి చెందిన రోజు. ఈ రోజున పసుపు రంగు ధరించడం శుభప్రదం. ఈరోజును ఉదయాన్నే దైవ ప్రార్థనతో ప్రారంభిస్తే అన్ని పనులు విజయవంతం అవుతాయని నమ్మకం. ఈరోజు ప్రారంభించే పనులన్నీటికి లక్ష్మీ దేవి ఆశిస్సులు లభిస్తాయని కూడా చెబుతారు. ఎందుకంటే విష్ణు ఆరాధన జరిగే చోట తప్పకుండా లక్ష్మి కొలువై ఉంటుందని ప్రతీతి. అయితే ఈరోజున కొన్ని పనులు అసలు చెయ్యకూడదని శాస్త్రం చెబుతోంది. సబ్బు ఉపయోగించి స్నానం చెయ్యడం, ఒంటికి లేదా తలకి నూనెతో మర్థనా చేసుకోవడం చెయ్యకూడదని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు చెయ్యకూడదో తెలుసుకుందాం.

గురుగ్రహ అనుగ్రహం

గురుగ్రహాన్ని నవగ్రహాలకు రాజుగా పేర్కొంటారు. జాతకంలో గురు స్థానం సరిగ్గా లేని వారు కష్టాలు అనుభవిస్తారని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు. గురు అనుగ్రహం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. గురువారం గురుగ్రహానికి చెందినది. అందుకే గురువారం కొన్ని పనులు చెయ్యకూడదని శాస్త్రం చెబుతోంది. గురువారం తలకు, ఒంటికి నూనె రాసుకున్నా, సబ్బు ఉపయోగించి స్నానం చేసినా గురు స్థితి నీచమవుతుందట. అందుకని విష్ణుమూర్తి, గురు గ్రహ అనుగ్రహం కావాలని అనుకున్న వారు ముఖ్యంగా స్త్రీలు గురువారం నాడు సబ్బు, షాంపూ ఉపయోగించి స్నానం చెయ్యడం, జుట్టుకు తైల సంస్కారం చేసుకోవడం చెయ్యకూడదు.

ఇంకెం చెయ్యకూడదు?

కేవలం సబ్బు, షాంపులతో స్నానం మాత్రమే కాదు ఈరోజున తలస్నానం చెయ్యడం, ఇల్లు దులిపి శుభ్రం చెయ్యడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేస్తే ఇంట్లో సంపద నశిస్తుందని, దారిద్ర్యానికి కారణం అవుతుందని జ్యోతిషం చెబుతోంది.

ఇలా చెయ్యడం వల్ల జాతక చక్రంలో గురువుస్థానం నీచపడుతుందట. ఇలా జాతకంలో గురువు చెడిపోతే వారి జీవితంలో నిరాశ నిస్పృహలు ఆవహిస్తాయట. గురువు చెడిపోయినపుడు జీవితంలోని మంచి విషయాలను గుర్తించలేరు. ఫలితంగా జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. అందువల్ల నిరాశ ఆవహించి డిప్రెషన్ కు కారణం అవుతుంది. గురువు బలహీన పడినపుడు ఆర్థిక విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అంచనాలు తప్పుతాయి. అందువల్ల మరిన్ని కష్టాల్లో కూరుకుపోతారు. అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతుంది, చుట్టూ ఉండే మనుషులతో సంబంధ బాంధవ్యాలు కూడా చెడిపోతాయి.

Also Read : వంట గదిలో పొరపాటున కూడా ఈ వస్తువులు పెట్టొద్దు - సమస్యలు వెంటాడుతాయ్!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget