By: ABP Desam | Updated at : 19 May 2023 06:00 AM (IST)
Representational image/pixabay
భారతీయ కుటుంబ వ్యవస్థలో కులదైవ ఆరాధన ఎంతో విశిష్టమైంది. అయితే ఈ రోజుల్లో చాలామందికి తమ కులదైవానికి సంబంధించిన సమాచారం కూడా ఉండడం లేదు. చాలా మందికి ఇంటి దేవతలుగా గ్రామ దేవతల వంటి వారే ఉంటారు. కొద్ది మందికి మాత్రం పురాణ దేవతలు కూడా కులదైవాలుగా ఉంటారు. కొందరికి దక్షిణామూర్తి, మరికొందరికి హయగ్రీవుడు కులదైవాలుగా ఉంటే మరి కొందరికి నరసింహస్వామి, వేంకటేశ్వరుడు, శ్రీరాముడు, పాండురంగడు ఇంటి దేవుళ్లు గా ఉంటారు. గృహంలో జరిగే ఏ శుభకార్యంలోనైనా గృహస్థులు ఈ దేవతలకు ప్రాధాన్యతను ఇచ్చి మొదట పూజించి తర్వాత ఇతర కార్యక్రమాలు జరుపుకోవడం ఆనవాయితీగా ఉంటుంది.
శుభకార్యాలు చేయాలంటే వినాయకుడి వంటి కులదేవత పూజ తప్పనిసరిగా చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ శాంతులు నిలిచి ఉండాలని పూర్వీకుల నుంచి కూడా కులదేవతారాధన చేస్తూ వచ్చారు. కుల దైవం కుటుంబాన్ని కాపాడుతుంది. అన్న రకాల అననుకూల శక్తుల నుంచి కుటుంబాన్ని రక్షిస్తుంది.
కులదైవాన్ని మరిస్తే కుటుంబం చుట్టూ ఆవరించి ఉన్న దైవ శక్తి రక్షణ చక్రం కనుమరుగవుతుంది. దీని కారణంగా ప్రమాదాలు, ప్రతికూల శక్తుల విజృంబణ, అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. రకరకాల అడ్డంకులతో కుటుంబ పురోగతి కుంటుపడుతుంది. కుటుంబంలో సంస్కారం క్షీణించడం, అనైతికత, అసమ్మతి, అశాంతి చెలరేగుతాయి. గ్రహచారం బాగున్నా కుటుంబంలో సంక్షేమం ఉండదు.
కులదైవానికి సముచిత స్థానం ఇవ్వక పోయినా, సరైన గౌరవం దక్కకపోయినా, సరైన రీతిలో ఆరాధించకపోయినా వారి శక్తి నశించి కుటుంబం కుంటుపడుతుంది. అలా జరిగితే మీరు ఏదేవతారాధన చేసినా కూడా అది వారికి చేరదు. బయటి నుంచి వచ్చే దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు చాలా సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
ప్రతి కుంటుంబానికి వారి కుల దైవానికి సంబంధించిన ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించి ఏడాదిలో ఒకసారి లేదా రెండు సార్లు ప్రత్యేకమైన రోజులలో కులదైవారాధాన ప్రత్యేకంగా చేస్తారు. ఇది కాకుండా శుభకార్యాల సమయంలో తప్పకుండా కుల దైవారాధన చేసుకోవాల్సి ఉంటుంది.
Also read : ఇన్ని రకాల చందనాలున్నాయా - ఏ దేవుడికి ఏ చందనం ప్రీతి!
Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి
Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!
జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం
జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !