అన్వేషించండి

Vastu Tips: ఇల్లు అద్దెదైనా, సొంతమైనదైనా అందులో నివసించే వ్యక్తిపైనే వాస్తు ఎందుకు అత్యంత ప్రభావం చూపిస్తుంది?

Vastu Tips in Telugu: అద్దె ఇల్లు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఇంటి దిశ, వెలుతురు , శక్తి ఒక వ్యక్తి ప్రవర్తన, సంబంధాలు, ఆర్థిక పరిస్థితిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Vastu Tips:  ఓ అద్దె ఇల్లు నుంచి మరో అద్దెంటికి మారినప్పుడు వారి జీవితాలలో తరచుగా ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరి ఉద్యోగాలు మెరుగుపడగా, మరికొందరి సంబంధాలు మెరుగుపడతాయి. అయితే, మరికొందరు కొత్త ఇంటికి మారిన వెంటనే ఒత్తిడి, ఆర్థిక సమస్యలు లేదా నిరంతర వివాదాలను ఎదుర్కొంటారు. దీనిని విధిగా కొట్టిపారేస్తారు, కానీ వాస్తు శాస్త్రం దీనిని కేవలం యాదృచ్ఛికంగా పరిగణించదు. 

వాస్తు ప్రకారం, ఒక వ్యక్తి నివసించే ప్రదేశంలోని శక్తి క్రమంగా వారి మనస్సు, ప్రవర్తన , నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగానే, సొంత ఇంటితో సమానంగా అద్దె ఇల్లు కూడా ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు నిపుణుడు ,  జ్యోతిష్యుడు పండిట్ సురేష్ శ్రీమాలి అభిప్రాయం ప్రకారం, ఆ ప్రదేశం యొక్క శక్తి ప్రభావాన్ని ఎక్కువగా అనుభవించేది ఇంటి యజమాని కాదు, అందులో నివసించే వ్యక్తే.

ఒక కొత్త ఇల్లు జీవితంపై ఎందుకంత ప్రభావం చూపుతుంది?

ప్రతి ప్రదేశానికి వేర్వేరు దిశ, వెలుతురు, గాలి ప్రసరణ ,అంతర్గత వాతావరణం ఉంటాయి. వాస్తు శాస్త్రంలో దీనిని శక్తి ప్రవాహం అంటారు. ఒక ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం ఉత్తమంగా ఉంటే, ఒక వ్యక్తి మానసికంగా ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటాడు. అయితే, నిరంతర చీకటి, చిందరవందరగా ఉండటం, వస్తువులు అస్తవ్యస్తంగా ఉండటం లేదా మూసివేసిన వాతావరణం వంటివి ఒక వ్యక్తి ఆలోచనా విధానంపై ప్రభావం చూపుతాయి. అందుకే కొంతమందికి కొత్త ఇల్లు మరింత ప్రయోజనకరంగా అనిపిస్తే, మరికొందరు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే అశాంతికరమైన భావనలను అనుభవిస్తారు. అద్దె ఇంట్లో పెద్ద మార్పులు చేయకపోయినా, ప్రధాన ద్వారం, పడకగది, వంటగది స్థానం , ఇంట్లోకి సూర్యరశ్మి ప్రవాహం వంటి చిన్న విషయాలు ఒక వ్యక్తి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని వివరించారు.

అద్దె ఇంట్లో వాస్తు పనిచేస్తుందా లేదా?

ఇల్లు తమ సొంతం కాదు కాబట్టి వాస్తు తమపై ప్రభావం చూపదని చాలా మంది నమ్ముతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, దాని ప్రభావం అక్కడ నివసించే వ్యక్తిపై పడుతుంది కానీ యజమానిపై కాదు. అద్దె ఇంటిని కూల్చివేయడం సాధ్యం కాదు, కానీ కొన్ని సాధారణ మార్పులు సహాయపడతాయి.

శుభ్రమైన, విశాలమైన ఇల్లు మనశ్శాంతిని కలిగిస్తుంది.

ఉదయపు వెలుగును లోపలికి రానిస్తూ క్రమం తప్పకుండా శుభ్రపరచాలి

ఇంటిని చిందరవందరగా ఉంచవద్దు...క్రమపద్ధతిలో సర్దిపెట్టండి

వాస్తు శాస్త్రంలో, ప్రధాన ద్వారం కేవలం ప్రవేశ ద్వారంగానే కాకుండా, ఇంటి శక్తికి ఒక ముఖద్వారంగా పరిగణిస్తారు. అందువల్ల, ప్రవేశ ద్వారం చుట్టూ ఉండే చిందరవందర, విరిగిన వస్తువులు లేదా చీకటి ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని అంటారు.

జలమా లేక అద్భుతమా? అగ్గిపుల్ల గీయగానే ఆ నీటితో దీపం ఎలా వెలిగిందో చూడండి!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

కాశీలో 9 రాత్రులు నిద్ర చేయాలనడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? వారణాసిలో ఆ 9 రోజులు ఏం చేయాలి?

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Embed widget