Dakshinayanam: కర్కాటక సంక్రాంతి 2025 - ఇవాల్టి నుంచి దక్షిణాయనం ప్రారంభం.. ప్రాముఖ్యత ఏంటి? ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ఏం చేయాలి?
Dakshinayana 2025: జూలై 16 నుంచి దక్షిణాయణం మొదలైంది. ఉత్తరాయణంలో దైవకార్యాలు నిర్వహిస్తారు.. దక్షిణాయంలో పితృకార్యాలు నిర్వహిస్తారు. ఇంకా దక్షిణాయనం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

Dakshinayana Punyakalam 2025: సూర్య భగవానుడి గమనం ఆధారంగా కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు.
భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే - ఉత్తరాయణం
భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరించినప్పుడు - దక్షిణాయనం
ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం
మకర సంక్రాంతి ( జనవరి 15 ) నుంచి ఉత్తరాయణం
కర్కాటక సంక్రాంతి (జూలై 16) నుంచి దక్షిణాయనం
సూర్యుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచరించిన ఆరు నెలల కాలం ఉత్తరాయణం
సూర్యుడు కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు రాశుల్లో సంచరించిన ఆరు నెలల కాలం ఉత్తరాయణం
ఏడాదిలో రెండు రోజులు మాత్రమే సూర్యుడు సరిగ్గా తూర్పున ఉదయిస్తాడు. అవి మార్చి 21 , సెప్టెంబరు 23..ఈ రెండు రోజులు మాత్రమే. మిగిలిన అన్ని రోజుల్లో 6 నెలలు ఈశాన్య దిశగా, 6 నెలలు ఆగ్నేయ దిశగా సూర్యుడు ఉదయిస్తాడు.
ఈశాన్యానికి దగ్గరగా సూర్యుడు ఉదయిస్తే అది ఉత్తరాయణం
ఆగ్నేయానికి దగ్గరగా సూర్యుడు ఉదయిస్తే అది దక్షిణాయనం
దేవతలకు ఉత్తరాయణం పగటి సమయం అయితే..దక్షిణాయనం రాత్రి సమయంగా చెబుతారు. దక్షిణాయనం సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. అందుకే మనిషి ఎదుగుదలకోసం ప్రత్యేక శక్తి అవసరం అవుతుంది. ఈ సమయంలో ఉపవాసాలు, పూజలు చేస్తారు. ఈ సమయం మొత్తం ఉపవాసకాలంగా భావిస్తారు. అందుకే యోగులు, పీఠాధిపతులు, మఠాధిపతులు చాతుర్మాస్య దీక్షచేపడతారు. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజు మొదలయ్యే ఈ దీక్ష కార్తీక పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశితో ముగుస్తుంది.
దక్షిణాయనం సమయం పితృదేవతల ఆరాధనకు అత్యంత ముఖ్యమైనది. ఈ సమయంలో తమ సంతానం అందించే తర్ఫణాలు స్వీకరించేందుకు పితృదేవతలు భూమిపైకి వస్తారు.మహాలయ పక్షాలు అనుసరిస్తే సంతానాభివృద్ధి జరిగి, ఆ ఇంట్లో సుఖశాంతులు వర్థిల్లుతాయని పండితులు చెబుతారు. దివికేగిన పెద్దల రుణం తీర్చుకునేందుకు ఇదే సరైన మార్గం...ఓ కృతజ్ఞతాపూర్వక చర్య.
శాస్త్రీయంగా కూడా దక్షిణాయనంలో సూర్యుడి కిరణాల వేడి తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. అందుకే బ్రహ్మచర్యం, ఉపవాసాలు, ప్రత్యేక పూజలు చేస్తే ..ఈ పేరుతో పాటించే నియమాల కారణంగా రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కర్కాటక సంక్రాంతి రోజు ఏం చేయాలి?
మకర సంక్రాంతి రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి దానధర్మాలు చేసినట్టే.. కర్కాటక సంక్రాంతి రోజు కూడా దాన ధర్మాలు చేయాలి. సూర్యభగవానుడిని పూజించాలి. శ్రీ మహావిష్ణు కవచం, విష్ణు సహస్రనామం పఠించాలి. ఈ రోజు పేదలకు అన్నదానం చేయడం అత్యంత శుభఫలితాలనిస్తుంది. పక్షులకు ఆహారం అందించాలి. గాయత్రి మంత్ర పఠనం ఆరోగ్యాన్నిస్తుంది
జూలై to అక్టోబర్ ఈ నాలుగు నెలలు ఈ నియమాలు పాటిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, జీవితంపై సానుకూల ప్రభావం..పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి!
జీవితం ఎటుపోతోందో అర్థంకావడం లేదా? అంతా ముగిసిపోయింది అనుకుంటున్నారా..అయితే ఇది మీకోసమే..ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించింది మాత్రమే. ఈ సమాచారాన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీకు నమ్మకమైన పండితులను, సంబంధిత నిపుణులను సంప్రదించండి.






















