Surya Gochar 2025: జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు ఈ రాశులకు అదృష్టం.. మీ రాశి ఉందా?
Surya Gochar in Kark Rashi 2025: కర్కాటక రాశిలోకి సూర్యుని ప్రవేశం ఈ రాశులవారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక్కడ తెలుసుకోండి

Surya Gochar 2025: మిథున రాశిలో సంచరిస్తున్న సూర్యభగవానుడు జూలై 16న కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఆగష్టు 17వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. కర్కాటక రాశిలో సూర్యుని సంచారం భావోద్వేగ స్థిరత్వం, కుటుంబ అభివృద్ధి, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన అంశాలపై ప్రభావం చూపిస్తుంది. ఈ రాశులవారిపై అనుకూల, ఎవరిపై ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం
మేష రాశి: సూర్యుడు 5వ ఇంటికి అధిపతి 4వ స్థానంలో సంచారం
కర్కాటకంలో సూర్యుడి సంచారం మేష రాశివారికి వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అనుభవజ్ఞుడైన వ్యక్తి లేదా ప్రభుత్వ సహకారం మీకు ముఖ్యమైన కాంట్రాక్టును అందించవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త ప్రతిపాదనలు రావచ్చు. కుటుంబ స్థాయిలో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. విద్యార్థులు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ప్రత్యర్థులు మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
వృషభ రాశి: సూర్యుడు 4వ ఇంటికి అధిపతి 3వ స్థానంలో సంచారం
మీ పని ప్రభుత్వ విభాగాలకు లేదా పరిపాలనకు సంబంధించినది అయితే త్వరలో ఆర్థిక ప్రయోజనం సాధ్యమవుతుంది. నిరుద్యోగులైన యువత కొత్త సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నించండి..భవిష్యత్తులో ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రేమ జీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ నెల రోజులు ఆహ్లాదకరంగా గడుస్తుంది. కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి: సూర్యుడు 3వ ఇంటికి అధిపతి 2వ స్థానంలో సంచారం
కర్కాటకంలో సూర్య సంచాలం మీ రాశి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ సమయంలో పండ్లు, ధాన్యాలు లేదా ఔషధ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరగవచ్చు. ప్రత్యర్థులు కుటుంబ సమీకరణాలను చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు తమపై నమ్మకం ఉంచాలి, ఇతరులపై ఆధారపడవద్దు. ప్రేమ ప్రతిపాదనకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
కర్కాటక రాశి: సూర్యుడు 2వ ఇంటికి అధిపతి మీ రాశిలోనే సంచారం
ఈ సమయంలో వ్యాపారంలో ఏదైనా చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది ..అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగం కోసం చూస్తున్న వారు ఇప్పుడు ప్రయత్నాలను వేగవంతం చేయాలి. ఇంట్లో చిన్న వివాదాలు వృత్తిపరమైన జీవితంపై ప్రభావం చూపుతాయి. విద్యార్థులు ప్రేమ సంబంధాల నుంచి దృష్టిని మరల్చి చదువుపై దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్ ను దూరం పెట్టండి. ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది.
సింహ రాశి: సూర్యుడు మీ రాశికి అధిపతి 12వ ఇంట్లో ఉన్నాడు
మీరు విదేశాలకు సంబంధించిన వారైతే వ్యాపారంలో మంచి లాభం పొందవచ్చు. ఉద్యోగంలో బదిలీ లేదా పదోన్నతికి అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో అడుగు ముందుకుపడుతుంది. కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మీరు నాయకత్వం వహించగలరు. సుదూర ప్రయాణాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య సంబంధిత సమస్యలను విస్మరించవద్దు.
కన్యా రాశి: సూర్యుడు 12వ ఇంటికి అధిపతి 11వ స్థానంలో సంచారం
ప్రభుత్వం, ఎగుమతి-దిగుమతి లేదా శక్తికి సంబంధించిన పనులలో విజయం సాధించే అవకాశం ఉంది. కార్యాలయంలో అకస్మాత్తుగా వచ్చే సమస్యను పరిష్కరించే బాధ్యత మీపై పడుతుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు ఉండవచ్చు..కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. విద్యార్థులు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అధికంగా ప్రయాణాలు చేస్తారు
తులా రాశి: సూర్యుడు 11వ ఇంటికి అధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ప్రణాళిక వేయడానికి సమయం అనుకూలంగా ఉంది. సీనియర్ అధికారులతో వ్యాపార సూచనలను పంచుకోండి. సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉన్నత విద్యలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. స్వల్ప జ్వరం లేదా అలసట ఉండవచ్చు. కుటుంబం లేదా పనికి సంబంధించిన ప్రయాణం సాధ్యమవుతుంది.
వృశ్చిక రాశి: సూర్యుడు 10వ ఇంటికి అధిపతి 9వ ఇంట్లో ఉన్నాడు
వ్యాపార విస్తరణకు బదులుగా ఆస్తి లేదా స్థలంలో మెరుగుదలపై దృష్టి పెట్టండి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త వినవచ్చు. ప్రేమ సంబంధాలు వివాహంలోకి మారవచ్చు. విద్యార్థులు ఊహించిన దానికంటే మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితుల నుంచి ఎక్కువ ఆశించవద్దు. ఆరోగ్యం పట్ల అవగాహన మిమ్మల్ని సమస్యల నుంచి దూరం చేస్తుంది.
ధనుస్సు రాశి: సూర్యుడు 9వ ఇంటికి అధిపతి 8వ ఇంట్లో ఉన్నాడు
వ్యాపార కార్యకలాపాలలో కస్టమర్ల సంతృప్తి మీ గుర్తింపు అవుతుంది. ప్రభుత్వ పనులకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో ఇంటి పునరుద్ధరణ లేదా వాహనం కొనుగోలు గురించి చర్చ ఉంటుంది. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది.
మకర రాశి: సూర్యుడు 8వ ఇంటికి అధిపతి 7వ ఇంట్లో ఉన్నాడు
వ్యాపారంలో సమస్యలు వస్తుంటే, కొద్దిగా మార్పులు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగులైన యువతకు ఇది ఒక సువర్ణావకాశం, ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు. కుటుంబంలో సహకారం ఉంటుంది. విద్యార్థులు అతిగా ఆలోచించవద్దు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు. దూరప్రాంత ప్రయాణం చేస్తారు
కుంభ రాశి: సూర్యుడు 7వ ఇంటికి అధిపతి 6వ ఇంట్లో సంచారం
మీ వ్యాపారం ఇప్పుడు ఇతర రంగాలకు విస్తరించవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో విభేదాలు ఉండవచ్చు ..సహనంగా వ్యవహరించండి. విద్యార్థుల అభ్యాస నైపుణ్యం మెరుగుపడుతుంది. ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి: సూర్యుడు 6వ ఇంటికి అధిపతి మరియు 5వ స్థానంలో సంచారం
ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా పాత వ్యాపారాన్ని విస్తరించడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు త్వరలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సహకారం విజయాన్ని అందిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇప్పుడు వేగాన్ని పెంచాలి. తలనొప్పి లేదా శరీర నొప్పుల గురించి జాగ్రత్తగా ఉండండి.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















