అన్వేషించండి

Weekly Horoscope 25 April to 1 May 2022: ఈ రాశివారు తమ అభిప్రాయాలను పక్కవారిపై రుద్దేస్తారు, మీరున్నారా ఇందులో ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

2022 ఏప్రిల్ 25 సోమవారం నుంచి మే 1 ఆదివారం వారఫలాలు

మేషం
ఈ వారం ఈ రాశి వ్యాపారులు లాభాలు పొందుతారు.  కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. వాదనల్లో విజయం ఉంటుంది. మీ పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలొస్తాయి...నిర్ణయం తీసుకోవడంలో విజ్ఞత ప్రదర్శించాలి. బయటి వారి జోక్యంతో పనిచేయడం వల్ల నష్టం జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ వారం అప్పులు తీసుకోకుండా ఉండండి. హోల్‌సేల్ వ్యాపారులు పెద్ద లావాదేవీలు చేసేటప్పుడు చెల్లింపు గురించి స్పష్టంగా తెలియజేయండి. వారం చివరిలో జాగ్రత్తగా ఉండండి.

వృషభం
 ఈ వారం బుధుడు సంచారం తర్వాత వ్యాపారంలో చాలా మార్పుంటుంది. మంచి లాభాలొస్తాయి.  జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.  ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు మీ పొదుపుపై ​​చాలా శ్రద్ధ చూపుతారు. దూరంగా ఉంటున్న బంధువులను కలుస్తారు. మంచి సమాచారం అందుకుంటారు. .స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు సహకరిస్తారు.  న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళానికి గురవుతారు. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ పని తొందరపాటు వల్ల ప్రభావితం కావచ్చు. విద్యార్థుల దృష్టి చదువునుంచి మరోవైపు మళ్లుతుంది. 

మిథునం 
ఈ వారం మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మంచి సలహాలు పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు. వ్యాపార సంబంధిత పనులు నిరూపితమవుతాయి. మీరు మీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. మీరు రహస్య విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. కెరీర్లో విజయం సాధించే అవకాశం ఉంది. మాటల్ని అదుపులో ఉంచుకోండి.  మనసులో ఏదో తెలియని భయం ఉంటుంది. లావాదేవీల వివాదాలు అకస్మాత్తుగా తీవ్రమవుతాయి. అపరిచితులను నమ్మవద్దు. ప్రయాణంలో నియమాలు తప్పకుండా పాటించండి. వారం ప్రారంభం మీకు చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. టెన్షన్ పెరుగుతుంది. 

Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...

కర్కాటకం 
ఈ వారం విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు.  మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.  వారం ప్రారంభం చాలా బాగుంటుంది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. ఉద్యోగ సమస్యలు తగ్గుతాయి. కుటుంబ జీవితం, ఉద్యోగంలో సమతుల్యత ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ఈ వారం చాలా మంచిది.  రుణం చెల్లించాలని ఒత్తిడి ఉంటుంది. మీ రహస్యాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. స్నేహితుడితో విభేదాలు పెంచుకోవద్దు. కొన్ని కారణాల వల్ల కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టవచ్చు.

సింహం 
 ఉద్యోగ ఆఫర్లు పొందుతారు. మీ జీవిత భాగస్వామి పట్ల సానుకూలంగా వ్యవహరించండి. కార్యాలయంలో వివాదాలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్త అందుకుంటారు. యువత తమ కెరీర్‌పై చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ వారం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది.   ప్రేమికులు పెద్ద పెద్ద వాగ్ధానాలు చేయొద్దు. ప్రతికూలతకు దూరంగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కన్య
నిలిచిపోయిన పనులు ఈ వారం పూర్తి చేస్తారు.  గృహ బాధ్యత పెరుగుతుంది.  పని ప్రదేశంలో భావసారూప్యత గల వ్యక్తులతో మీ స్నేహం పెరుగుతుంది. ఒకరి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. కండరాల నొప్పి సమస్య కావొచ్చు. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మరింత విశ్వాసం కారణంగా మీ పని ప్రభావితం అవుతుంది. వారంలో చివరి రోజు అంతబాగోదు. పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. ప్రేమ జంటలు కుటుంబ అంతరాయాలను ఎదుర్కోవచ్చు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి
 
Also Read: ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు

తుల
ఈ వారం చాలా బాగుంటుంది. ఉన్నతాధికారులతో సంబంధాలు బలంగా ఉంటాయి.  గొప్ప విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులు అధిక ధనలాభాన్ని పొందుతారు. అనుభవజ్ఞుల సూచనలను పొందడం వల్ల పనులు పూర్తి చేయగలుగుతారు. బాధ్యతల ఒత్తిడి చుట్టుముడుతుంది. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. కోపం తెచ్చుకోవడం మానుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.  వైవాహిక జీవితంలో గోప్యత పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు కొన్ని కొత్త ప్రయోగాలు ఎదురుకావచ్చు.

వృశ్చికం 
ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం ఈ వారం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.  శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధార్మిక పనుల పట్ల ఆసక్తి చూపుతారు. ప్రయాణం చేస్తారు.  ప్రేమ వివాహానికి కుటుంబసభ్యుల అంగీకారం లభిస్తుంది. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందగలరు. వారం ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. గుండెసంబంధిత వ్యాధులున్నవారు జాగ్రత్త. ఏదో విషయంలో టెన్షన్‌ పడతారు. కోపం తగ్గించుకోండి. 

ధనుస్సు 
ఈ వారం మీరు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పాల్గొంటారు.  ప్రజలు మిమ్మల్ని చాలా అభినందిస్తారు. కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ఇదే అనుకూలమైన సమయం. కష్టమైన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు రాజకీయాలు, చట్టపరమైన విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు. రుణ లావాదేవీలకు దూరంగా ఉండాలి.  ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

మకరం 
వారం ప్రారంభం చాలా బాగుంటుంది. పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు. ఆఫీసులో ఎవరితోనైనా వాగ్వాదం ఉంటుంది. కొత్త ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ మెచ్చుకుంటారు. మీ అభిప్రాయాలను ఎవ్వరిపైనా రుద్దొద్దు. వారం మధ్యలో ఇంట్లో సమస్య రావొచ్చు. ఆస్తి, రాజకీయ కారణాల వల్ల శత్రువులు పెరుగుతారు. కొంతమంది కారణంగా మీ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. 

Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?

కుంభం 
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.  కార్యాలయంలో మీ బాస్ మీ పనితీరు పట్ల సంతృప్తి చెందుతారు. నిరుపేదలకు గొప్ప సహాయం చేస్తారు. ఇంటర్నెట్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా మంచి సమాచారం అందుతుంది. సాహిత్యం, లలిత కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు పెరగుతాయి.  సోమరితనం వీడేందుకు ప్రయత్నించండి.  ఉపాధి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి.

మీనం 
ఈ వారం యువత ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వారం ప్రారంభం చాలా బాగుంటుంది. వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.మీ అసలు ఆలోచనలను  అందరూ అభినందిస్తారు.  కోపం తగ్గించుకోండి.  పనిలో బిజీగా ఉండడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతారు. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. కొంతమంది మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తికి సంబంధించిన పనుల్లో ఆటంకం ఉండొచ్చు.  మీపట్ల విధేయత చూపమని ఎవ్వరినీ బలవంతం చేయవద్దు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Embed widget