News
News
వీడియోలు ఆటలు
X

Vidura Niti In Telugu: డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి - ఎలా ఆదా చేయాలి, విదురనీతిలో చెప్పిన ముఖ్య విషయాలివే!

vidur niti in telugu: డబ్బు ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిల‌వ‌డం లేద‌ని చెప్పేవారిని చూస్తూనే ఉంటాం. మ‌రి మ‌న ఇల్లు ల‌క్ష్మీ నివాసం కావాలంటే విదుర నీతిలో ఏం చెప్పారో తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

Vidura Niti In Telugu: మహాభారత కాలం నాటి గొప్ప తత్వవేత్తలు, మార్గదర్శకుల్లో విదురుడు ముఖ్యమైనవాడు. పాండవ కౌరవ యుద్ధాన్ని ఆపడానికి విదురుడు స్వయంగా ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యం కాలేదు. ప్రతి ఒక్కరూ శాంతి మార్గాన్ని అనుసరించాలని బోధించిన వారిలో విదురుడు ప్రముఖుడు. ఆచార్య చాణక్యుడి తత్వశాస్త్రం త‌ర‌హాలోనే, విదుర తత్వశాస్త్రంలో మనం మానవ జీవిత సంక్షేమం కోసం అనేక విషయాలను తెలుసుకోవచ్చు. ధ‌నం నిర్వహణ గురించి విదుర నీతిలో అద్భుతమైన సూచ‌న‌లు ఇచ్చాడు.

Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి

విదుర నీతి

ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలను ఎప్పుడూ అంగీకరించాలి. సత్యం, ధ‌ర్మ‌ మార్గంలో నడవాలి. ఇవి మ‌న పూర్వీకులు, గురువులు చెప్పిన మాటలు. పెద్దల మాట పెడ‌చెవిన పెట్ట‌డం శ్రేయస్కరం కాదు. మహాభారత యుద్ధమే దీనికి నిదర్శనం. కౌర‌వ‌, పాండవ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించిన కౌరవులలో విదురుడు కూడా ప్రముఖుడు. కౌరవులు-పాండవులు ఎప్పుడూ ధర్మమార్గంలో నడవాలని బోధించిన వారిలో ఆయ‌న‌ ముఖ్యమైన‌వాడు. అయినా కౌరవులు విదురుడు మాట వినలేదు. యుద్ధం జ‌రిగింది. విదురుడి బోధ‌న‌ల్లో జీవిత విలువలు కనిపిస్తాయి. విదుర నీతిలో పేర్కొన్న అనేక‌ విధానాలు నేటికీ ఆచ‌ర‌ణీయ‌మైన‌వి. డబ్బు నిర్వహణలో విదురుడు చేసిన అనేక సూచ‌న‌లు ఎప్ప‌టికీ పాటించాల్సిన‌వే.

సంపాద‌న ముఖ్యం

మనిషికి డబ్బు, సంపద అవసరం. అందరూ దాని కోసమే పని చేస్తారు. జీవితంలో డబ్బు సంపాదించ‌డం చాలా ముఖ్యం. కానీ, మనం డబ్బు ఎలా సంపాదించ‌డం ఎంత ముఖ్య‌మో.. సంపాదించిన డబ్బును ఎలా ఖ‌ర్చు చేస్తామ‌నేది కూడా అంతే ముఖ్యమైనది. సంపద, సంపద సముపార్జన నిజాయితీగా ఉండాలని మన శాస్త్రం చెబుతోంది. ఇదే విధంగా ఖ‌ర్చు పెట్టే ప్ర‌తి పైసాపై స‌రైన నియంత్ర‌ణ ఉండాల‌ని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎంత సంపాదించినా డబ్బులు సరిపోవడం లేదని కొందరు ఎప్పుడూ అంటుంటారు. అంటే ఎంత సంపాద‌న ఉన్నా.. ఖ‌ర్చుపై సరైన నియంత్ర‌ణ‌, బాధ్యత లేకపోతే  అటువంటి సమస్య తలనొప్పిగా మారుతుంది. ప్రతి ఒక్కరూ నిజాయితీగా డ‌బ్బు సంపాదించి, అంతే జాగ్ర‌త్త‌గా ఖ‌ర్చు చేయాల‌ని విదుర నీతిలో సూచించారు.

Also Read: ఏప్రిల్ 19 రాశిఫలాలు, ఈ రాశివారు సన్నిహితుల్లో కొందరితో జాగ్రత్తగా వ్యవహరించాలి

సత్య మార్గంలో సంపాదన

లక్ష్మి చంచలమైనది. శాంతి, సంతోషం, పరిశుభ్రత ఉండే ఇంట్లో లక్ష్మి నివసిస్తుందని అందరికీ తెలుసు. ఐశ్వర్యాన్ని పొందాలంటే మనం పవిత్రంగా ఉండాలి. అంటే మనం ఎంత మొత్తంలో సంపాదించినా అది నిజాయతీతో సంపాదించాలి. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డబ్బును అంతే స‌మ‌ర్థంగా ఖ‌ర్చుచేయాలి. మ‌నం చేసే సత్కార్యాల ద్వారా లక్ష్మీదేవి మ‌న నివాసానికి శాశ్వతంగా వస్తుంది. అంటే కష్టపడి, నిజాయితీగా పని చేస్తూ డబ్బు సంపాదించాలి అని విదుర నీతి చెబుతోంది.

సోమరితనమే శ‌త్రువు

సోమరితనం అందరికీ శత్రువు. జీవిత సాఫల్య ప్రయాణంలో సోమరితనం పెద్ద అడ్డంకి. విదుర నీతిలో ఈ విష‌యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ సోమరితనాన్ని విడిచిపెట్టి, తమ ప‌నుల‌పై దృష్టి సారించాలి. విచక్షణతో పని చేయాలి. ఇది వారి జీవితానికి వెలుగునిస్తుంది. చురుకైన పనితీరు, స్వచ్ఛమైన మనస్సు, నిజాయితీగా ప‌నిచేస్తే డబ్బు ప్రయోజనకరంగా మారుతుంది. డబ్బు పెట్టుబడి, పొదుపు సరైన నిర్వహణతో అది నిరంతరం వృద్ధి చెందుతుంది. సరైన మార్గంలో సరైన ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలలో పాల్గొనాల‌ని విదురుడు సూచించాడు. అంతేకాకుండా సోమరిత‌నం ఉన్న వ్య‌క్తికి ఎప్పుడూ సంపదను అప్పగించక పోవ‌డ‌మే తెలివైన ప‌ని అని స్ప‌ష్టంచేశాడు. సోమరిత‌నం ఉన్న వ్య‌క్తి  సంపదను ఎప్పటికీ స‌రిగా కాపాడ‌లేడు. అతను ప‌నిపై దృష్టి పెట్ట‌కుండా, సంపదను వృథా చేస్తాడు. ఈ రోజు చేయాల్సిన ప‌నిని రేపటికి వాయిదా వేసుకుంటాడు. దీనివల్ల ఖర్చు పెరిగి, డబ్బు వృథా అవుతుంది. ఇలా జరగకూడదంటే నిజాయితీగా డబ్బు సంపాదించడంతోపాటు దాన్ని సక్రమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం.

అవ‌స‌ర‌మైనంతే ఖర్చు చేయండి

డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన మార్గంలో, సరైన మొత్తంలో ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. డ‌బ్బు ఉంది క‌దా అని ఖర్చు చేయడం, దుబారా ఖర్చు చేయడం, అధర్మ కార్య‌క‌లాపాల‌కు వినియోగించడం స‌రి కాదు. సంపాదించిన డబ్బును సరైన మొత్తంలో ఖర్చు చేయడానికి విదుర నీతిలో ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈరోజు గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని భవిష్యత్ ఉపయోగం కోసం ఉంచాలి. ఈ పొదుపు అత్యవసర సమయాల్లో సహాయపడుతుంది. ఇలా సరైన మార్గంలో ధనం సంపాదించడంతోపాటు, సరైన మార్గంలో సంపదను కూడబెట్టుకోవాలనే పాఠం కూడా విదురుడి సందేశంలో కనిపిస్తుంది. అంటే ఆదాయంతో పాటు ఖ‌ర్చుల‌ను తెలివిగా నిర్వహించడం జీవితానికి అత్యంత ముఖ్య‌మ‌ని విదురుడు చెబుతాడు.

మాన‌సిక నిగ్ర‌హం

సంప‌ద నిర్వ‌హ‌ణ‌లో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశం. డబ్బు సంపాదనతో పాటు డబ్బును ఆదా చేయడానికి మానసిక, శారీరక మరియు సైద్ధాంతిక నిగ్రహాన్ని పెంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనది అవసరం. ఆనందాలు, అభిరుచుల కోసం డబ్బును దుర్వినియోగం చేయడం మంచిది కాదు. దీనివల్ల శాంతిభద్రతలకూ భంగం వాటిల్లుతుంది. విచక్షణారహితంగా ఖర్చు చేయడం పేదరికానికి దారి తీస్తుంది. అందువల్ల గృహ, కుటుంబ అవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చు చేయడం చాలా ముఖ్యం. సుఖ, శాంతుల‌తో సంపన్నుడు కావాలి. మీ కుటుంబంతో ప్రేమ, స్నేహం, కష్టాలు, సంతోషాలను పంచుకోవడం ద్వారా సంతృప్తికరమైన జీవితాన్ని గడిపినప్పుడు మీరు డబ్బును ఆదా చేయగలుగుతారు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

Published at : 19 Apr 2023 07:00 AM (IST) Tags: cash flow vidur niti Vidur Niti in telugu money management

సంబంధిత కథనాలు

Yogini Ekadashi 2023 Date: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!

Yogini Ekadashi 2023 Date: యోగినీ ఏకాదశి విశిష్ఠత ఏంటి - ఈ రోజు ఏం చేయాలి!

shakuna shastra: శ‌రీరంపై బల్లి పడితే ఏమ‌వుతుంది..?

shakuna shastra: శ‌రీరంపై బల్లి పడితే ఏమ‌వుతుంది..?

Vidura Niti In Telugu: ఈ 4 అంశాల‌కు దూరంగా ఉంటే విజయం సాధిస్తారు!

Vidura Niti In Telugu: ఈ 4 అంశాల‌కు దూరంగా ఉంటే విజయం సాధిస్తారు!

secret donation : ఈ వ‌స్తువులు ర‌హ‌స్యంగా దానం చేస్తే దుర‌దృష్టం కూడా అదృష్టంగా మారుతుంది..!

secret donation : ఈ వ‌స్తువులు ర‌హ‌స్యంగా దానం చేస్తే దుర‌దృష్టం కూడా అదృష్టంగా మారుతుంది..!

Saturday Donts: శనివారం ఈ తప్పులు చేస్తే శని దోషం ఖాయం..!

Saturday Donts: శనివారం ఈ తప్పులు చేస్తే శని దోషం ఖాయం..!

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!

Nellore Gold Seized: నెల్లూరులో భారీగా బంగారం పట్టివేత, స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు!