News
News
వీడియోలు ఆటలు
X

ఏప్రిల్ 19 రాశిఫలాలు, ఈ రాశివారు సన్నిహితుల్లో కొందరితో జాగ్రత్తగా వ్యవహరించాలి

Rasi Phalalu Today 18th April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

ఏప్రిల్ 19 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీరు మతపరమైన పనులపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. ఏదైనా గందరగోళం కారణంగా నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోలేరు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. శారీరక, మానసిక అశాంతిని అనుభవిస్తారు. కార్యాలయంలో కూడా మీ పని అసంపూర్తిగా ఉండవచ్చు. తొందరపడి ఏదైనా పని చేస్తే నష్టపోయే అవకాశం ఉంటుంది.

వృషభ రాశి

ఈ రోజు ఆరోగ్యంగా , సంతోషంగా ఉంటారు. రోజంతా  బిజీబిజీగా ఉంటారు. కార్యాలయంలోని వ్యక్తులు మీ పనిని అభినందిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది.  ఈ రోజు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఒక ప్రణాళికపై పని చేయడం ప్రారంభించవచ్చు. కుటుంబ జీవితం సరదాగా సాగుతుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. 

మిథున రాశి

ఈ రోజు మీరు ఆధ్యాత్మిక వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది. మంచి అవకాశాలు అందుకుంటారు. కొత్త కెరీర్ కోసం ఎదురుచూస్తున్నట్టైతే..ప్రారంభించేందుకు ఈరోజే మంచి రోజు.  కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలు చేసే వారు లాభపడతారు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.

Also Read: ఏప్రిల్ 17 - 23 వారఫలాలు, ఈ వారం ఈ రాశులవారికి ప్రమాదం పొంచిఉంది జాగ్రత్తపడాలి

కర్కాటక రాశి

ఈ రాశివారు రోజంతా బిజిగా ఉంటారు. కార్యాలయంలో మీ లక్ష్యాలను చేరుకోవడంతో కొంత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. బయట ఆహారం తీసుకోవడం ద్వారా ఈ రాశివారు అస్వస్థతకు గురవుతారు. ప్రతికూల ఆలోచనలు మనస్సును శాసిస్తాయి. సన్నిహిత వ్యక్తులలో కొందరు చెడు చేసేవారున్నారు  జాగ్రత్తగా వ్యవహరించండి.

సింహ రాశి

ఈ రాశివారు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందగలరు. ఓ నిర్దిష్ట వ్యక్తి నుంచి ప్రయోజనాలు ఉండవచ్చు. ఆనందంగా ఉంటారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. మిత్రులను కలవవలసి వస్తుంది . నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సమావేశానికి సంబంధించి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.

కన్యా రాశి

ఈ రోజు ఈ రాశివారు లాభపడతారు. అనుకున్నసమయానికి పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులు మీకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సానుకూల మార్పు ఉంటుంది. శత్రువులను ఓడించగలుగుతారు. శుభవార్త అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఏ పని విషయంలోనూ అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.

Also Read: సంతోషం, సంపద, విజయం - ఈ వారం (ఏప్రిల్ 17 to 23) ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది

తులా రాశి

సాహిత్యంపై మీ ప్రత్యేక ఆసక్తి పెరుగుతుంది. మీరు మేధోపరమైన చర్చలలో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రణాళికను చక్కగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మీరు పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ప్రేమ జీవితంలో మాధుర్యం ఉంటుంది.వైవాహిక జీవితంలో పాత వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త శక్తితో పనులు ప్రారంభించగలుగుతారు.

వృశ్చిక రాశి

 ఈరోజు మీరు అలసిపోయినట్లు అనిపిస్తుంది.  కార్యాలయంలో పూర్తి శక్తితో పని చేయలేరు. చాలా పనులు అసంపూర్తిగా ఉండిపోవచ్చు. కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఇది మీకు కొంత అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. తండ్రి లేదా సోదరుడితో వివాదాలు ఉండవచ్చు. నిద్రలేమితో బాధపడతారు. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సమాజంలో గౌరవం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా నష్టపోతారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

ధనుస్సు రాశి 

ఈ రాశివారికి ఈ రోజు ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇంటి వాతావరణం బావుంటుంది. స్నేహితులతో కలసి బయటకు వెళతారు. ప్రమాదకర పనులు చేయవద్దు. ఆస్తి వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అనుకున్న పనలన్నీ పూర్తిచేస్తారు. 

మకర రాశి

ఈ రోజు మీకు సమర్ధవంతంగా గడిచిపోతుంది. అనుకూల పరిస్థితుల కారణంగా అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి. మానసిక ఆనందం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. భాగస్వామ్యం లాభిస్తుంది. అన్నదమ్ములు కలుస్తారు. ఈరోజు కొత్త పనులు ప్రారంభించగలుగుతారు. ఆఫీసులో మీ బాధ్యత పెరుగుతుంది. టెన్షన్‌ తగ్గుతుంది

కుంభ రాశి

కొన్ని పనుల విషయంలో గందరగోళం కారణంగా, మీరు సరైన నిర్ణయం తీసుకోలేరు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అనవసరంగా మాట్లాడొద్దు. ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకండి. చెడు సహవాసాన్ని వదిలివేయండి. తప్పుడు చర్యలలో పాల్గొనవద్దు. వివాహితుల జీవితం బావుంటుంది. ఖర్చులు నియంత్రించండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.

మీన రాశి

ఈరోజు మీనరాశివారు ఆనందంగా ఉంటారు. కొత్త పనుల ప్రారంభం లాభిస్తుంది. మీ పని సులభంగా పూర్తవుతుంది. వ్యాపారస్తులు లాభాన్ని పొందుతారు.స్నేహితులు, బంధువులతో కలిసి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఎక్కడికైనా వెళ్లే కార్యక్రమం చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మతపరమైన పనుల్లో ఖర్చు చేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Published at : 19 Apr 2023 05:31 AM (IST) Tags: Astrology rasi phalalu Horoscope Today Aaj Ka Rashifal Today Rasiphalalu astrological prediction today Horoscope for 19th April 19th APril Horoscope 19th April Astrology

సంబంధిత కథనాలు

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

June Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెలలో జన్మించిన వారి లక్షణాలివే

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

జూన్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు అనవసరమైన సలహాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు!

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా