అన్వేషించండి

Vastu Tips: బెడ్ రూమ్‌లో మంచం చుట్టూ ఈ వస్తువులు ఉంచకూడదు - ఇప్పుడే తీసేయండి, లేకపోతే సమస్యలే!

Vastu tips: చాలా మంది మంచం పక్కన రకరకాల వస్తువులను ఉంచుతుంటారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మంచానికి దగ్గరగా ఉంచడం అశుభంగా పరిగణిస్తారు. ఈ వస్తువులు మీ మంచం పక్కన వెంటనే తొలగించండి.

 vastu tips: బెడ్ రూమ్‌కు వాస్తు అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఎక్కువసేపు గడిపేది ఈ రూమ్‌లోనే. విశ్రాంతి తీసుకుంటాము. వివాహం అనంతరం భాగస్వామితో ఆనంద క్షణాలు గడిపేది కూడా ఈ రూములోనే. కాబట్టి బెడ్ రూమ్ అనేది వాస్తుపరంగా సరిగ్గా ఉండాలి. లేదంటే మన జీవితంపై పెను ప్రమాదాన్ని తీసుకువస్తుంది. బెడ్ రూమ్ వాస్తు మాత్రమే కాదు అందులో ఉండే మంచం విషయంలోనూ సరైన నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు పండితులు. మంచం చుట్టూ కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో వాస్తు దోషం పెరుగుతుంది. ఫలితంగా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే నిద్రించే ముందు ఈ వస్తువులను మంచం దగ్గర ఉంచకూడదు. దీని వల్ల ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. జీవితంలో అనేక అశుభ ఫలితాలు ఎదురవుతుంటాయి. పడుకునే ముందు మంచం దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

మంచం దగ్గర ఉంచకూడని 6 వస్తువులు ఇవే: 

అద్దాలు:

పడకగదిలో అద్దాలు పెడితే సానుకూల, ప్రతికూల శక్తిని ప్రతిబింబిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం, అద్దాలు ప్రతికూల శక్తిని కలిగి ఉన్నాయని భావిస్తుంటారు. ఇది పీడకలలు, నిద్రకు భంగం కలిగిస్తుంది. మీకు అద్దం అవసరమైతే, శక్తి ప్రవాహానికి అంతరాయం కలగకుండా ఉండటానికి అది రాత్రిపూట తీసి పక్కన పెట్టండి. లేదంటే మంచానికి ఎదురుగా ఉంచకండి. 

నీటి ఫౌంటైన్స్ :

అక్వేరియంలు లేదా ఫౌంటైన్‌లు వంటి నీటి మూలకాలు ఉన్న చోట ప్రశాంతంగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం ఇలాంటివి మీ పడకగదిలో ఉంచకూడదు. ఇలాంటి పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇవి నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. మీ బెడ్‌రూమ్‌ను ఎనర్జిటిక్ బ్యాలెన్స్‌లో ఉంచడానికి,  ఏవైనా నీటి ఫీచర్‌లను లివింగ్ రూమ్‌కి లేదా మరొక సరైన ప్రదేశంలో పెట్టండి. 

చిందరవందరగా ఉంటే..:

చాలా మంది బెడ్ రూములో వస్తువులను చిందరవందరగా ఉంచుతుంటారు. కానీ ఇలా ఉంచకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇది శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. అంతేకాదు విశ్రాంతి లేకపోవడం, నిద్రకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా నిద్రించాలంటే పడకగది శుభ్రంగా ఉంచుకోవాలి.  

మొక్కలు:

కొంతమంది పడకగదిలో మొక్కలు పెడుతుంటారు. కొన్ని ఇండోర్ మొక్కలు పడకగదిలో పెట్టకూడదు. మొక్కలు స్వచ్చమైన గాలి, ప్రశాంతంగా అనిపించినప్పటికీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. కాక్టి వంటి స్పైకీ లేదా ప్రిక్లీ మొక్కలు శక్తి ప్రవాహాన్నికి ఆటంకం కలిగిస్తాయి. అయితే మీ బెడ్ రూమ్ లో ప్రశాంతత, సంతోషంగా ఉండే వాతావరణం కోసం గుండ్రని, మృదువైన ఆకులు ఉన్న మొక్కలను పెట్టండి. 

ఎలక్ట్రానిక్ పరికరాలు :

చాలామంది మంచానికి దగ్గరగా సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, టాబ్లెట్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పెడుతుంటారు. అయితే ఇలాంటి పడకగది దూరం ఉంచాలని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ గాడ్జెట్‌ల ద్వారా విడుదలయ్యే విద్యుదయస్కాంత క్షేత్రాలు (EMFలు) మీ శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ పరికరాల ప్రతికూల శక్తులు మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. ఫైనల్‌గా మీకు నిద్ర కరువై.. రాత్రంతా మెల్కొవల్సి వస్తుంది. 

విరిగిన వస్తువులు:

సగం విరిగిన లేదా పగిలిపోయిన వస్తువులను ఎప్పుడూ కూడా పడకగదిలో ఉంచకూడదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇలా ఉంచితే మీ కోరికలు,కలలు నెరవేరవు. అంతేకాదు ఈ వస్తువులు మీకు అసౌకర్యంగా అనిపిస్తాయి. నిద్రకు భంగం కలిగిస్తాయి. గది వాతావరణాన్ని పాడుచేస్తాయి.  అలాంటి వస్తువులు ఏవైనా ఉంటే వెంటనే గదిలో నుంచి తీసివేయండి.

Also Read: చాతుర్మాస్య దీక్ష మొదలైంది..ఈ నాలుగు నెలలు పాటించాల్సిన నియమాలేంటి!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే.  ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget