News
News
వీడియోలు ఆటలు
X

Vastu Tips In Telugu: వీటిని ఇంట్లో అలంకరించుకుంటే దుష్టశక్తులు దరి చేరవు

ఇంటికి ప్రత్యేక అందాన్ని ఇవ్వటమే కాదు విండ్ చైమ్స్ ఇంట్లోకి అదృష్టాన్ని కూడా తెస్తాయని నమ్మకం. ఎలాంటి విండ్ చైమ్స్...ఎక్కడ అలంకరించుకోవడం మంచిది..ఈ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

Vastu Tips In Telugu: వాస్తు శాస్త్రంలో ప్రతి విషయం గురించి కూడా వివారాలు అందించారు మన పూర్వికులు. వాస్తులో విండ్ చైమ్ గురించి చాలా విశేషాలు చెప్పారు.  చైనీస్ వాస్తులో సైతం విండ్ చైమ్ కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, నెగెటివిటిని దూరం పెడతాయి. అంతేకాదు సంపద, ఆనందాన్ని కూడా తెస్తాయని నమ్మకం. అయితే ఇవి ఇంట్లో అలంకరించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. విండ్ చైమ్స్ గురించి వాస్తు ఏమి చెబుతోందో ఒకసారి తెలుసుకుందాం.

ఆహ్లాదకరం

వాస్తు ప్రకారం విండ్ చైమ్స్ అమర్చిన ఇంట్లోకి సానుకూల శక్తి తనంతట తానే ఎవరో ఆహ్వానించినట్టుగానే వచ్చేస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. వాస్తు చెప్పిన దాంటి బట్టి విండ్ చైమ్స్ అలంకరిస్తే ఇంట్లోకి అదృష్టం కూడా వస్తుంది. ఇంట్లోని వారికి అన్ని విషయాల్లో పురోగతి ఉంటుంది.ఆర్థిక పురోభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది.

Also Read: కుల దైవాన్ని విస్మరిస్తే కష్టాలు తప్పవా? శాస్త్రం ఏం చెబుతోంది?

ఎక్కడ అలంకరిస్తే బావుంటుంది?

ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఎక్కడైనా విండ్ చైమ్స్ అలంకరించుకోవచ్చని అనుకుంటారు. అయితే తలుపు లేదా కిటికికి వాటిని అమర్చడం చాలా ఉత్తమం. వాస్తు ప్రకారం గాలి వల్ల అవి కదిలి వాటి నుంచి శ్రావ్యమైన ధ్వని ఉద్భవిస్తుంది.  ఈ శబ్ధం ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కలిగిస్తుంది. అందువల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఎటువంటి చెడు ఇంట్లోకి చేరకుండా ఉంటుంది.

చాలా రకాలు

చెక్క, లోహం, టెర్రాకోటా, పింగాణి  ఇలా రకరకాల మెటిరియల్ తో తయారు చేసిన విండ్ చైమ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదైనా ఇంట్లో లేదా ఆఫీసులో, వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అయితే వీటి నుంచి వచ్చే ధ్వని మితంగా ఉండాలని మరచిపోవద్దు. ఎక్కువ ధ్వని చేసే విండ్ చైమ్స్ వల్ల మంచి జరగడానికి బదులు నెగెటివ్ ఎనర్జీని వ్యాపింప జేస్తాయి. కనుక ఈ జాగ్రత్త తప్పనిసరి. విండ్ చైమ్స్ ను ఆరుబయట కూడా వేలాడదీయవచ్చు. తోటలోనూ అమర్చుకోవచ్చు కానీ చెట్లకు వేలాడదీయవద్దు.

Also Read : ఇన్ని రకాల చందనాలున్నాయా - ఏ దేవుడికి ఏ చందనం ప్రీతి!

ఇంట్లో శక్తి ప్రసారం పెద్దగా ఉండదని బావించే ప్రదేశాల్లో విండ్ చైమ్స్ అలంకరించి అక్కడ శక్తిని ప్రేరేపించవచ్చు. బెడ్ రూమ్ లోపల లేదా బెడ్ రూమ్ కిటికి దగ్గర కూడ చాలా మంచిది. బెడ్ రూమ్ లో అలంకరించుకోవడానికి చెక్క లేదా వెదురుతో చేసిన విండ్ చైమ్స్ ఉత్తమమైనవి. బెడ్ రూమ్ లో బ్లూకలర్ లో ఉండే విండ్ చైమ్స్ అలంకరించుకుంటే నిద్ర లేమి వంటి సమస్యలకు పరిష్కారం దొరకుకుతుంది

ఏ దిక్కున పెట్టాలి

  • వాస్తును అనుసరించి పశ్చిమాన  మెటిరియల్ తో చేసిన విండ్ చైమ్ ను అమర్చుకుంటే ఇంట్లోని వ్యక్తులకు అదృష్టం కలిసొస్తుంది. పిల్లలు చదువులో రాణిస్తారు.
  • వాయవ్యంలో అమర్చిన లోహపు విండ్ చైమ్స్ ఇంట్లో సమృద్ధికి దోహదం చేస్తాయి. ప్రతికూల శక్తులు, దురదృష్టం పారద్రోలబడుతుంది.
  • నైరుతిలో అమర్చిన విండ్ చైమ్స్ దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.
  • ఉత్తరంలో అమర్చుకుంటే అదృష్టం కలిసొస్తుంది.
  • అల్యూమీనియం, ఇత్తడి, రాగి వంటి మెటల్స్ తో తయారు చేసిన విండ్ చైమ్స్ పశ్చిమ దిక్కున , ఉత్తర లేదా వాయవ్యంలో అమర్చుకోవడం మంచిది.
  • నైరుతి, ఈశాన్య, ఆగ్నేయ దిక్కులలో మట్టి లేదా పింగాణితో చేసిన విండ్ చైమ్స్ అలంకరించుకోవడం మంచిది.
  • దక్షిణ, తూర్పు, లేదా ఆగ్నేయంలో చెక్క తో విండ్ చైమ్స్ ఎంచుకోవడం మంచిది. వెదురు లేదా చెక్క ఉపయోగించి చేసిన విండ్ చైమ్స్ అలంకరించుకుంటే ఆయురారోగ్యాలను వృద్ధి చేస్తాయి.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

Published at : 21 May 2023 09:58 AM (IST) Tags: Feng Shui Vastu Tips wind chimes

సంబంధిత కథనాలు

12 Zodiac Signs Personality Traits: మీ తీరు ఎలా ఉంటుందో మీ రాశి చెప్పేస్తుంది!

12 Zodiac Signs Personality Traits: మీ తీరు ఎలా ఉంటుందో మీ రాశి చెప్పేస్తుంది!

జూన్ 10 రాశిఫలాలు, ఈ రాశివారు బలహీనతలను కవర్ చేసుకోవడం మానేస్తే మంచిది

జూన్ 10 రాశిఫలాలు, ఈ రాశివారు బలహీనతలను కవర్ చేసుకోవడం మానేస్తే మంచిది

Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!

Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!

Chanakya Niti: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధ‌మే

Chanakya Niti: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధ‌మే

Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!

Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?