Vasant Panchami 2024: ఫిబ్రవరి 14 న మీ పిల్లలతో ఈ శ్లోకాలు చదివించండి!
Vasant Panchami 2024: వసంతపంచమిని రోజు సరస్వతీ దేవిని పూజిస్తే అఖండ విద్యావంతులు అవుతారని నమ్మకం. ఇంట్లో పూజ చేసుకునేవారు ఈ శ్లోకాలు చదువుకోవడంతో పాటూ పిల్లలకు నేర్పిస్తే చాలా మంచి జరుగుతుంది
Vasant Panchami Special 2024 : ఫిబ్రవరి 14 వసంతపంచమి. ఈ రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని సరస్వతీ దేవికి నమస్కరించి ఈ శ్లోకాలు చదువుకుంటే మంచిది. మీరు చదువుకోవడంతో పాటూ ఇంట్లో ఉండే చిన్నారులకు, విద్యార్థులకు నేర్పిస్తే వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది
సరస్వతీ శ్లోకం
ప్రణో దేవీ సరస్వతీ
వాజేభిర్వాజినీ వతీ
ధీనామ విత్ర్య వతు ||
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవందినీ |
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ||
Also Read: ఈ వారం ఈ 7 రాశులవారికి అన్నీ మంచి ఫలితాలే - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః ||
సర్వఙ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వఙ్ఞే తే నమో నమః ||
Also Read: ఫిబ్రవరి 14న మీ రాశిప్రకారం చేయాల్సిన పరిహారాలివే!
పోతన చెప్పిన శ్లోకం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....
సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!
పై శ్లోకాన్ని నిత్యం 11 సార్లు చెప్పుకుని సరస్వతి దేవికి నమస్కరించాలి. ఆర్థిక సమస్యలతో చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయపడటం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల చదువుల తల్లి కరుణ ఉంటుందని చెబుతారు.
ఓం వాగ్దేవ్యైచ విద్మహే....బ్రహ్మపత్న్యైచ
ధీమహీ...తన్నో వాణీ ప్రచోదయాత్.
Also Read: ప్రేమికుల దినోత్సవం రోజే వసంతపంచమి, ఆ రోజుకున్న విశిష్టత ఇదే!
శ్రీ పంచమి రోజే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాకకోసం నేలనంతా పసుపుతో అలికాయా అనట్టుగా ఉంటుంది వాతవరణమంతా. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం. అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంతపంచమి రోజు బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తుంది. తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనులై ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆమెకు తొలిపూజలందిస్తారు.