అన్వేషించండి

Weekly Horoscope 12 To 18 February 2024: ఈ వారం ఈ 7 రాశులవారికి అన్నీ మంచి ఫలితాలే - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు

Weekly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ వారం ఈ 7 రాశులవారికి మంచి ఫలితాలున్నాయి.

Weekly Horoscope 12 To 18 February 2024:  ఈ వారం ఈ 7 రాశులవారికి అన్నీ మంచి ఫలితాలే  ఉన్నాయి....

మేష రాశి (Aries Weekly Horoscope )

ఈ వారం  మేషరాశివారికి చాలా అనుకూల సమయం. ప్రతి రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి చాలా బావుంటుంది. ఈ వారం చేసే ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది.  ఏ విషయంలోనూ తొందరపాటు పనికిరాదు. వైవాహిక జీవితంలో నిజాయితీగా వ్యవహరించాలి. గతవారంలో ఉన్న గందరగోళాలు తొలగిపోతాయి. 

Also Read: ఈ 5 రాశులవారికి ఈ వారం టైమ్ బాలేదు జాగ్రత్తగా ఉండాలి - ఫిబ్రవరి 12 నుంచి 18 వారఫలాలు

కన్యా రాశి  (Virgo Weekly Horoscope  ) 

ఈ వారం కన్యారాశివారికి అనుకోని ఆదాయం వస్తుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. వారం ప్రారంభంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా వారాంతం ప్రశాంతంగా ఉంటుంది. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో కొంత గందరగోళానికి గురవుతారు. వ్యాపారంలో సకాలంలో జాగ్రత్తపడితే లాభాలు పొందవచ్చు. ఉద్యోగులు పనిపట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి. చంచలత్వం కారణంగా మీకు ఇబ్బందులు తప్పవు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. 

Also Read: ఈ రాశులవారు ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఫిబ్రవరి 11 రాశిఫలాలు

తులా రాశి (Libra Weekly Horoscope  ) 

ఈ వారం తులా రాశివారికి అద్భుతంగా ఉంది. ఆర్థికంగా లాభపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. గతవారంలో ఎదుర్కొన్న గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు కలిసొస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ప్రేమలో ఉన్నవారు పెళ్లి దిశగా అడుగేసేందుకు ఈ వారం మంచి రోజు. అనవసర ఖర్చులు పెంచుకోవ ద్దు. ఇష్టదైవాన్ని స్మరించండి. 

వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope ) 

ఈ వారం వృశ్చిక రాశివారికి శుభఫలితాలున్నాయి. ఉద్యోగులకు మంచి జరుగుతుంది. గతంలో పెండింగ్ లో ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. తీసుకున్న నిర్ణయాలను ఉత్సాహంగా అమలుచేయాలి. సమయాన్ని వృధా చేయవద్దు. వ్యాపారులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రణాళికలు అమలు చేయడంలో సఫలమవుతారు. ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి మీకు సహకారం అందుతుంది.  ఇంటిని లేదా కార్యాలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంటారు..ఇది మీ స్థితిని పెంచుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. వారం చివర్లో కొంత విసుగ్గా ఉండొచ్చు. ప్రత్యర్థులపై నిఘా ఉంచాలి. పెట్టుబడి విషయంలో అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. 

Also Read: చాణక్య నీతి - విద్యార్థులు ఇవి పాటిస్తే భవిష్యత్ లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు!

ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 

ఈ వారం ధనస్సు రాశివారికి శుభఫలితాలున్నాయి. మీరు చేపట్టే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. ధనలాభం పొందుతారు. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తిపరమైన - కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోగలరు.  సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వ్యాపార భాగస్వామ్యాన్ని ప్రారంభించాల్సి రావచ్చు.  మీ ప్రత్యర్థులకు చెక్ పెట్టగలరు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.  జీవిత భాగస్వామితో వివాదం పరిష్కారం అవుతుంది...కుటుంబ సామరస్యాన్ని మరింత పెంచుతుంది. ఈ వారం మీరు ఆధ్యాత్మిక ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ రాశి ప్రేమపక్షులు పెళ్లి చేసుకునే ఆలోచన దిశగా అడుగే్తారు. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది 

మకర రాశి (Capricorn Weekly Horoscope ) 

మకర రాశివారికి ఈ వారం గ్రహాలు అనుకూలిస్తున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయాలి. ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలుచేస్తాయి. ఒంటరిగా ఏ పనీ చేయవద్దు. సమష్టి కృషి అవసరం. ఏ విషయంలోనూ తొందరపనికిరాదు. గత వారం గజిబిజి పరిస్థితి ప్రస్తుతం క్లియర్ అవుతుంది. మీ జీవితంలో కొత్త పురోగతి ఉంటుంది. సరైన సయంలో సరైన నిర్ణాలు తీసుకుంటారు. ఆరోగ్యం, ఆర్థిక స్థితి బావుంటుంది. పెద్దల ఆశీర్వాదంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు సానుకూల ఫలితాలు పొందుతారు.

Also Read: ఇవాల్టి నుంచి మాఘ గుప్త నవరాత్రులు - విద్య, ఉద్యోగంలో ఉన్నతికి ఈ 9 రోజులు చాలా ముఖ్యం!

మీన రాశి (Pisces Weekly Horoscope ) 

ఈ రాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. చేపట్టిన పనులు సక్సస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ బలహీనతల్ని అధిగమించే ప్రయత్నం చేయండి. కార్యాలయంలో మీ పనితీరు మీకు గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి అవసరం.  అనవసర ఖర్చులు నియంత్రించాలి. వాహనం లేదా స్తిరాస్థి కొనుగోలు చేయాలి అనుకున్న వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమికుల మధ్య అనవసర వాదనలకు అవకాశం ఇవ్వొద్దు.  

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget