వాలంటైన్స్ డే వసంత పంచమి ఒకేరోజు - విశిష్టత ఇదే!

ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు యూత్. అయితే ఇదే రోజు వసంత పంచమి కూడా వచ్చింది

మాఘమాసంలో ఐదోరోజు వచ్చే పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటారు. దీన్నే శ్రీ పంచమి, సరస్వతి పంచమి అంటారు

వసంత పంచమి రోజే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు.

శ్రీ పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ..ఆ పిల్లలు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం

సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధిని పొందుతారు.

ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు.

సరస్వతి దేవి కొలువైన బాసరలో..వసంతపంచమి వేడుకలు మరింత ప్రత్యేకం

ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతిలో రూపొందింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అన్న పేరు ఉండేది..కాలక్రమేణా బాసరగా మారింది.

Images Credit: Pinterest