Vaikuntha Ekadashi: ఈ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి లేదు....
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. కరోనా విజృంభిస్తుండడంతో అప్రమత్తమైన కొన్ని ఆలయాల అధికారులు దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ఉత్తరద్వార దర్శానికి భక్తులను అనుమతించడం లేదు
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా నిర్వహించే ఉత్తర ద్వార దర్శనం, తెప్పోత్సవానికి భక్తులకు పర్మిషన్ లేదని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఒమిక్రాన్ కారణంగా ఈ నెల 12న నిర్వహించనున్న తెప్పోత్సవంతో పాటు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అనుమతించడం లేదన్నారు. శాస్త్రోక్తంగా కొద్ది మంది అర్చకులు, వేదపండితుల సమక్షంలో కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆన్లైన్ లో టికెట్లను బుక్ చేసుకున్న వారికి తిరిగి క్యాష్ చెల్లిస్తామన్నారు. తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం కోసం భద్రాచలం రావద్దని సూచించారు.
Also Read: జనవరి 13 గురువారమే వైకుంఠ ఏకాదశి.. భక్తులంతా ఇలా చేయండి..
హైదరాబాద్ న్యూ నల్లకుంట సీతారామాంజనేయ సరస్వతీదేవి ఆలయంలో ఉత్తరద్వార దర్శనానికి అనుమతి లేదని ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేయించాలనుకునే భక్తులు ఆలయ గుమస్తా వద్ద టికెట్టు తీసుకుంటే వారు భక్తుల గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తారన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున తీర్థ, ప్రసాద వితరణ కూడా నిషేధమన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి కూడా అనుమతి లేదని..వైరస్ కట్టడికోసం అంతా సహకరించాలన్నారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
హైదరాబాద్ జగద్గిరిగుట్ట శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి, 14న గోదాదేవి కల్యాణానికి భక్తులకు అనుమతి లేదన్నారు ఆలయ ఈవో. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆదేశానుసారం కేవలం వేద పండితులు, సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
హైదరాబాద్ మూసాపేట డివిజన్ పాండురంగనగర్‌లోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, 14న గోదాదేవి కల్యాణాన్ని ఆలయ అర్చకుల సమక్షంలోనే నిర్వహిస్తామని కార్యనిర్వహణ అధికారి జీఏకే కృష్ణ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కల్యాణానికి భక్తులకు అనుమతి లేదని అంతా సహకరించాలని కోరారు...
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి