Vaikuntha Ekadashi : జనవరి 13 గురువారమే వైకుంఠ ఏకాదశి .. భక్తులంతా ఇలా చేయండి..
వైకుంఠ ఏకాదశి..దీన్నే ముక్కోటి ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది జనవరి 13 గురువారం వచ్చింది. వైకుంఠ ప్రాప్తి కలిగించే ఈ రోజున ఏం చేయాలంటే…
వైకుంఠ ఏకాదశి గురువారమే కానీ...ఏకాదశి తిథి మాత్రం జవనరి 12 బుధవారం సాయంత్రం నాలుగున్నరకే వచ్చేసి... జనవరి 13 సాయంత్రం ఏడున్నర వరకూ ఉంటుంది. కానీ హిందువుల పండుగల్లో కార్తీక పౌర్ణమి, అట్లతదియ, దీపావళి అమావాస్య లాంటి రాత్రి వేళ జరుపుకునే పండుగలు మినహా మిగిలినవన్నీ సూర్యోదయానికి తిథి ఉన్నరోజే పండుగ లెక్క. అందుకే ఏకాదశి బుధవారం సాయంత్రం వచ్చేసినప్పటికీ గురువారం సూర్యోదయానికి ఏకాదశి ఉండడంతో వైకుంఠ ఏకాదశి గురువారమే వచ్చింది. వేకువ జామునే వైష్ణవ ఆలయాల ముందు బారులు తీరి లక్ష్మీనారాయణుడిని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటారు.
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
సఫల ఏకాదశిగా భావించే ఈ రోజు ఉపవాసం చేస్తే అనకున్న వన్నీ నెరవేరుతాయని, అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజు ఉపవాసం చేసే కొత్త దంపతులకు ఉత్తమ సంతానం, ఏళ్ల తరబడి పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. తల్లిదండ్రులు ఉపవాసం చేస్తే పిల్లలకు ఆరోగ్యం , ఆయుష్షు ప్రాప్తిస్తుందంటారు విష్ణునివాసం అయిన వైకంఠ ద్వారం తెరిచి ఉంటుంది కాబట్టి..ఈ రోజు స్వామి కృపకు పాత్రులైన వారు మరణానంతరం ఆయన సన్నిధికి చేరుకుంటారట
Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
ఇలా చేయండి
- సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకుని చక్కని ముగ్గుతో లక్ష్మీదేవికి స్వాగతం పలకండి
- స్నానమాచరించి పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని నారాయణుడిని భక్తిశ్రద్ధలతో పూజించండి
- ముందుగా వినాయకుడికి దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి..అనంతరం శ్రీ మహావిష్ణువు అష్టోత్తరం కానీ, విష్ణుసహస్ర నామాలు కానీ పఠించండి
- వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదివి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి
- రోజంతా ఉపవాసం ఉండి కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకోండి..సాయంత్రం పండ్లు తిని జాగరణ చేయండి
- ద్వాదశి రోజు ఉదయం...అంటే..శుక్రవారం భోగి రోజు ఉదయాన్నే స్నానమాచరించి వంట చేసి భగవంతుడికి నివేదించి.. బ్రాహ్మణుడికి అన్నదానం చేసి ( బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కూరగాయలైనా ఇచ్చి నమస్కారం చేయొచ్చు).. మీ ఉపవాసం విరమించండి.
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
ఏకాదశి వ్రతనియమాలు
- జనవరి జనవరి 13న ఉపవాసం ఉండాలని భావిస్తే.. ఈ రోజు ( బుధవారం) సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ముందు రోజు నుంచీ నియమాలు పాటించాలి
- ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి రోజు ఉదయం భోజనం అయ్యేవరకూ బ్రహ్మచర్యం పాటించాలి.
- ఏకాదశి ముందు రోజు నుంచి, ఏకాదశి, ద్వాదశి వరకూ..అంటే మూడు రోజులు నేలపై నిద్రించాలి
- ఏకాదశి రోజు రాత్రి సినిమాలు చూస్తూ కూకుండా భగవంతుడి నామస్మరణతో జాగరణ చేయాలి
- నిత్యం మీ ఆలోచనా విధానం ఎలా ఉన్నా సరే...ఈ మూడు రోజులు చెడు ఆలోచనలు రానివ్వవద్దు.
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి